రాలుతున్న మొగ్గలు ______________ పుష్యమి సాగర్ ఇప్పుడు నేను చూస్తున్న సమాజం లో చిట్టి చిట్టి మొక్కలు తమ వేర్లను తామే తెగ నరుకుతూ ప్రశ్నల సాలె గూళ్ళలో చిక్కుకున్న జవాబు పురుగులా.. గింగిరాలు తిరుగుతూనే వున్నాయి ...!!!! లార్వా నుంచి puberty కి ఎదిగిన సీతాకోకచిలుకలు ..రంగుల ప్రపంచం లో అబద్దమే నిజమని భ్రమిస్తూ ఊహల్ని ఎగరేస్తూ ... చావు వుత్తరం లో ...కన్నీళ్లను తన వాళ్ళ కి అంకితమిస్తూ రోజుకో పేపర్ లో వార్తలు అవుతుంటాయి !!!! కూర్చొని మాట్లాడుకుంటే కొండంత సమస్య లు కూడా దూది పింజాలే ...కాని ఏమి చేస్తాం !!!! చెప్పటానికి పెద్ద తలకాయలకు తీరిక వుండదు డబ్బు మత్తు ను వంటి కి నిలువెల్లా ఎక్కించాక ... ఉడుకు రక్తం ఉగ్ర రూపమే ... మంచేదో ....చెడు ఏదో ...తెలియని ఉన్మాదం లో ... తరాల అంతరం దూరాలను పెంచుతుంటే బిక్క సచ్చిన భావోద్వేగం తరచి చూసుకుంటుంది తాను ఎక్కడ కరిగిపొయనొ అని .. అవును, ఈ కాలం లో వత్తిడి, ప్రేమ రాహిత్యం దొంతర్లలో ..ఎన్ని పువ్వులు వాడి పోయి రాలిపోతున్నా కూడా కళ్ళు తెరిచి చూడరెందుకు !!!! ఫిబ్రవరి 12, 2014 (చదువుల వత్తిడి కో, చిన్న చిన్న సమస్యలకి భయపడో తనువూ చాలిస్తున్న టీనేజర్ల వార్తలు చదివినపుడు కలిగిన వేదన )
by Pusyami Sagar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dI0aiS
Posted by Katta
by Pusyami Sagar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dI0aiS
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి