మందార దామం ------------------ రావెలపురుషోత్తమరావు ******************************* ఆమె కనులను కాదు కళ్ళవెంట దాచుకున్న విషాద సాగరాలను చూడు ప్రపంచపు నయవంచన ఇట్టే పసిగట్టే వీలు దొరుకుతుంది. ఎత్తయిన ఉరః కుహరాలను కాదు అవి నీకిచ్చి పెంచిన ఆమె గుండె లోతుల వెనుక దాగి మిగిలిపోయి గూడు కట్టుకు ఘనీభవించిన బాధను గమనించే వీలు కలుగుతుంది. కాల యవనిక ఆమె పై గీసిన ఉదయాస్తమానాల ఉప్పెనల చిత్రం సాక్షాత్కరిస్తుంది. ఆమె వయసు ముఖం పై గీసిన ముసలి రేఖలను కాదు నీవు చూడాల్సింది ఆ ముడుతలవెనుక దాగిన ఆమే కష్టపు కాల ఘడియలను ఊహించు. గతకాలంలోని భారంగా బ్రదుకునీడ్చిన ఆమె శ్రమైక జీవన సౌందర్యపు చెమట వాసన దృగ్గోచరమై నిలుస్తుంది బ్రతుకునిచ్చిన అమ్మను బొమ్మగాకాదు నిన్ను శిల్పసుందరంగాచెక్కిన ఆమే కళాకొశలాన్ని గణించు. జన్మ జన్మల పర్యంతం ఆమెకునీవెంత రుణపడి వున్నావో జమా ఖర్చుల జాతకం బయట పడుతుంది ఆమె అంతరాంతరలంతటా అనురాగమే హిమాలయమై గోచరిస్తుంది. అంతు అడ్డులుగనరాని నదిలా ఆమె కదిలొస్తుందిరా . జాగ్రదావస్థ నందయినా ఆమె పాడిన జోల పాట వీనుల విందుగా నిన్ను ప్రేమ భావనతో అభిషేకిస్తుంది. తన స్వహస్తాలతో నీవు ఆమెను అభిషేకించాలన్న తపన కంఠ దఘ్నమై ఊప్పొంగుతుంది ఎటునుంచి ఎటు చదివినా ఒకేఒక పదమై భాషిస్తుంది.
by Ravela Purushothama Rao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1npxjp5
Posted by Katta
by Ravela Purushothama Rao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1npxjp5
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి