పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

10, ఫిబ్రవరి 2014, సోమవారం

Kanneganti Venkatiah కవిత

కమ్ముకున్న కీడు... ఈ కాంక్రీటు జంగిల్ లో నోట్ల కట్టల వెదురు పొదలమాటున ఎన్ని గుడిసె లేడిపిల్లల్ని అరవంగ మింగేశాయో కదా!? వాటి పిల్లర్ల వెన్నుపూసల బలుపు చూడు కూలి డబ్బులు ఎరవేసి ఎన్ని పల్లె చెమటచుక్కలతో స్నానమాడాయో కదా!? మెరిసే వాటి రంగుల కుబుసాల సింగారం చూడు . ఎందరి కార్మికుల కలల నేత్రాలను తీగల పక్కటెముకలతో చుట్టి మెలిపెట్టాయో కదా!? మిట్టమధ్యాహ్న సూర్యుల్లా వెలిగే వాటి కరంటు కళ్ళు చూడు. ఎందరి అమాయక కూలీల దాచిన కలల్ని సిమెంటు నాలుకతో జుర్రుకున్నయో కదా!? గుభాళించే వాటి ద్వారతోరణాల నోళ్ళు చూడు. ఎన్నివేల అడుగుల మన్ను నీళ్ళను గుటకేశాయో కదా!? వెన్ను విరుచుకొని నిలబడి మిన్నుచూస్తూ ... బడుగుజీవుల ప్రాణవాయువునూ స్వాహాచేస్తున్న బహుళ అంతస్తుల భీకర భవనపు అనకొండల్ని చూడు . రేపటి ప్రభాత కిరణాలకూ కమ్ముకున్న కీడు చూడు. తేది;10.2.14.

by Kanneganti Venkatiah



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kvBItr

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి