పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

10, ఫిబ్రవరి 2014, సోమవారం

Lingareddy Kasula కవిత

అందని స్తన్యమై గోదావరి సాకి: తెలంగాణ ముద్దుబిడ్డల జీవధార గోదావరి కష్టాల కడగండ్లదేలె పేదరైతుల చూసి గుండె చెరువవ్వ తల్లడిల్లె తల్లి గోదావరి పల్లవి: ఎక్కెక్కి ఏడ్చింది గోదావరి- తాను కన్నీటి కాలువై గోదావరి వలపోతలను చూసి గోదావరి వలస కలబోతలొద్దంది గోదావరి చరణం1: కాలాలు మారినై- రాజ్యాలు కూలినై కడలి కౌగిలినెవరు విడిపించరైరి కండ్ల కారంకొట్టి కవ్వింతురైరి కష్టజీవుల చేర దారిడువరైరి ఎక్కెక్కి ఏడ్చింది గోదావరి-తాను నెత్తుటి గాయమై గోదావరి చరణం2: ఎరుకకైనారాదు ఎల్లంపల్లిగోడు తలువనైనాలేరు ఇచ్ఛంపల్లి నేడు ఏండ్లు గడిసిపాయె ఎవుసమెండిపాయె దూపగొన్న బిడ్డల దేహమవిసిపోయె ఎక్కెక్కి ఏడ్చింది గోదావరి- తాను ఒంటరి దుఃఖమై గోదావరి చరణం3: విడిదిచేసే చోట విసిరిసిరి కొట్టారు నడిసొచ్చె దారుల్ల నిలదీసి తరిమారు కువ్వారం పట్టిండ్రు కుట్రలూ చేసిండ్రు తల్లిబిడ్డలవాపి తంద్లాటజూస్తుండ్రు ఎక్కెక్కి ఏడ్చింది గోదావరి- తాను అందనీ స్తన్యమై గోదావరి చరణం4: పంట సెలుకలల్ల పర్రెలూ వాసాయి ఏడ్చి అలసిన పల్లె కంట నీరెండాయి తకరారులన్నీ తవ్వి తీస్తున్నాయి తల్లి గోదావరి చెరవిడువ కదిలాయి పోటెత్తి లేచింది గోదావరి- తాను పోరాటగీతమై గోదావరి ఉగ్రమై ఉరిమింది గోదావరి- తాను ఎత్తిన పిడికిలై గోదావరి 16 నవంబర్‌ 2012 'నమస్తే తెలంగాణ' దినపత్రిక 'చెలిమె'

by Lingareddy Kasula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bNk5Aq

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి