పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

20, ఏప్రిల్ 2014, ఆదివారం

బి. అభిరామ్ కవిత

మిత్రులకు శుభరాత్రి ....! వనరులెన్నిఉన్న తేగల మార్కులు సున్నా, జనులెంతమంది ఉన్నా మనలేరు అందరికన్నా, పుష్కరాలు గతించని మస్తిష్కాల్లో మార్పు లేమి, అస్తవ్యస్తాల వ్యవస్థలో మస్తుమస్తుల పాలనలో అవస్థలు పడే భారత మాత వేదనలో.!

by బి. అభిరామ్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hfaVuL

Posted by Katta

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: నీవు..: జీవన పోరాటపు ఆటుపోట్లను అవలీలగా ఎదుర్కొను శక్తిని నింపే హృద్యమయిన రూప చిత్రము నీవు కదా..! విజయ సోపానలనధిరోహించి చరిత్రను పునర్ లిఖింప అపూర్వావకాశమును సఫలీకృతంజేయు చైతన్య స్తోత్రస్సు నీవు కదా..! మనస్సున మమతల మల్లియ మాలలు కూర్చిన కన్నుల కదలాడు అత్మీయానురాగ తేజో కాంతి పుంజం నీవు కదా..! ఉల్లమును రంజించి నవరాగ సంగీత శోభలద్దిన సుమధుర స్వరఝరి నీవు కదా..! డెందం ఆమంద కందలిత అరవిందభరితమయ్యే సున్నితోజ్వల సుకోమల చేతనావర్తిత చేష్ట నీవు కదా..! మానవత్వం మూర్తీభవించి రేబవళ్ళు తెలియక భవదీయుని నామ జపమున ప్రణయ తత్వమును శిఖరంజేర్చిన ప్రేమమూర్తివి నీవు కదా..! మాటలకందని భావాలకు కవితలకందని కమ్మదనాలకు అనుభూతులకందని ఆశ్చర్యాలకు ఎల్లలు తేలియని తీయదనాలకు చిరునామా నీవు కదా..! 20/04/2014

by Kontham Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lqmhV8

Posted by Katta

ShilaLolitha Poet కవిత

ఉమ్మ నీటి సరస్సులో~~~__ ________________ అదొక చిగురు మొగ్గ అప్పుడే పూచిన లేలేత పరిమళం హిమాగ్ని జ్వాలల్లో ఉదయించే దీప శిఖ చీకటి గర్భ కుహరాల్లోంచే ఆలోచనల మొలకల్ని జల్లుకుంటూ వచ్చింది మునగ దీసుకుని పడుకున్న క్షణాల్లోనే తానెవరో తెలీక పోయినా స్కానింగ్ కిరణాలు ఒళ్ళంతా తడిమి తొలిసారిగా తానెవరో చెప్పినప్పుడు ఒక్క అమ్మ తప్ప అందరూ వాడిన మాటల కత్తుల గుత్తులు నాపై జళిపించి నప్పుడు తొలిసారిగా చెవులున్నందుకు దుక్కం వచ్చింది నన్ను నేనే చూసుకోలేక పోతున్నాను నాపై అప్పుడే ఈ యుద్దరావాలేమిటి ? నా ఒంటరి పోరాటానికి మొదటి మెట్టు మొదలైనదప్పుడే ! నా కోసం అమ్మ చేస్తున్న పోరాటానికి అమ్మా!నేనున్నానని చెప్పాలని తపన గుండె ఉంది కానీ గొంతు లేదు కదా బాధ ఉంది కానీ చూపించలేను కదా మనిషినేకానీ సగం మనిషినే కదా ! ఈ ఉమ్మనీటి సరస్సులోనే నేనొక నెత్తుటి కలువై ఒలికి పోతానో రవ్వల మెరుపై వెలుగు చూస్తానో తెలీదింకా కానీ నాకు మా అమ్మ ఒళ్ళో ఒదిగి పోవాలనుంది!

by ShilaLolitha Poet



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i28Low

Posted by Katta

John Hyde Kanumuri కవిత

దేహ సంఘర్షణ || జాన్ హైడ్ కనుమూరి || నిదురలోనూ మెలకువలొనూ కవిత్వం పంట పండుతోంది కోత కోయడానికో కుప్ప నూర్చడానికో పరుగెడుతుంటాను రాత్రంతా రాలిన గింజల్ని లెక్కించాలని కన్నులేవో చూస్తుంటాఅయి పొయ్యిలో లేవని పిల్లితో సహచరి యాతనపద్తూంది కొత్తగా వచ్చిన దోమేదో పిల్లల్ని ముద్దాడినట్టుంది ఒక్కటే ముద్దుల పలవరింతలు తేలికౌతున్న దేహాన్ని బంధాలన్నీ లాగిపడ్తుంటాయి వెదజల్లే విత్తనాలు రుచించని ఆహారమై కంపిస్తుంది పిడికిలి పట్టిన గింజలు వెదజల్లడం కోసమే! దున్నబడ్డ భూమిలో వెన్నొంగిన పంటకోసేందుకు కొత్తతరం ముందుకొస్తుంది .....................................................28.9.2011.......20.4.2014

by John Hyde Kanumuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i25q8O

Posted by Katta

Renuka Ayola కవిత

కోరుకున్న సంభాషణ వేళ్ళలోతులలో రంగులుముంచి మనసు గుమ్మాలకి కుంచె లు ఆనించి ఉదయం నుంచి అర్దరాత్రి వరకు రంగులలో నానిన చిత్రం ప్రదర్శనలో గోడ గుండెల మీద నిల్చోగానే సముద్ర ఆగధత్వం, ఆనందం, ఆత్మపిలుపు చూస్తారని ఎదురుచూడడం మొదలు పెట్టింది ఎన్నో జతల కళ్ళు నీరెండమెరుపులా వాలి సౌందర్యాన్ని దిగులులోముంచి చర్చిస్తూ అర్దంకాని సమూహలుగా పక్షుల గుంపులై ఎగిరిపోయాయి దేహాన్ని ఆవరించిన ప్రేమ నేత్రాలలో ప్రకాశించడం తామరపూలు వికసించి నవ్వడం ప్రేమించిన స్త్రీ పెదవులమీద మోహరించిన నవ్వుని చూస్తారని వెతకడం మొదలుపెట్టింది పడకగది గోడలమీద ఆనుకుని వాళ్ళనేచూస్తూ రంగులతో ఎప్పటికైనా సంభాషిస్తారని రంగులలో ముఖాలు స్పర్శలు వెతుకుతారని కళ్ళువిప్పార్చి చూస్తూనే ఉంది ఒక మాటకోసం ఒక ముఖం కోసం ఒక సంభాషణ కోసం.... (సారం గాలో ఒక కప్పు కాఫీ శీర్షికలో కృ ష్ణ ఆశోక్ గారి చిత్రాలు చూసాక రాసిన కవిత ఇది )

by Renuka Ayola



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fbVeES

Posted by Katta

Sriramoju Haragopal కవిత

తవ్వుకుంటుపోతే రక్కసిగుడి నొకటి తవ్వి చూసాం ఏమున్నాయక్కడ ఇన్ని ఎముకలు అన్ని కుండలు, కుండల్లో వడ్లవో, గోధుమలవో ఉనుక ఆ కుండలపై బొమ్మలు, రాతలు చుట్టూ పేర్చిన బండరాళ్ళు పెట్టెలాగా ఆ మనిషి ఆడమనిషే, అవి ఆమెవే వస్తువులు కాళ్ళకు కడియాలు, చేతులకు గాజులు ఏవో లోహానివి మెడకు తీగెకు గుచ్చిన రంగు రంగుల రాళ్ళపూసలదండ ఆమె పక్కన పెట్టిన కుండల్లో ఏవేవో మట్టిబొమ్మలపలకలు ఆడుకున్నవే కావొచ్చు గవ్వలసంచొకటి, బొక్క బొట్టుపెట్టొకటి చుట్టు వెతుక్కుంటుపోతే అక్కడొక రోలు, రుబ్బురాయి, విసురురాయి ఇంకొంచెం దూరాన ఒర్రె పక్కన పాటిగడ్డ పాతయిండ్ల ఇటుకలపోగులు అక్కడొక గుంటతవ్వి మట్టిపొరలలోపలికి దూరిపోతే ఆమె అక్కడే వంటచేసుకుంటు కనబడ్డది చంటిబిడ్డకు పాలిస్తూనే పనులన్ని సవరిస్తున్నది అతిథులవంటి మమ్మల్ని చూసి వాళ్ళాయన వొచ్చేదాకా ఆగమంది మేం అరుగు మీద కూర్చున్నాం కెమెరా తీసి ఫోటోలు తీస్తున్నాం గుడిసెకప్పు మీద గుమ్మడితీగెలు, పచ్చటిపూలు, కాయొకటి తెగిందేమొ వొచ్చి మా వొల్లోపడ్డది కల రాలిపోయింది మళ్ళీ ఆమె సమాధి ఒడ్డున మేం అపుడు కూడా అంతేనా ఆడది? ఇప్పటి సంకెళ్ళలోనేనా వున్నది?

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1joIfCp

Posted by Katta

Kanneganti Venkatiah కవిత

కన్నెగంటి లిమరిక్కు...నోటా...పీటా,,,!? నోటా ఎవరూ నచ్చలేదని తెలిపే మీట ఇది అసంతృప్తుల మనసులో మాట ఓటర్లందరూ పాడారనుకో ఇదే పాట అభ్యర్థులేమో ఇంటిబాట!?నోటా ఎక్కుతుందా పీట!? 20.4.14.

by Kanneganti Venkatiah



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eQsOFD

Posted by Katta

Vani Koratamaddi కవిత

//కన్నిటి జీవనం...!// అంకురమైన నీ రూపం అంతులేని అనందం మరునిమిషం నుండే తడిమిచూసుకునే తరుణం కోసం తలపించా.. పసిబిడ్డగా స్పర్శించి పరవసించిపోయా అనుక్షణం అతి జాగ్రత్తగా గాజుబొమ్మలా... ఎదుగుదలకి తపస్సే చేశా,, ప్రయత్నాలు విఫలించి. విధి వెక్కిరించి వ్యధకు గురి చేసి నీ స్పర్శనే దూరంచేసి కన్నిటి సంద్రంలో పడవేచి నిజమైన నీ రూపం.. నిజం కాని మా స్వప్నం విధి వెక్కిరించిన వైనం.. అనంతలోకాలకి నీ పయనం.. కొనసాగుతున్న మా కన్నిటి జీవనం...! ......వాణి కొరటమద్ది

by Vani Koratamaddi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Pja9Gr

Posted by Katta

Anil Atluri కవిత

"శివారెడ్డి లాంటి కవిని ఇచ్చిందోయ్ తెనాలి తెలుగునాట ప్రతి తల్లీ ఇలాంటోణ్ణి కనాలి" అని Devipriya Tadikonda అంటే సభాముఖంగా తెలియజేసిన వారు Sudhakar Yendluri . సందర్భం; "రన్నింగ్ కామెంటరి" ఆవిష్కరణ సభ http://ift.tt/Pja9Gp శివారెడ్డి సాహిత్యం ఇదిగో: http://ift.tt/1eQqEpD ఆచార్య సుధాకర్ సాహిత్యం: http://ift.tt/1eQqEpH

by Anil Atluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PjabOw

Posted by Katta

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ ____గాజుదేహం --------- కోట్ల కణాలను తనువునుండి ఒక్కొక్కటిగా త్యజిస్తూ నిలబడిన ఓ గాజుదేహం . స్వేధంలో అలసి ఒకసారి, రుధిరంలో తడిసి మరోసారి ఇప్పుడు నెరళ్ళు తీసిన భీడుభూమిలా . అవయవాల కొసన వేలాడుతూ.. అవసాన ప్రాయం వీడలేక ముతకచర్మం నిశభ్ధ తపన . గుండె గదుల్లోని మాటలు.. గొంతు పెగలక మూగ రాగాలుగా పెదవుల గోడలనుండి లాలాజలంలా జారుతూ . చలనాల్ని అనుభవాల అగాధాల్లొకి వొంపేసి తనని తాను ఇంటిమూలలో ఇనుప కొక్కేనికి తగిలించుకుని . కదలని అడుగులు.. పెనవేసుకోలేక వాడిన లతల్లా విడుతూ ఆకురాల్చే ఋతువుకై ఆత్రంగా . ఈ జన్మకు మరో పుట్టుక కావాలి కానీ ప్రతిక్షణం పగిలే గాజుదేహంలా కాదు ! (20-04-2014)

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eQqEpu

Posted by Katta

Chand Usman కవిత

చాంద్ || నాలుగు కాళ్ళు || నాలుగు కాళ్ళు మనమంతా పుట్టింది వాటికే ******* అవి జతగా కలిసి పంచుకున్న జీవితాన్ని దాదాపు నీకు నాకూ ఖర్చుచేసేసాయి ఎదురుగా ఉన్న తలుపుల నుండి కాదు చిల్లుపడిన లోపలి గోడలు నుండి చూడు ఇప్పుడు అది దేహాలను కాదు మనసులను ఒక్కటి చేసే దాంపత్యం ******* బరువైన జీవితం క్రింద నలిగి చచ్చుపడిన మనసులు అవి ముసలితనానికి వ్రేలాడుతున్న దేహాలకు ఊతమిచ్చే పిల్లలో పిల్లలాంటివాళ్లో లేక పిట్టలు వాలని మోడులా బహుశా మనమే వదేలేసామేమో ******* నాలుగు కాళ్ళు ఏమి మాట్లాడుకుంటాయి మన బాల్యం గురించే కదూ అవేగా నిజంగా అవి బ్రతికిన రోజులు అందుకేనేమో పచ్చటి జ్ఞాపాకలను గుమ్మాలకి కట్టుకొని ఎదురుచూస్తున్నాయి ******* నాలుగు కాళ్ళు రెండే అడుగులు జీవితాన్ని గెలిచి మిగిలిన దూరాన్ని దాటుతున్నాయి మీ చాంద్ || 20.04.2014 ||

by Chand Usman



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i194jq

Posted by Katta

Swarnalata Naidu కవిత

శ్రీస్వర్ణ || ముక్కుపుడక || ముక్కుపుడక మెరిసేది ముద్దులొలికే నీ మోము చూసే ! నీ వలపుల శ్వాసతో వెలిగే పుడక ..తళుకులీనే మెరుపురవ్వలతో కోహినూర్ వజ్రానికీ మెరుగులు పెట్టొచ్చు ! నీ పలుకుల్ని చెవులారా విన్నపుడు గుండె కవాటాలలో గుట్టుగా దాచినపుడు తేనెసోనలు తనువంతా వ్యాపించి సిందూర వర్ణాలే పులుముతుంది ! నీ నిశ్వాసలో వినిపించే నిశ్శబ్దరాగాలకి పులకించే ముక్కుపుడక బుంగమూతిలొ దాగిన అలుకలన్నీ నా నాసిక చటుక్కున ఒడిసిపట్టి నీ ముక్కును ముద్దాడి వినిపిస్తుంది ఆత్రంగా ! నీ సరసాల సంద్రంలో సన్నజాజుల అలల నురగల పూలు ఆత్మీయ ఆలింగనాలు .. సిగ్గుల తాంబూలాలు జార్చే నిట్టుర్పుల సెగలు..నాసికాభరణానికి నయనానందకరం ! పగలంతా మూగబోయిన మందారంలా గమ్మున కూర్చుంటుoదా.. గోధూలివేళ పగటి పరవశాలన్నీ వార్చి చిలిపి కబుర్ల పొట్లాలన్నీ విప్పుతూ గంధపు చినుకులు ఎదపై జార్చుతూ గుమ్మరించేస్తుంది గుప్పెడు నవ్వుల వజ్రపురాశులు..వెన్నెల వాకిట్లో !

by Swarnalata Naidu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1toq0np

Posted by Katta

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ కవిత

కత్తిమండ ప్రతాప్ || మనసు లోతు|| =========================== = మనసు అగాధాల మధ్య నెర్రలు తీసింది గాయాలు గులకరాళ్లై గుచ్చుకుంటున్నాయి తడి ఆరని గుండెలు తరాలుగా తరుక్కుపోతున్నాయి నెర్రల మధ్య అంతరాలు తొంగి చూస్తున్నాయి శిధిలమైన గతాలు మట్టి పెల్లలులా విరిగిపడుతున్నాయి లోతుల్లో గతాలు స్వగాతాలై వెక్కిరిస్తున్నాయి ఆరని తలరాతలు ఇంకా మండుతూనే ఉన్నాయి మంటల్లో ఆలోచనలు ఉడికి పోతున్నాయి మనసు వేడెక్కి ఎర్రగా అన్వేసిస్తుంది బీటలు తీసిన బాటల్ల ఆలోచనలు సాగుతున్నాయి మట్టి పొరల మధ్య దాగిన ఇసుక లోతుల్లో గమ్యం ఊట నీరులా కనపడుతుంది తవ్వే కొద్దీ జ్ఞాపకాలు బయలు పడుతున్నాయి మనసు లోతు ఒక అగాధంలా కనిపిస్తుంది గుండె గునపమై తవ్వుతుంది ఎన్నో ముద్రలు సజీవ దృశ్యాలై మట్టిలో కలిసిపోయాయి అచేతన స్థితిలో మనసును పడుకోబెట్టి చేతన స్థితిలో వడ్రంగి పిట్టలా డ్రిల్లింగ్ చేస్తూ తొలిచే ఆలోచనలు పదిలం చేస్తూ మట్టి మనిషినై బతికేస్తున్నా! ==================== ఏప్రిల్ 20/14

by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1faYHnd

Posted by Katta

Arcube Kavi కవిత

ఈ యుద్దం కొనసాగుతది-6 ____________________ఆర్క్యూబ్ జితేన్ మరాండి...అనిల్ రాం మనోజ్ రాజ్వర్...చత్రపతి మండల్ వీళ్ళంతా-బతుకుల్లో తవ్వకాల్ని మోస్తున్నఆదివాసి పాదాన్ని ధర్మం మొదటి పాదంగా కైగట్టి- ఈ దేశపు కోయిల గొంతులో పాడాల్సిన పాటను నాటినవారు దానికి- జెండా రెప రెపలంటే అలర్జి అచ్చంగా జాతీయ గీతమున్నట్టు దేశముంటే దాని రుబాబేం నడిచినట్టు- సరికొత్త ఎత్తుగడల ఉరై కొండ పొద్దుల్ని రానున్న ప్రకృతి వైపరిత్యంగా చిత్రిస్తున్నది అందుకే -వాళ్ళిప్పుడు అడవి జీవించే వాళ్ళదే - వ్యాపారం చేసేటోల్లది కాదని బాజాప్తా...ఔను బాజాప్తా ఉరితాళ్ళ నాగరికతల తెగించిన వడ్రంగి పిట్టలైర్రు *

by Arcube Kavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i0Oz6d

Posted by Katta

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//మరోమారు// ఒకప్పుడు నువ్వూ-నేనూ కొండపల్లి బొమ్మలం. ఒకరికొకరం తలాడించే తమకాలం ఇద్దరిదీ ఒకేలోకం ఇద్దరం మినహా ఏవరూలేని ప్రేమలోకం ఇప్పుడంటావా... పెళ్లయింది నీదో కుటుంబం, నాదో కుటుంబం, మనదో కుటుంబం. కలిమి లేమిలు పంచుకోవడానికి ఉన్న లేని కుటుంబం. అంటుకట్టిన పూలమొక్కకి అనుకోకుండా పూసిన రెండు రంగుల పూలు మొక్క మాత్రం ఒక్కటే. నీదో మాట, నాదో మాట మనం మరిచిన బాట. నడక సమాంతరం నీదీ నాదీ.... తవ్వుకొని నవ్వుకోలేక నవ్వుకొని హత్తుకోలేక ఉమ్మెత్త పాల పరిమళాలు గడ్డి పూల సౌరబాలు ముక్కు పిండుకోవడాలు సుదీర్ఘ ఆరోపణలు ఒక్క క్షణమూ ఒప్పుకోలేని గుంభనాలు అంతా ఒట్టి కావడి కుండలు ఇప్పుడేమైనా కుదిరితే అపుడెప్పుడో కతికినట్టు అతికినట్టు లుకలుకలు పక్కన పెట్టి ఒక్కసారి చెప్పుకుందామా నేను నిన్ను ప్రేమిస్తున్నానని....05.04.2014....20.04.2014.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gXTlzP

Posted by Katta

Rambabu Challa కవిత

చల్లా గౙల్-8/ Dt. 20-4-2014 పూల సొగసు చూడాలని తోటకి ఆశ ప్రేమరుచులు పంచాలని తేటికి ఆశ కమ్మనైన రాగాలు వీచికలైతే వీనులకు సొకాలని పాటకి ఆశ ఇజాలన్నీ పోటీపడి భాషణలిస్తే నిజం లోనే ఒదగాలని మాటకి ఆశ వేసిన ప్రతి అడుగూ మంచికోసమైతే పాదాలను తాకాలని బాటకి ఆశ ఖరీదైన నైవేద్యాలెందుకోయి "చల్లా" దైవస్మరణ చేయాలని నోటికి ఆశ

by Rambabu Challa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lnjxnf

Posted by Katta

బ్రెయిన్ డెడ్ కవిత

నిశీధి | Rennovation of thoughts | గ్రావిటీ సూత్రాలు అన్ని శరీరాలకే అందుకే ఆశలు ,ఆశయాలు , ఐడియాలజీలు ఆకాశంలో ఎగురుతుంటాయి . అందుకే సమాజం పవిత్రతల పగ్గాలు మనసుకి వెయ్యలేక వేదన పడుతుంది . అందుకే మనిషిని చంపలేని ద్వేషం మానవత్వాన్ని చంపుతుంది అందుకేనేమో ముదనస్టపు బాడీలో ముచ్చటగా సోల్ ని ఖైధి చేసె ప్రక్రియల్లో ప్రపంచం మునిగితేలుతుంది ప్లే సేఫ్ డ్యూడ్ ఇన్నోవేషన్ లేని జీవితాలకు తత్వపు ముసుగుల రెన్నోవేషన్ వెయ్యి ి కంపర్ట్ జోన్లో దాగి కంపాటబిలిటీ లేని హ్రుదయాన్ని బుజ్జగించు . కుడి యెడమలు కాని గోడెక్కి పట్టపగలు చుక్కలు వెతుక్కో సిం హపు గర్జనల వెనక నీలోని పిల్లిని దాచెయ్యి పొయేదెముంది ? వేస్తే ముసుగు తీస్తే లొసుగు బంజారన్ బ్రతుకులో నిస్వార్ధత నచ్చలేదా నీదయిన స్వార్ధపు పింజరంలో పిట్టైపో ప్లే సేఫ్ డ్యూడ్ ఎండ్ ఆఫ్ ద డే బ్రతికున్నాం అనిపించుకోవటమేగా జీవిత పరమార్ధం . బ్రతుకు సూత్రాలు భూమికి ఆరడుగుల లోతున 3*6 లో నిన్ను బలంగా భద్రపరుచుకొనేలోపు జీలే జర తూ జీనేకే నాం పే ఎక్ బార్ మర్నా భి సీఖొ క్యా పతా కల్ హొ తో భి కైసా హో ? నిశీ !! 20/04/14 .

by బ్రెయిన్ డెడ్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gXJp9v

Posted by Katta

Sky Baaba కవిత

గుజరాత్ ముస్లిం జాతి హత్యాకాండపై కవిత -6 ----------------------------------------- ఒక సూఫీ సాయంత్రం - - - - - - - - - - - - - - - - - - - - - - - - - అఫ్సర్‌ ఏమైందో ఆ మాసిన టోపీ ప్యాంటు జేబుల్లోంచి కర్చీఫ్‌ ముక్క తీసి తలకు చుట్టాను జుట్టు జూలు విదిలించకూడదు సమాధి చుట్టూ బిగుసుకున్న తలుపులు ఇంకా తెరుచుకోలేదు ఎదురుచూపులు అసర్‌ కోసం అజాఁ పిలుపుతో పావురాలు ఆకాశంగూటిలో రెక్కలెగరేశాయి పుట్టింటికి చేరుకున్న ఆనందం వాటికి చాన్నాళ్ళకు అసర్‌ నమాజ్‌ అయ్యింది వందేళ్ళ క్రితం కన్నుమూసి ఈ రాళ్ళల్లోంచి మళ్ళీ కళ్ళు తెరుచుకుంటున్న ఆ సూఫీ మునిని కప్పుకున్న చాదర్‌లోంచి ఆయన దేహంలోకి చూశాను నా దేహాన్నంతా వొంపి ఆయనని కళ్ళకి అద్దుకున్నాను దువా చదువుతూ మూతపడిన రెండు కళ్ళూ రెండు నీటిచుక్కలై ఆయన చాదర్‌పైన వాలాయి అవి రెండు పకక్షులై ఎటో టపటపా శబ్దం చేసుకుంటూ వెళ్ళాయి బయటికి రాలేకపోయాను ఆయనలోంచి ఒక పాతకాలపు అరబ్బీ పుస్తకం ఏ కాస్త మోటుగా తాకినా చిరిగిపోతుందేమోనన్నంత భయంగా తెరచినట్టు ఆయన జ్ఞాపకాల్లోకి మెల్లిగా వెళ్ళాను ఈ యాత్రకి అర్ధం ఏమిటి? బయటికి అడగుపెట్టానో లేదో! ఒక పకక్షుల సమూహంలో ఏదో పేలిన శబ్దం అందరూ పారిపోతున్నారు ఎవరూ కనిపించడం లేదు కత్తులు తప్ప ఏమీ వినిపించడం లేదు కొసప్రాణం అరుపులు తప్ప మళ్ళీ లోపలికి పరిగెత్తాను అక్కడా నిశ్శబ్దం ఒక పక్షి మాత్రం నెత్తుటి రెక్కతో దర్గా రాయి మీద ఏదో రాస్తోంది చాదర్‌లోకి ముక్కు దూర్చి వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టుగా వుంది ఎక్కడికి వెళ్ళాలిక? నా లోపల వొక సమాధి తవ్వుకుంటున్నాను (వలి గుజరాతి స్మ ృతికి) (కవి వలి గుజరాతి దర్గాను గుజరాత్‌ జెనొసైడ్‌ సమయంలో నేలమట్టం చేశారు) (AZAAN -Poetry on Gujarat Genocide -2002)

by Sky Baaba



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i5OxnH

Posted by Katta

Arcube Kavi కవిత

ఈ యుద్దం కొనసాగుతది-6 ____________________ఆర్క్యూబ్ జితేన్ మరాండి...అనిల్ రాం మనోజ్ రాజ్వర్...చత్రపతి మండల్ వీళ్ళంతా-బతుకుల్లో తవ్వకాల్ని మోస్తున్న ఆదివాసి పాదంలో ధర్మంగా పురుడు పోసుకున్న అప్పులోని గుర్రాలు దానికి- జెండా రెప రెపలంటే అలర్జి అచ్చంగా జాతీయ గీతమున్నట్టు దేశముంటే దానిదేం నడిచినట్టు- సరికొత్త ఎత్తుగడల ఉరై కొండ పొద్దుల్ని రానున్న ప్రకృతి వైపరిత్యంగా చిత్రిస్తున్నది అందుకే -వాళ్ళిప్పుడు అడవి జీవించే వాళ్ళదే వ్యాపారం చేసేటోల్లది కాదని ఉరితాళ్ళ నాగరికతల తెగించిన వడ్రంగి పిట్టలైర్రు * * * * * * *

by Arcube Kavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i0iH1N

Posted by Katta

Sita Ram కవిత

kaanula mundu kanumarugaina kshanaalenno nanu viduvaleka,maruvaleka tapimchipoyina hRudayaalenno nenunnaanantu bharosa icchina kshanaale nanu vidichi potunte yemi cheyaleni nissahaaya sthitilo choostu kurchovatam tappam nenem cheyagalanu naa kosam kaalam gadavaka maanadu kadaa

by Sita Ram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lmX9Kz

Posted by Katta