పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

10, ఫిబ్రవరి 2014, సోమవారం

Prasad Atluri కవిత

||ప్రసాద్ అట్లూరి || అఘాయిత్యం|| కొసరి తినిపించిన అమ్మను విడిచి బుజాలపై మోసిన నాన్నను మరిచి ఏంటి తమ్ముడూ ఈ అఘాయిత్యం? చదువులో తడబడితే మళ్ళీ నిలబడలేవా ప్రియురాలు కాదంటే ఇహ ప్రేమే దొరకదంటావా! అర్ధాంతరంగా తనువుచాలిస్తే కష్టం కరిగిపోతుందా? తాళంకప్పతోటే చెవికూడా తయారవుతుందిగా ప్రతిసమస్యకీ పరిష్కారంకూడా తప్పకుంటుందిగా విరక్తి చీకటి కమ్మినా అభిమతపు వేకువ రాకుండదుగా! సృష్టిలోని జీవులన్నిటిలో తెలివైన మానవుడివే నవ్వగలిగే వరాన్ని నువ్వొక్కడివే పొందినోడివే ఆలోచించగలిగే ఐశ్వర్యం కలిగినోడివే కదామరి! సమస్యలన్నిటికీ చావే పరిష్కారమై ఉండివుంటే మానవజాతెప్పుడో తన మనుగడ కోల్పోయుండేదిగా! నమ్ముకున్నాళ్ళ నెప్పుడూ నట్టేటముంచకు..తమ్ముడూ.. >--బాణం--> 10FEB14 (క్షణికావేశంలో, వత్తిడిలో జీవితాల్ని త్యజిస్తున్న యువతకి నా ఆత్మీయ విన్నపం ...)

by Prasad Atluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dc2KCl

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి