పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

10, ఫిబ్రవరి 2014, సోమవారం

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: హృదయాంజలి: కుక్కపిల్ల,అగ్గిపుల్ల,సబ్బుబిల్ల కాదేదీ కవితకు అనర్హం అన్నట్టి శ్రీశ్రీ పలుకులు నీ కవితా కుసుమాల్ని గాంచిన మరొకమారు స్ఫురించాయి హృదయాన్ని ఆనంద సాగరంలో ఓలలాడించాయి.. నేస్తమా! నీ ప్రయత్నాన్ని ఏమని మెచ్చను..? నీ స్పందనను ఏమని అర్థం చేసుకోను..? నీ హృదయగీతిని ఏమని కీర్తించను..? నీ బాధను ఎలా పంచుకోను..? నీ వ్యధను ఎలా తృంచను..? నీ ప్రయత్నాన్ని మెచ్చుకునే విద్వాంసున్ని కాకున్నా.. నీ స్పందనను అర్థం చేసుకుని ప్రతిస్పందించే స్థాయి లేకున్నా.. నీ హృదయగీతిని ఆలపించే తంత్రిని నేను కాకున్నా.. నీ బాధను పంచుకునే అవకాశం లేకున్నా.. నీ వ్యధలను తృంచే శక్తి సామర్ధ్యాలు లేకున్నా.. నీలో కలిగిన చైతన్యానికి ఆ చైతన్యానికి నిలువుటద్దములా ప్రదర్శించిన నీ కవితా కుసుమాలకు ఏం ఇవ్వగలను బదులుగా.....? ...................................................... "క్షోణీ తలమ్మున నుదురు సోకగ మ్రొక్కి నుతింతున్ ప్రాణ మితృండనై"....!!!!! 10/02/2014

by Kontham Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1obseDT

Posted by Katta

Vijaykumar Amancha కవిత

//గెలుపు // ఓ నింగీసూర్యుడు నీ గెలుపు నిండు చీకటీపైనేనా కరీగీనా ముత్యము నీ గెలుపు పాలపుంతపైనే..నా గెలుపు ఓటములు నీ గెలుపు అధీపత్యంపైనా ప్రకృతివనరులు నీ గెలుపు పచ్చదనంపైనే నా సెలహెటికీఇ నీ గెలుపు ప్రవహించే యెరుపైనే నా వర్షీంచే వర్ణుడీకీ నీ గెలుపు మెరుసేటి ఉరుములాపైనే ..నా . ********************* //అమంచ విజయ్ కుమార్ //

by Vijaykumar Amancha



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h4ruzH

Posted by Katta

Parameshwary Pulipati కవిత



by Parameshwary Pulipati



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NuaxBO

Posted by Katta

బ్రెయిన్ డెడ్ కవిత

నిశీధి | మరణమృదంగం | వందేమాతర గీతం వరస మారుతున్నది , హిందువే మన తరం గా రూపుదిద్దుతున్నది ముచ్చటయిన మూడు రంగుల దేశం ఆఫిషియల్ కాషాయంలో మునిగి తేలనున్నది . గొర్రె మనస్తత్వం కి తోడేలు కాపలా కలల బేహారుల ఆటలో కార్పోరేట్ కధల వేటలో చివరాఖరు వేటుకి బలి నీతల పారి పోయే దారిలేదు మతం ముళ్ళకంచె అడ్డంగా కోస్తుంది ముందుకెళ్ళే బాట లేదు పులి వేషపు నక్క పీక్కు తింటుంది ఇంకెందుకు రామ డ్రామా రంగులలో నీదయిన భీరువు మొహంని కప్పుకొని కట్టేయ్యి మంచితనపు నటన నింపెయ్యి మనసు భాండం లో కులం విషం చుక్క కక్కెయ్యి నిలువెత్తి సర్ప కీలల మాటలు ఇంకోక్కసారి కరసేవల కసాయితనం లో ఇటుక ఇటుక తో “భాయి “లందరికి ఘోరీ లు పేర్చే మారణ హోమం లో వేసెయ్యి నీదంటూ ఓ సమిధ పసి నవ్వుల సమాధుల పై సాగించే జైత్ర యాత్ర లో నలుగురు నడిచే నడమంత్రపు నైమిశ్యం కొంచం పులుముకొని కోసెయ్యి " హే అల్లా "ఆర్తనాదాల కుత్తిక ని మోబ్(Mob) బలాల వెనక దాగి మ్రోగించు నీదయిన మరణ మృదంగం వహ్ రే వహ్ నయా జమానా మనువు మనవడా మనుష్యుల రక్తం తో మానవత్వానికి కుంకుమ బొట్టు అద్దుకొని నిషిద్ధ గోడుగుల్లో దూర్చిన మగతనం ని "ఫక్ " మంత్రాల్లో నింపుకొని న "పుంసత్వాన్ని " మనసులో దాచుకొని మరొక్కసారి జై బోలో నమో( డి ) కి నిశీ !! 10-2-14.

by బ్రెయిన్ డెడ్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lWpwn7

Posted by Katta

Murthy Kvvs కవిత

KVVS MURTHY|జ్ఞానీలు-23 నన్ను వెంటాడే ఒక ఆలయ స్మృతి ఎప్పటికప్పుడు ఓ రహస్య సంకేతం పంపుతున్నట్టుగా అనిపిస్తున్నది... యక్షిణులతో,భూత పరివారాలతో సర్పాలతో,రకరకాల శిల్ప అలంకారాలతో ఎర్రని ఇసుకరాతి శరీరంతో అలరారే ఆ గర్భాలయంలోనికి అడుగుపెట్టగానే ఎవరో చాచి ముఖం మీద కొట్టినట్టు అక్కడ ఎలాంటి దేవుని విగ్రహమూ లేదు...శబ్దమూ..లేదు...ప్రాణి లేదు... ప్రాణం లేని ఆ అందమైన శవం నాకిచ్చిన సందేశం ఒకటే.. నువ్వే ఆలయం...నువ్వే దేవుడివి నీ ప్రయాణం ముగిసినప్పుడు నీ లోపల ఇంకేమీ మిగలదు ..! -------------------------------------------- 10-2-2014 (భువనేశ్వర్ లోని రాజారాణి ఆలయాన్ని సందర్శించిన తరవాత రాసినది)

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lpyUMz

Posted by Katta

Ravela Purushothama Rao కవిత

మందార దామం ------------------ రావెలపురుషోత్తమరావు ******************************* ఆమె కనులను కాదు కళ్ళవెంట దాచుకున్న విషాద సాగరాలను చూడు ప్రపంచపు నయవంచన ఇట్టే పసిగట్టే వీలు దొరుకుతుంది. ఎత్తయిన ఉరః కుహరాలను కాదు అవి నీకిచ్చి పెంచిన ఆమె గుండె లోతుల వెనుక దాగి మిగిలిపోయి గూడు కట్టుకు ఘనీభవించిన బాధను గమనించే వీలు కలుగుతుంది. కాల యవనిక ఆమె పై గీసిన ఉదయాస్తమానాల ఉప్పెనల చిత్రం సాక్షాత్కరిస్తుంది. ఆమె వయసు ముఖం పై గీసిన ముసలి రేఖలను కాదు నీవు చూడాల్సింది ఆ ముడుతలవెనుక దాగిన ఆమే కష్టపు కాల ఘడియలను ఊహించు. గతకాలంలోని భారంగా బ్రదుకునీడ్చిన ఆమె శ్రమైక జీవన సౌందర్యపు చెమట వాసన దృగ్గోచరమై నిలుస్తుంది బ్రతుకునిచ్చిన అమ్మను బొమ్మగాకాదు నిన్ను శిల్పసుందరంగాచెక్కిన ఆమే కళాకొశలాన్ని గణించు. జన్మ జన్మల పర్యంతం ఆమెకునీవెంత రుణపడి వున్నావో జమా ఖర్చుల జాతకం బయట పడుతుంది ఆమె అంతరాంతరలంతటా అనురాగమే హిమాలయమై గోచరిస్తుంది. అంతు అడ్డులుగనరాని నదిలా ఆమె కదిలొస్తుందిరా . జాగ్రదావస్థ నందయినా ఆమె పాడిన జోల పాట వీనుల విందుగా నిన్ను ప్రేమ భావనతో అభిషేకిస్తుంది. తన స్వహస్తాలతో నీవు ఆమెను అభిషేకించాలన్న తపన కంఠ దఘ్నమై ఊప్పొంగుతుంది ఎటునుంచి ఎటు చదివినా ఒకేఒక పదమై భాషిస్తుంది.

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1npxjp5

Posted by Katta

Sita Ram కవిత

నీనవ్వులోనున్న కిలకిల రాగం రేపింది నాలో తాపం నీమౌన గానాలలోనున్న వలపుల రాగం కోరింది నా పంచప్రాణం నువ్వే రాక జాడే లేక మదిలో రేగెను కరహరప్రియ రాగం 10-feb-2014

by Sita Ram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jpYYZR

Posted by Katta

Prasad Atluri కవిత

||ప్రసాద్ అట్లూరి || అఘాయిత్యం|| కొసరి తినిపించిన అమ్మను విడిచి బుజాలపై మోసిన నాన్నను మరిచి ఏంటి తమ్ముడూ ఈ అఘాయిత్యం? చదువులో తడబడితే మళ్ళీ నిలబడలేవా ప్రియురాలు కాదంటే ఇహ ప్రేమే దొరకదంటావా! అర్ధాంతరంగా తనువుచాలిస్తే కష్టం కరిగిపోతుందా? తాళంకప్పతోటే చెవికూడా తయారవుతుందిగా ప్రతిసమస్యకీ పరిష్కారంకూడా తప్పకుంటుందిగా విరక్తి చీకటి కమ్మినా అభిమతపు వేకువ రాకుండదుగా! సృష్టిలోని జీవులన్నిటిలో తెలివైన మానవుడివే నవ్వగలిగే వరాన్ని నువ్వొక్కడివే పొందినోడివే ఆలోచించగలిగే ఐశ్వర్యం కలిగినోడివే కదామరి! సమస్యలన్నిటికీ చావే పరిష్కారమై ఉండివుంటే మానవజాతెప్పుడో తన మనుగడ కోల్పోయుండేదిగా! నమ్ముకున్నాళ్ళ నెప్పుడూ నట్టేటముంచకు..తమ్ముడూ.. >--బాణం--> 10FEB14 (క్షణికావేశంలో, వత్తిడిలో జీవితాల్ని త్యజిస్తున్న యువతకి నా ఆత్మీయ విన్నపం ...)

by Prasad Atluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dc2KCl

Posted by Katta

Nirmalarani Thota కవిత

ఎందుకమ్మా విధీ . . ! నీ మతి లేని చేతలతో ఈ మదిని వెతల పాల్జేస్తావు . . ఒక్క క్షణం లేత గుండెలో ఆశలేవో చిగిర్చి . . మరుక్షణమే బడబానలాన్ని రగిల్చి. . అంతులేని విషాదాన్ని మిగిల్చి . . ! వయసు మొక్కకు పూచిన పూలు కోసుకునే లోపే రాలి పోయాయి . . రాలిన పూలను ఏరుకొని మాల కడుతున్నంతలోనే వాడి పోయాయి . . వాడిన పూలను వికసింప చేయడం ఏ వసంతానికి సాధ్యం . . ? నిర్మలారాణి తోట [ తేది: 10.02. 2014 ]

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bj3C9s

Posted by Katta

Kanneganti Venkatiah కవిత

కమ్ముకున్న కీడు... ఈ కాంక్రీటు జంగిల్ లో నోట్ల కట్టల వెదురు పొదలమాటున ఎన్ని గుడిసె లేడిపిల్లల్ని అరవంగ మింగేశాయో కదా!? వాటి పిల్లర్ల వెన్నుపూసల బలుపు చూడు కూలి డబ్బులు ఎరవేసి ఎన్ని పల్లె చెమటచుక్కలతో స్నానమాడాయో కదా!? మెరిసే వాటి రంగుల కుబుసాల సింగారం చూడు . ఎందరి కార్మికుల కలల నేత్రాలను తీగల పక్కటెముకలతో చుట్టి మెలిపెట్టాయో కదా!? మిట్టమధ్యాహ్న సూర్యుల్లా వెలిగే వాటి కరంటు కళ్ళు చూడు. ఎందరి అమాయక కూలీల దాచిన కలల్ని సిమెంటు నాలుకతో జుర్రుకున్నయో కదా!? గుభాళించే వాటి ద్వారతోరణాల నోళ్ళు చూడు. ఎన్నివేల అడుగుల మన్ను నీళ్ళను గుటకేశాయో కదా!? వెన్ను విరుచుకొని నిలబడి మిన్నుచూస్తూ ... బడుగుజీవుల ప్రాణవాయువునూ స్వాహాచేస్తున్న బహుళ అంతస్తుల భీకర భవనపు అనకొండల్ని చూడు . రేపటి ప్రభాత కిరణాలకూ కమ్ముకున్న కీడు చూడు. తేది;10.2.14.

by Kanneganti Venkatiah



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kvBItr

Posted by Katta

Lingareddy Kasula కవిత

అందని స్తన్యమై గోదావరి సాకి: తెలంగాణ ముద్దుబిడ్డల జీవధార గోదావరి కష్టాల కడగండ్లదేలె పేదరైతుల చూసి గుండె చెరువవ్వ తల్లడిల్లె తల్లి గోదావరి పల్లవి: ఎక్కెక్కి ఏడ్చింది గోదావరి- తాను కన్నీటి కాలువై గోదావరి వలపోతలను చూసి గోదావరి వలస కలబోతలొద్దంది గోదావరి చరణం1: కాలాలు మారినై- రాజ్యాలు కూలినై కడలి కౌగిలినెవరు విడిపించరైరి కండ్ల కారంకొట్టి కవ్వింతురైరి కష్టజీవుల చేర దారిడువరైరి ఎక్కెక్కి ఏడ్చింది గోదావరి-తాను నెత్తుటి గాయమై గోదావరి చరణం2: ఎరుకకైనారాదు ఎల్లంపల్లిగోడు తలువనైనాలేరు ఇచ్ఛంపల్లి నేడు ఏండ్లు గడిసిపాయె ఎవుసమెండిపాయె దూపగొన్న బిడ్డల దేహమవిసిపోయె ఎక్కెక్కి ఏడ్చింది గోదావరి- తాను ఒంటరి దుఃఖమై గోదావరి చరణం3: విడిదిచేసే చోట విసిరిసిరి కొట్టారు నడిసొచ్చె దారుల్ల నిలదీసి తరిమారు కువ్వారం పట్టిండ్రు కుట్రలూ చేసిండ్రు తల్లిబిడ్డలవాపి తంద్లాటజూస్తుండ్రు ఎక్కెక్కి ఏడ్చింది గోదావరి- తాను అందనీ స్తన్యమై గోదావరి చరణం4: పంట సెలుకలల్ల పర్రెలూ వాసాయి ఏడ్చి అలసిన పల్లె కంట నీరెండాయి తకరారులన్నీ తవ్వి తీస్తున్నాయి తల్లి గోదావరి చెరవిడువ కదిలాయి పోటెత్తి లేచింది గోదావరి- తాను పోరాటగీతమై గోదావరి ఉగ్రమై ఉరిమింది గోదావరి- తాను ఎత్తిన పిడికిలై గోదావరి 16 నవంబర్‌ 2012 'నమస్తే తెలంగాణ' దినపత్రిక 'చెలిమె'

by Lingareddy Kasula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bNk5Aq

Posted by Katta

Abd Wahed కవిత

అద్దం అద్దం తెర కాస్త తప్పించి ప్రతిబింబంతో మాట్లాడాలి కంటి పొరల వెనుక ఎన్ని సముద్రాలున్నాయో అడగాలి ప్రాణం వదులుతున్ననిశ్వాస లెక్కలడుగుతుంది తప్పొప్పుల మూటలు మోసుకుపోతోంది... కునికిపాట్లు పడుతున్న మధ్యాహ్నపు వీధిలా నినాదాల గోడ మూగబోయింది... చిరుగాలి ఊహల స్పర్శకు చిగురాకులా తలఊపాలా? వాస్తవాల పెనుగాలికి ఎండుటాకులా వణికిపోవాలా? దోసిట్లో కొత్తజాబిలి పాలనది నుంచి జారిపడింది కంటి నుంచి రాలుతున్న క్షణాల్లో కరిగిపోయింది... ఎగిరిపోతున్న కలరెక్కల్లో చిక్కుకున్న చూపులు చివరికి నేలపడక తప్పదు... కందకం లాంటి అద్దంలో ప్రతిబింబాలు పడి ఉన్నాయి జ్ఙాపకాలపై జారిపడి... నడుం విరిగి... అద్దం కిటికీగా మారితే తొంగి చూసే ముఖాలు ఎన్నుంటాయో... అల్లుకునే హాయి కూడా బందీఖానాయే ...

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lV52Lv

Posted by Katta

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి వాన అదొక బీడువారిన జీవితం నెరలు పోయిన హృదయం నేల గాయాలు పాలై మౌనంగా రోధిస్తోంది ఎన్నాళ్లనుండో ఎదురుచూస్తూ కన్నీళ్ళు కారుస్తూ ఇంకిపోయి ఎండిపోయిన కళ్ళల్లోకి తనలో మిగిలిన కొన్ని కన్నీటిబొట్లని రాల్చింది ఆకాశం చిరుజల్లులా దాహంతో ఆవిరైపోతున్న ఆ జీవితాల గొంతు తడుపుకోవడానికే ఆ చుక్కలు చాలవు ఇక జీవితాలేం తడుస్తాయ్ ఆకాశం దీనంగా చూస్తోంది ఇక నేలతల్లికి తల పైకెత్తి చూడడానికి కూడా ఓపిక లేదు అసలు వాన ఎందుకు కురవదు ఆ వానని ఏ రాక్షసి మింగేస్తోంది? మళ్ళీ అదే వాన రాక్షసిలా మీద పడి బ్రతుకుల్ని మింగేస్తుంది ఇదేం చోద్యమో! 08FEB2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1egImeD

Posted by Katta

Kavi Yakoob కవిత

ఓ నాలుగు రోజులనుండి తీరిక దొరికినప్పుడల్లా Shivaramakrishna Pennaగజళ్ళ పుస్తకాలు 'సల్లాపం', 'శిశిరవల్లకి' చదువుతూ గడిపాను. గజల్ గురించిన ఆయన అవగాహనను 'తనమాట'గా ఎంతో విలువైన సమాచారంతో పొందుపరిచారు. ఉపయోగకరమైన వ్యాసాలు అవి. ఇక గజళ్ళ విషయానికి వస్తే ,ఒకదానికి మించి మరొకటి. తెలుగులో ఇలా గజల్ రాయగలిగినవాళ్లు అతి కొద్దిమందే ఉన్నారు. ఎన్నుకునే వస్తువులు, అభివ్యక్తి, అద్భుతమైన పదబంధాలు,పోలికలు,-వావ్...జస్ట్ సూపర్బ్ !

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/LOPA2I

Posted by Katta

Kavi Yakoob కవిత

జనవరి 25న జరిగిన ~ కవిసంగమం : కవిత్వసందర్భం ~ సల్మ, మమత సాగర్ ,రతి సక్సేనా ల కార్యక్రమం 10 Tv లో ఆదివారం [10.1.2014].నాడు ప్రసారమైంది.

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eMzPoB

Posted by Katta

Kishan Mayu కవిత

ప్రేమకి..10.02.2014 ఇ రోజు ఉండి రేపు పోయే ప్రాణానికి నీవు కట్టే విలువ ఏంత..? నేను నీపై పెంచుకున్న స్నేహానికి నీవు కట్టే విలువ ఏంత..? మరిచినవా నువు మరిచినవా నాతో చేసిన స్నేహం..! ఒకసారయిన గురుతుకు రాధా కలలోనైనా నా స్నేహం..!

by Kishan Mayu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eg2EVB

Posted by Katta

Krishna Mani కవిత

మది తీరం ******* నా మది తీరాన నీకై ఎదురుచూపులు ఎన్నాళ్ళనుండో పడిగాపులు ! ఎందరో ముద్దుగుమ్మలు వచ్చారు నీకై దాచిన చోటును దోయదలచి ! ఇత్తునా అంతటి అవకాశం నా అలల పొంగుతో ఉప్పెనలు చుపా త్సునామి అని భయపడి దరిదాపుకు రాలేరు ! నా తీరం నీదని రాసాను యదపై నీకై పరిచా కొబ్బరి తోటని నీకై పేర్చ ఒడ్డున రాళ్ళని నీకై ఉంచా మెత్తని ఇసుకని నీకై దాచా అలల సవ్వడిని నీకై ఒంపా ప్రేమ తెప్పల్ని నీకై పంపా గాలి ఖబురుని నువ్వొస్తావని ప్రతిదినం ఆలోచన రవి లేచిన గడియన మొదలు రవి మునిగే కాలం వరకు ! రాణివై ఏలా రావే సొగసరి పువ్వుల పానుపే దినసరి తొలకరి మత్తున గడసరి ! కృష్ణ మణి I 10-02-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kuCEyq

Posted by Katta

Kranthi Srinivasa Rao కవిత

క్రాంతి శ్రీనివాసరావు ||పగుళ్ళు లేని చీలిక || వాని చెవిలో విరుగుడు మంత్రం ఊదారు వాడప్పుడే వాగడం మానేయడు ............ తెరవెనుక ప్రాంప్టింగ్ను అరువు గొంతుగా మార్చుకొని మహా నటుడయ్యాడు ఇంకొకడు .... కలువలు చంద్రుణ్ణి వికసింపచేస్తాయని కలలు కంటున్నాడు .....విచిత్రంగా మరొకడు ఏంజరిగినా ...ఎవడో ఒకడి మీద ఒరగదోయచ్చని పగలయునా రేయయునా పొరపాటులేదోయ్ నిషాలో తేడా అసలు రానేరాదోయ్ అంటూ ఒకడు మామిత్రుడు చెప్పిన కవిత ..నిజమేనేమో .. గొడుగుకూ పుల్ల లుంటాయు ........... అవసరమయునప్పుడు తెరుచుకొంటాయు ... లేకుంటే ముడుచు కొంటాయు ... కుర్చీకి కట్టేసుకొన్న రాజకీయ ఆత్మల స్వరాలాపనలు జాతి జనుల నరాలను తెంపేస్తున్నాయు ....... ఇక ఎప్పుడో అప్పుడు తప్పదని తెలిసినా పగుళ్ళు లేని చీలిక అసాధ్యం చేస్తున్నాయు

by Kranthi Srinivasa Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eMfzDl

Posted by Katta

Ramesh Bandi కవిత

ఓడిన నేస్తమా గెలిచే తపనున్నదా నీకు? నిలబడి నడవడిక సాగించే సత్తువున్నదా నీకు? అరణ్యమని ఎదురిడి అడుగిడడం మానేస్తావా? ముల్లని మృగాలని సాకేదో చెప్పి తప్పుకుంటావా? నీ దారి వేయలేవా? నడి వీధిన నడుస్తూ నీడ చూసి బెదిరేవు ఇంటికి, ఇల్లాలికి, బంధానికి బతకడానికి భయపడి భయపడి కనుమరుగై ఆత్మగా తిరిగే పిరికివాడా గెలిచావా ఏనాడైనా? గెలుస్తావా ఇకనైనా? || ఓడిన || అడుగుతో పాటు అక్షరం నేర్చి, పరిణితి పెంచి కాలగంగలో పయనిస్తూ కనుచూపు మరిచావు అంధుడై తిరిగావు ఓ రాతి దూలమైనావు కారణమేదైనా మారాలి ఇకనైనా గెలిచావా ఏనాడైనా? గెలుస్తావా ఇకనైనా? ||ఓడిన ||

by Ramesh Bandi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eMfAHw

Posted by Katta

చెన్నాప్రగడ వీఎన్నెస్ శర్మ కవిత

మన ప్రేమ అన్ లిమిటెడ్_నీ సెల్లో టాక్ టైములా ..@శర్మ \10.2.14\

by చెన్నాప్రగడ వీఎన్నెస్ శర్మ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lmQrEW

Posted by Katta