ll అందుకే .....ఈ మనసంటే ll ఎన్నో అనుబంధాలతో పరిచయాలు చేజారిపోతూ కొన్ని ఆత్మీయ హృదయాలు జ్ఞాపకాలనే జ్ఞాపికలుగా మిగిల్చే వేదనానిలయాలు పరిచయిస్తూనే ఉంటాయి కన్నీటి సంద్రాలు. ఏమి నేరం చేసాయనో బాధనంతా దత్తతనిస్తూ నయనాలకు వేదనల ఉప్పెనలే హృదయాలకు కష్టాలు తనకైతే కళ్ళకెందుకో ఈ చమరింతలు హృదయానికీ తప్పవు విషాదాల చెలమలు ఎవరినెపుడు దగ్గరకు చేర్చుకుంటుందో ఎందులకు విసిగి వేసారిపోతుందో అవమానాలంటూ ఆక్రోశిస్తుందో ఆశయాలకు సైతం హద్దులను చెరిపేస్తుందో ఏ ఆప్యాయతలను ముడివేసుకుంటుందో ఏ అనురాగాలను పెనవేసుకుంటుందో ఏ అవమానాలకు విలపిస్తుందో ఆశయాల సాధనకై పరుగులు తీస్తుందో అందరూ తనవారేనంటూ తనుమాత్రం ఏకాకినంటూ నిలకడే లేదంటూ హద్దుల గిరి గీసుకుంటూ ఆశ పడుతూనే ఉంటుంది అత్యాశలకు లోనౌతూఉంటుంది ఆనందాల పల్లకీలో ఊరేగుతూనే ఉంటుంది నచ్చిన వారి ఛాయే తానౌతుంది కలనైనా మైత్రి విడవనంటుంది ద్వేషంగానైనా ప్రేమిస్తుంది చిరు చింతలకే కన్నీటి ప్రళయమౌతుంది విధి రాతకందని వింతపాటలేవో పాడుతూనే ఉంటుంది మరి రాలేనంటూ మొరాయించే బాల్యానికై ఎదురుతెన్నులే కాస్తుంది జీవనయానంలో చిరు మజిలీయని తెలిసీ యవ్వనంలో మిడిసిపడుతుంది బాధ్యతల సుడిగుండాల కౌమార్యమంటేనే మండి పడుతుంది పసిప్రాయాన్ని తలపించే వృద్దాప్యమంటేనే అదిరిపడుతుంది అర్ధం కాని గ్రందమే తానంటుంది ఏ లిపికందని బాషై కూర్చుంది గమ్యమెరుగని పయనమే తానంటుంది తీరం చేరని కెరటమై ఎగసి పడుతుంది మనసున కెన్నో స్వప్నాలంటూ మౌనమే తన భాషంటూ ఊగిసలాడుతూనే ఉంటుంది ఊహల ఊయలలే ఊగుతుంటుంది ఉబలాటాలేవో పడుతుంటుంది కలతల సరోవరాన జలకమే ఆడుతుంది. అందుకే .....ఈ మనసంటే కొంత ఇష్టం - కొంత కష్టం కొంత ప్రేమ - కొంత ద్వేషం కొంత ఆవేశం - కొంత పరవశం కొంత అనురాగం - కొంత నైరాశ్యం కొంత ప్రణయం - కొంత ప్రళయం కొంత ఆనందం - కొంత విషాదం కొంత వైరాగ్యం - కొంత సౌరభం కొంత ఓదార్పు - కొంత నిట్టూర్పు కొంత లాలన - కొంత వేదన ఆశల నిలయం ఊసుల ప్రళయం ఊహల వలయం ఆనందాలే అతిశయం అందాలే వీవనం మారుతూనే అనుక్షణం సాగిపోయే జీవన వేదం ll సిరి వడ్డే ll 12-02-2014
by సిరి వడ్డే
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bLnHzJ
Posted by Katta
by సిరి వడ్డే
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bLnHzJ
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి