పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

10, ఫిబ్రవరి 2014, సోమవారం

Abd Wahed కవిత

అద్దం అద్దం తెర కాస్త తప్పించి ప్రతిబింబంతో మాట్లాడాలి కంటి పొరల వెనుక ఎన్ని సముద్రాలున్నాయో అడగాలి ప్రాణం వదులుతున్ననిశ్వాస లెక్కలడుగుతుంది తప్పొప్పుల మూటలు మోసుకుపోతోంది... కునికిపాట్లు పడుతున్న మధ్యాహ్నపు వీధిలా నినాదాల గోడ మూగబోయింది... చిరుగాలి ఊహల స్పర్శకు చిగురాకులా తలఊపాలా? వాస్తవాల పెనుగాలికి ఎండుటాకులా వణికిపోవాలా? దోసిట్లో కొత్తజాబిలి పాలనది నుంచి జారిపడింది కంటి నుంచి రాలుతున్న క్షణాల్లో కరిగిపోయింది... ఎగిరిపోతున్న కలరెక్కల్లో చిక్కుకున్న చూపులు చివరికి నేలపడక తప్పదు... కందకం లాంటి అద్దంలో ప్రతిబింబాలు పడి ఉన్నాయి జ్ఙాపకాలపై జారిపడి... నడుం విరిగి... అద్దం కిటికీగా మారితే తొంగి చూసే ముఖాలు ఎన్నుంటాయో... అల్లుకునే హాయి కూడా బందీఖానాయే ...

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lV52Lv

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి