పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, మార్చి 2014, శుక్రవారం

Ravela Purushothama Rao కవిత

దైవమిచ్చిన వరం *************** రావెలపురుషోత్తమరావు పల్లె నాకు దైవమిచ్చిన వరం పసితనపు పలవరింతల్లోనే పచ్చని పొలంలా సాక్షాత్కరించి పట్టు గొమ్మగా వెలిసింది. ఆరుగాలాలపాటూ అపురూపంగా ఎదిగి అన్నపూర్ణగా భాసించింది. వరికంకులన్నీ పాలపొట్టమీదకు రాగానే నిండు గర్భిణిలా తలవంచి నావైపు చూసి సిగ్గుగా తలవొంచుకుని నిలుచుంది కోతలన్నీ పూర్తికాగానే సంతానలక్ష్మిలా సౌభాగ్య సుందరంగా ఇలా ఇంటికిజేరి పుట్టింటి గౌరవాన్ని ఇనుమడింపజేసింది. మరోవంక మల్లెల మరువంపు దవనాల మేళవింపుగా సురభిళ పరిమళంలా పుట్టింటి ఆడబడుచులా మెట్టినింట అడుగునిడి మెట్టునెక్కి మురిసిముక్కలయి పున్నమి వెన్నెలై పుచ్చపూవులా విరిసింది కళ్ళాల్లో ఆరబోసిన పంటలన్నింటినీ కంటికి రెప్పలా కాపాడుతూ కొట్టొచ్చిన కళతో గంతులేస్తూ చిందులేసింది. పల్లె నాకు కల్పవృక్షంతో సమానం. ఆ ఆనందపు జీవనదితో నేననవరతం మమైక్యం. ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ 07-03-2014

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NEnTvk

Posted by Katta

Kavi Yakoob కవిత

యాకూబ్ ||అమ్మ, కవిత్వం || ................................... అందరి అమ్మల్లాగే మా అమ్మకూడా నన్ను కన్నది పురిటినొప్పులు పడుతూ కాకపోతే నా కుడిచేతిమీద ముద్దుపెట్టుకొని లాలనగా నిమిరిందేమో బహుశా, అందుకే ఈ కవిత్వం పల్లెరుకాయలమీంచి జొన్నకొర్రులమీంచి నడిచినడిచి మోపులుమోసి నన్నుపెంచింది కాబట్టే, ఈ అక్షరాలకు ఇంత కన్నీటితడి మా అమ్మతో నా పేగుబంధాన్ని కొడవల్లిక్కితో బరబరా కోశారప్పుడు అందుకేనేమో, ఈ అక్షరాలకు ఇంత గరుకు గొడ్లుమేపుతూ బుజ్జావు తప్పించుకున్నపుడు ఎనకాల ఊరికి మర్లెసేది ధైర్యంగా అందుకేనేమో, ఈ అక్షరాన్ని మర్లేస్తూ నేను ! # *పాతవాచకం -'ప్రవహించే జ్ఞాపకం' నుండి..

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1la64zd

Posted by Katta

Kavi Yakoob కవిత

SELECTED READINGS ~ ప్రసేన్ | ఆమె ............... ఆరిన దీపం వెనుక మిగిలే వెల్తురు చీకటి కొండెక్కిన ఆశాకాశ దీపం ఇసుకకొమ్మ మీద రెండు నీటిపండ్లు కదిలే జలపాతం వెనుక ఓ గుహ నేల కరిగిన దేవరహస్యం చెప్పిన అబద్దం వెలిగే లాంతరు ముందు నడిచే చీకటి. # [ప్రసేన్ సర్వస్వం' నుంచి ]

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gWTFMj

Posted by Katta

Kapila Ramkumar కవిత

|సూఫీ కవిత్వం || పరిచయం కపిల రాంకుమార్ ||సూఫీ కవిత్వం || పరిచయం అనువాదం దీవి సుబ్బారావు అరబ్బీ భాషలో '' సుఫ్ ' అంటే ముతకవున్ని అని అర్థంట!. సూఫీ అంటే దానితో నేసిన బట్ట కట్టుకునేవాడు. ఆడంబరాల్కు దూరంగా పవిత్రంగా జీవితాన్ని గడిపేవాడు. సూఫీ గూఢార్థం. అరబ్బీలో సూఫీ తత్వాన్ని ' తసవ్వుఫ్ ' అంటారు. సూఫీ కవిత్వాన్ని చదివితేనే సూఫీతత్వమూ తెలుస్తుంది. రూమీ ఆఫ్ఘనిస్తాన్‌ లో 1207 - 1273 మధ్య పారసీ భాషలో కవిత్వం చెప్పీ సూఫీ కవుల్లో అగ్రగణ్యుడు. ' మస్నవీ ' కావ్యం గొప్ప పేరు ప్రఖ్యాతులు ఆర్జించింది. రబియా ఆయన కంటే చాల ముందు కాలం 710-780. ఈమె ఇరాక్ లోని బస్రా నగరానికి చెందినది. అరబ్బీ భాషలో ఈ అమ్మ చెప్పిన కవితలు యెక్కూవగా లేవు గాని, చెప్పినంత వరకు గొప్పవిగానే కీ్ర్తింపబడినాయి. హఫీజ్ 14 వ శతాబ్దపు మెదట్లో ఇరాన్‌ దేశంలో పుట్టి అదే శతాబ్దం చివరిలో కాలంచేసాడు. పారసీ లో రచనలు చే్సాడు. రూమీ అంత పేరు పొందాడు. భగవంతుని కోసం పడే ఆరాటమే, తపనే ఆయన కవిత్వం దాన్నే ప్రతీకలుగ చెపుతాడు. ప్రేయసి భగవంతుడు. మధువు భగవంతుడి మీద వుండే ప్రేమ. మధువు సేవించి మత్తిల్లటం అంటే భగవత్భక్తిపారవశ్యమ్లో మైమర్చివుండటం. మధు పాత్ర హృదయానికి గుర్తు. మధువు అందించేవాడు భగవంతుడు కావచ్చు లెదా గురువు కావచ్చు. హఫీజ్ కవిత్వాన్ని ఇలా అన్వయించుకోవాలి. *** (1) మౌలనా జలాలుద్దిన్‌ రూమి -'' వీధిలోకి '' ఈ వీధిలోకి సుగంధాన్ని వెంట తీసుకురా ఈ నదిలోకి పట్టుపంచెలు విడిచేసిరా! ఇక్కడి మర్గాలన్నీ అక్కడికి దారితీస్తవిగాని ఇక్కడికీ యెక్కణ్ణించో రావు ఇవాళ మనం యే ఆచ్చాదన లేకుండా బ్రతకాల్సిన సమయమొచ్చింది! ** (2) రబియా : ''వేరు చేయకు '' దేవుడా! నిన్ను నేను నరకానికి భయపడి ప్రార్థిస్తుంటే నరకంలో పడేసి కాల్చు! స్వర్గం మీది ఆశతో ప్రార్థిస్తుంటే స్వర్గం నుంచి నన్ను దూరంగా నెట్టు! అలా కాకుండా, నిన్ను నేను నీకోసమే ప్రార్థిస్తుంటే నీ అనంతమైన సౌందర్యాన్నుండి నన్ను వేరు చేయకు! *** (3) హఫీజ్ - '' నిజంగా సిగ్గుచేటు '' వైద్యుడికి దగ్గరికి వెయ్యి మైళ్ళు ప్రయాణం చేసి వెళ్ళాను నా జబ్బేమిటో తెలుసుకుందామని నెలలు తరబడి పరీక్షలు చేసినా అసలు కారణం దొరకలేదు కాస్త అర్థం అయ్యేట్టు అతను చె్ప్పిందేమంటే నా చేతికున్న ఉంగరం రాయి నీలంగా వుందని తామంతా సవ్యంగా ఆలోచిస్తామనుకునే వాళ్ళలొ ఇంత అజ్`నానం వుండటం నిజంగా సిగ్గుచేటు. **** డీవి సుబ్బా రావు 143, వాసవి కాలనీ, హైదరాబాద్ 500 035 040-24035238 మొదటి ముద్రణ 2004 నవోదయ బుక్ హౌస్ , ఆర్య సమాజ్ ఎదురు వీధి కాచిగూడ, హైదరాబాద్ -27 వెల: రు.125/-

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NDU1z3

Posted by Katta

Krishna Mani కవిత

అమరజీవులు *************** పట్నం పోదుము పల్లె బతుకు దండగని బక్రీదు రేపనంగ నడి పట్నంల లారీ దిగిన గుంపులు చిత్రమైన బంగ్లాల జూసుకుంట ఒచ్చె పోయే బండ్లను ఆపుకుంట మురికి గడ్డిని మురిపంగా మూతికేషి ఏరిగిన కాడే పోసుకుంట మంచిచెడులను అనగవట్టి ముడుసుకొని కూసున్న ఊరి సరుకులు ! గడియకో తీరుగ తోడుబాసిన చూపులు ఏమి అయితతో తెల్వక బెత్తర మొఖాలు తోవ్వసాగక రోడ్డు మీద మోటార్లు నిల్పి పల్లె వాసనతో మురిసిన షోకు బతుకులు నగరం నాటకమాడు యాల పల్లెగా జేసి బతుకు పోరులో కొనకు జేరిన వీరులు ! దేవుని యాదిల బలిపీఠమేక్కిన యాటలు అమాయక పాణం ఆగమంటే ఎరుగని గుణం చితుకుట తప్పని జీవం ! కృష్ణ మణి I 07-03-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jY1a8A

Posted by Katta

Satya NeelaHamsa కవిత

నా ఊహలకన్నా అందమైనవేంకావు ^^^^^^^^^^^^^^^^^^^ -సత్య నన్ను మన్నించు! నా గుండెకి కి సరిపోను ప్రేమ లేదు నీదగ్గర నా ఊహలకన్నా అందమైనవేంకావు నీ రంగుల చీరెలు ఇది నా పిచ్చి,నీ మూర్ఖత్వం కాక పోతే, నా ప్రేమ భావాలు నీకు పొగడ్తలు గా వుంటే… నీ అందచందాలనయగారాలు, నీ సిగ్గుబిడియాలసోయగాలు నాకు ప్రేమ గా తోయడమేంటి? నా పరువానికి కి సరిపోను ప్రణయం లేదు నీదగ్గర… నా ఊహలకన్నా అందమైనవేంకావు నీ రంగుల చీరెలు! నువ్వు కూడలిదగ్గర అద్దాల గదిలో అలంకరించుకున్న ఆడ బొమ్మవి లేని చమురుతో వెలిగే దీపానివి కలలకందీ కళ్లకందని రూపానివి నా మనసుకి కి సరిపోను విషయం లేదు నీదగ్గర... నా ఊహలకన్నా అందమైనవేంకావు నీ రంగుల చీరెలు! తీయతీయని ఊసులు వింటూ లోలోన నవ్వుకునే నా భావాలపరిహాసానివి నువ్వు కావలని దగ్గరికొస్తూ లోలోన దూరం చేసే నా ఆశలపరియాచకానివి నువ్వు నా ముద్దులకి కి సరిపోను మురిపెం లేదు నీదగ్గర నా ఊహలకన్నా అందమైనవేంకావు నీ రంగుల చీరెలు నీ తో మొదలైందెమో కాని నీతో ఆగదు సహజమైన ప్రణయసౌందర్యనిత్యాన్వేషణ... నిజమైన ప్రణయం నిజమైన ప్రేమ, వీటికోసమే నా తపన, నిరీక్షణ అయినా నా భావాలకి కి సరిపోను బంధం లేదు నీదగ్గర నా ఊహలకన్నా అందమైనవేంకావు నీ రంగుల చీరెలు అయినా, నా ఊహల కన్నా, అందమైనవేం కావు నీ రంగుల చీరెలు -సత్య

by Satya NeelaHamsa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f4HVtf

Posted by Katta

Sasi Bala కవిత

అనుభవ కావ్యం ............................. అనుభవాల ఆది కావ్యం జీవితం కొందరికది సుందర స్వప్నం మరికొందరికది శాపకూపం రాగాల రంగుల కావ్యం శోకాల కడలి తరంగం ప్రేమ జీవుల మనసులు పాడే మోహన రాగాల గీతం బడబాగ్నితో రగిలే హృదయం ఆలపించే..... ముల్తానం కనురెప్పల నుండి జారిన కన్నీటి బిందువులెన్నో కంటిపాప లోన దాగిన తీపి తీపి కలలెన్నో ....... తీర్చ లేని వ్యధలెన్నో .. ఎన్నో ఎన్నెన్నో ... శశిబాల ......................7 march 14

by Sasi Bala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NDCzdS

Posted by Katta

Aruna Naradabhatla కవిత

కొత్త పాట ___________అరుణ నారధభట్ల మేల్కొన్నది మళ్ళీ ఈ కోడి ఇప్పుడిది నిరంతర శ్రమజీవి! కోర్కెల బుట్టనూ... పట్టాభిషేకపు కాంక్షలను నిండు గర్భిణిలా మోస్తూ...! ఇప్పుడే మావిచిగుర్లు నమిలిన కోయిలలా సప్తస్వరాలనూ...సప్తవర్ణాలనూ ఏకం చేస్తూ....ఇంగ్లీష్ రంగుల స్వప్నాలను భుజాన వేలాడదీసి మరో సునామీలోకి నడిపించడానికి! ఎన్ని నిర్లక్ష్యపు గుండెలో వేలికి దిద్దిన నీటిబొట్టుతో సరిపుచ్చుకునేవి... నాటకం రక్తి కడితే చాలనుకునేవి... గొంతు తడిపితే సరిపోతుందనీ అనుకునేవి! ఓ పట్టుచీరో...నాలుగు పచ్చనోట్లో క్షణికమైన కోర్కెలేనా ఈ జీవిత విలువ! ఐదేళ్ళ సంబరానికై చేసే తపస్సులో నీవెప్పుడైనా ఆటబొమ్మవే గానీ.... పందెం గెలిచిన కోడి నాలుగేళ్ళూ బుట్టనింపుకొని ఆఖరుకు నీపై చెమటచుక్కలను చిలకరిస్తుంది! మళ్ళోసారి సంబరాలు జరుపుకోవడానికి ఇప్పుడు నీ చేయూత అవసరం! నాలుక తడిపే మైకం కన్నా సుభిక్షంగా పండించే పిల్లకాలువైనా సరే... కావలసింది నువ్వు పదికాలాలు పదిలంగా ఉండటం! కాసిన్ని ముఖాన నీళ్ళు చల్లుకొని నిద్దుర మత్తునుండి మేల్కొని చూస్తే అన్ని రంగుల్లో ఏ రంగు నీ జాతకానికి కాస్తయినా సరిపోతుందో తెలిసేది! ఇప్పుడు అంతానీవే చెడగొట్టాలన్నా.... బాగుపరచాలన్నా... నువ్వు నొక్కే స్విచ్చును బట్టే భవిత! 7-3-2014

by Aruna Naradabhatla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NDwCxF

Posted by Katta

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి భక్తి క్యూలో బారునున్న భక్తజనాన్ని చూస్తూ నవ్వుకుంటూ ఉండిపోయింది అమ్మవారు క్యూ ఉన్న పలాన ఖాళీ అయిపోయింది ఆ ప్రక్కన సినిమా అమ్మడి చుట్టూ అదే భక్తజనం అమ్మవారు ఇంకా నవ్వుతూనే ఉంది ఎందుకంటే గుళ్లో పూజారి కూడా లేడు! 06MAR2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NDwzBS

Posted by Katta

Yasaswi Sateesh కవిత

యశస్వి's || జూన్ రెండున ఏమవుతుంది!!.. (అను పద్యరాణీయము.. ) జూన్ రెండున ఏమవుతుంది!! ఎప్పుడూ జరిగేదే జరుగుతుంది.. కాకపొతే.. “రోమ్ వండలులదాడిలో కొల్లగొట్టబడుతుంది.”- *1 ఏ నాటి మాట!! అయినా.. మనం రోమనులం కాదుకదా!! మనకేమిటి!! “బ్రిటన్లో రెండో ఎలిజబెత్ కిరీట ధారణ జరుగుతుంది..”-*2 నువ్వెప్పటి కబుర్లో చెబుతున్నావే!! మన మిప్పుడు తెల్లదొరల బానిసలం కాదుగా మనకేమిలే!! “అమెరికన్ వ్యోమనౌక.. సర్వేయర్ ఒకటి.. చంద్రుడి మీద దిగిందటగా!! “-*3a ఎవడో ఒకడు.. ముందుకురకగలిగాడులే మరో ప్రపంచం గెలవాలని.. “యూరపు కూటమి అంగారక యాత్ర కు శ్రీకారపు సుదినమిదే!!”-*3b అహ! జూన్ రెండున ఏమవుతుంది!! “పోప్ జాన్ పాల్ రెండు గారు.. పోలెండనే కమూనిష్టు దేశమున అడుగిడిరి!!..” -*4 మరి స్వస్థలంబును దైవదూత జేరుట వింతయేగదా!! సొంతయిన నేమి.. ప్రవాసబతుకున..ఉన్న సుఖము.. మత వ్యతిరేక జాతీయతా దేశమున ఉండునే!! ఇన్ని మాటలేల రెండేళ్ళ నాటి మాట.. “హోస్నీ ముబారక్ అను ఈజిప్టు పూర్వాధ్యక్షునికి.. ఉద్యమకారులను చంపించిన నెపము పైన.. జీవిత ఖైదు ..” -*5 హతవిధీ..హతవిధీ.. మరి క్రీస్తు శకము రెండు వేల పదునాలుగు జూన్ రెండున.... అసలు .. జూన్ రెండున ఏమవుతుంది!! ఒకానొక ఇటలీ దేశపు.. గణతంత్రదివసమున... (please underline..) -*6 ( ఇది కాకతాళీయ మందురా!! ఏమి!! ) మన ఐకమత్యపు పటాటోప విన్యాసములను గాంచి.. ఒక ఇటలీ.. మదారి.. చేస్తున్న పనియేమి!!.. అకటకట!! మిత్రులారా!! పండుగ చేసుకునెదము.. పాచిపోయిన ఇటాలియన్ కేకు ముక్కను నాకుడీ!! ఆనంద..మానంద మానంద..మప్పాయింట్ డే..!! (ointment.. Day!! ) పరిచారికులారా!! తెలుగు ప్రజలారా!! త్యాగమయీదేవి సందర్భ శుద్ది కి దిష్టి తియ్యుడీ!! ******************************** Notes: మదారి: కోతులను ఆడించు వృత్తి చేయువారు.. (నపుంశకలింగమగుగాక!!) జూన్ 2 న ప్రపంచచరిత్రలో.. (అంకెలు సంవత్సరములే.. సోర్స్: వికీపీడియా) *1: AD 455 – Sack of Rome: Vandals enter Rome, and plunder the city for two weeks *2: 1953 – The coronation of Queen Elizabeth II, who is crowned Queen of the United Kingdom, Canada, Australia, New Zealand and Her Other Realms and Territories & Head of the Commonwealth. *3a: 1966 – Surveyor program: Surveyor 1 lands on the Moon, becoming the first U.S. spacecraft to soft-land on another world. *3b: 2003 – Europe launches its first voyage to another planet, Mars. *4: 1979 – Pope John Paul II starts his first official visit to his native Poland, becoming the first Pope to visit a Communist country. *5: 2012 – The former Egyptian President Hosni Mubarak is sentenced to life imprisonment for his role in the killing of demonstrators during the 2011 Egyptian revolution. *6: 1946 – Birth of the Italian Republic: In a referendum, Italians vote to turn Italy from a monarchy into a Republic. After the referendum, King Umberto II of Italy is exiled. .. =5.4.2014=

by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l9f1J0

Posted by Katta

Panasakarla Prakash కవిత

వేశ్యా వాటిక‌ ఈ శరీరాన్ని పళ్ళతోటను చేసి చాలా రోజులయ్యి౦ది వచ్చి ఆకలి తీర్చుకుపోయేవాళ్ళేతప్ప...... మా ఆకలి దప్పులను చూసిపోయినవారెవరూ లేరు ఈ శరీరాన్ని వ్యాయామశాల చేసి చాలాకాలమయ్యి౦ది కసరత్తు చేసుకుపోయేవారేతప్ప ... మా కన్నీటిని చూసిపోయినవారెవరూలేరు ఈ శరీర౦ గర్భగుడికాదు.. దేవుడొక్కడికే తలవ౦చడానికి మా శరీర౦ ఒక రచ్చబ౦డ.. దీన్ని ఎవరు అధిరోహి౦చి ఏ తీర్పు చెప్పినా తలవ౦చి వినాల్సి౦దే..... మే౦ పెట్టుకునే పూలకి నలిగిపోవడమే తప్ప వాడిపోవడ౦ తెలీదు ఇక్కడ చల్లే అత్తరుకి మత్తువాసన తప్ప మా మనసు వాసన తెలీదు ఎ౦తమ౦ది ఎడారి కోర్కెలకు ఈ శరీర౦ దాహ౦ తీర్చిన ఒయాసిస్సయ్యి౦దో... ఎన్ని శరీరాలు ఈ శవ౦ మీదిను౦చి పొర్లుకు౦టూ పోయాయో అనుక్షణ౦ వేశ్యావాటికలో ఆకలి చితులమ౦టల్లో కాలుతున్న‌ మా బతుకులకే ఆ బాధలు తెలుసు... మే౦ పెరట్లో కాసిన చెట్ల‍‍‍౦కాదు.... మా ఫలాల్ని యజమాని ఒక్కడికే అ౦ది౦చడానికి మే౦ నలుగురూ నడిచే దారిలో కాసిన చెట్ల౦ ఆకలితో ఎవరు రాళ్ళేసి మమ్మల్ని గాయపరచినా తలవ౦చి ఫలాలనివ్వాల్సి౦దే........... మేమ౦టూ లేకపోతే ఈ కామ౦ధుల చూపుల రాళ్ళు తగిలి ఎన్ని పెరట్లో చెట్లు గాయపడేవో........... మా బతుకులు చిద్రమైనా ఫరవాలేదు మావలన కొ౦దరి బతుకులైనా భద్ర౦గా ఉన్నాయి ఈ ఒక్క ఆత్మ స౦తృప్తి చాలుమాకు కళ్ళు తెరవని ఈ సమాజ౦ము౦దు ప్రశా౦త౦గా... కన్ను మూయడానికి....................... పనసకర్ల 7/03/2014

by Panasakarla Prakash



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NZN7nL

Posted by Katta

Srinivasa Bharadwaj Kishore కవిత

మొన్న ఒకరోజు భారతదేశంలో వున్న నా స్నేహితునితో పిచ్చా పాటీ కాసేపటికి పిచ్చి-పోటీ అయి "త్త" సంయుక్తాక్షరంతో అంతమయ్యే పదాల వరుసలో మాట్లాడుకోవడం లోకి దిగింది. ఉదాహరణకు "ఏమిటి కొత్త - ఏముంది చత్త, ఉత్త....., అత్త...." వగైరా వగైరా. ఉన్నట్లుండి నేస్తం నన్నుద్దేశించి - "ఉత్త, మా అత్త, మత్తు, మీ అత్త" అన్న పదాలు ఉపయోగించి ఒక కందపద్యం వ్రాసి ఆతరువాతనే తనతో మాట్లాడమని ఠక్కున ఫోను పెట్టేశాడు. నాకు గొంతులో వెలక్కాయ పడింది కానీ ఈ ఛాలెంజీ సరదాగా బాగానే వుందనుకుని, కళ్ళుమూసుకుని ఇరవైనాలుగు గంటలూ వీణవాయించే ఆవిడను తలచుకుని రంగంలోకి దిగతే వచ్చిందిది - ఉత్తగడ౦బాలుపలికె మత్తునయున్నపుడుతెల్క మాయత్తికమీ యత్తయుతక్కువకాదుగ పుత్తడికాన్కని ఇత్తడిపూసలనిచ్చెన్ (ఒక అత్త డంబాలు పలికితే, ఇంకొకావిడ బంగారం అని చెప్పి ఇత్తడిపూసలనిచ్చింది) సరదాగా ఈ పద్యం వ్రాసిన తరువాత మళ్ళీ కళ్ళు మూసుకుంటే ఆవిడ వీణవాయించడం ఆపేసి ఆడవాళ్ళంటే, అందునా ఆత్తలంటై మరీ లోకువైపోయారా నీకు - అన్నట్లు నా వైపు కొరకొర చూడడం చూసి భయం వేసి, ఆవిడను మచ్చిచేసుకునే ఉద్దేశ్యంతో మళ్ళీ మొదలు పెట్టాను ఉత్తమ విద్యలతొ సమా యత్తముచేసిన నినువిడి యాచి౦చితి మీ యత్తను స౦పదలాశను మత్తువదలినది క్షమి౦పు మమ్మ పుత్రునిన్ (విద్యలనొసగిన సరస్వతీదేవిని కాదని ఆమెకు అత్త - అంటే లక్ష్మీదేవిని యాచించినందుకు క్షమాభిక్షనివ్వమని వేడుకున్నాను) మరి ఆ తరువాత కళ్ళుమూసుకుంటే ఇంకేమి కనిపిస్తుందో - ఊహించండి

by Srinivasa Bharadwaj Kishore



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gWnOvg

Posted by Katta

Srinivasa Bharadwaj Kishore కవిత

మొన్న ఒకరోజు భారతదేశంలో వున్న నా స్నేహితునితో పిచ్చా పాటీ కాసేపటికి పిచ్చి-పోటీ అయి "త్త" సంయుక్తాక్షరంతో అంతమయ్యే పదాల వరుసలో మాట్లాడుకోవడం లోకి దిగింది. ఉదాహరణకు "ఏమిటి కొత్త - ఏముంది చత్త, ఉత్త....., అత్త...." వగైరా వగైరా. ఉన్నట్లుండి నేస్తం నన్నుద్దేశించి - "ఉత్త, మా అత్త, మత్తు, మీ అత్త" అన్న పదాలు ఉపయోగించి ఒక కందపద్యం వ్రాసి ఆతరువాతనే తనతో మాట్లాడమని ఠక్కున ఫోను పెట్టేశాడు. నాకు గొంతులో వెలక్కాయ పడింది కానీ ఈ ఛాలెంజీ సరదాగా బాగానే వుందనుకుని, కళ్ళుమూసుకుని ఇరవైనాలుగు గంటలూ వీణవాయించే ఆవిడను తలచుకుని రంగంలోకి దిగతే వచ్చిందిది - ఉత్తగడ౦బాలుపలికె మత్తునయున్నపుడుతెల్క మాయత్తికమీ యత్తయుతక్కువకాదుగ పుత్తడికాన్కని ఇత్తడిపూసలనిచ్చెన్ (ఒక అత్త డంబాలు పలికితే, ఇంకొకావిడ బంగారం అని చెప్పి ఇత్తడిపూసలనిచ్చింది) సరదాగా ఈ పద్యం వ్రాసిన తరువాత మళ్ళీ కళ్ళు మూసుకుంటే ఆవిడ వీణవాయించడం ఆపేసి ఆడవాళ్ళంటే, అందునా ఆత్తలంటై మరీ లోకువైపోయారా నీకు - అన్నట్లు నా వైపు కొరకొర చూడడం చూసి భయం వేసి, ఆవిడను మచ్చిచేసుకునే ఉద్దేశ్యంతో మళ్ళీ మొదలు పెట్టాను ఉత్తమ విద్యలతొ సమా యత్తముచేసిన నినువిడి యాచి౦చితి మీ యత్తను స౦పదలాశను మత్తువదలినది క్షమి౦పు మమ్మ పుత్రునిన్ (విద్యలనొసగిన సరస్వతీదేవిని కాదని ఆమెకు అత్త - అంటే లక్ష్మీదేవిని యాచించినందుకు క్షమాభిక్షనివ్వమని వేడుకున్నాను) మరి ఆ తరువాత కళ్ళుమూసుకుంటే ఇంకేమి కనిపిస్తుందో - ఊహించండి

by Srinivasa Bharadwaj Kishore



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gWnOv6

Posted by Katta

Narayana Sharma Mallavajjala కవిత

వచనకవితకు వ్యాకరణం అవసరమా కాదా ?అవసరం అయితె ఎంతవరకు ?

by Narayana Sharma Mallavajjala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ovEYTk

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/తేనె మేఘాలు ------------------- కొన్నాళ్ళుగా మరుగున పడుతూనే ఉన్నా నిత్యం ఇంకిపోయే వాన చినుకులా వేర్లను కప్పేసిన చెట్టులా నాలోకి నన్ను ఎప్పుడో దాచేసుకున్నాను తేనె మేఘాలను స్పృశించిన నా కళ్ళు ఇంకా రమిస్తూనే ఉన్నాయి కొండరెక్కల వెనక కొన్ని కన్నీళ్ళను క్షణాలు యుగాలుగా మారడం అంటే ఇదేనేమో నీ వెలితి కమ్మినప్పుడల్లా తెలుస్తూనే ఉంటుంది నాలోని కొన్ని మధు పాత్రలు పగిలి దు:ఖంగా ఒలికిపోయినపుడు నన్ను నేను తుడుచుకుంటాను నీ ముందుకు రాకుండా నేడు కాదు రేపంటూ నువ్వు చెప్పిన ప్రతిసారి నమ్మాను నిశిరాతిరి చంద్రుడిని కెరటాలు ముద్దాడతాయంటే ఎగసిపడుతూనే ఉన్నా ఇంకా నిన్ను నా చేతుల మధ్య దాచుకోవాలని అయినా నేను మరుగున పడుతూనే ఉన్నా నిత్యనూతనంగా. తిలక్ బొమ్మరాజు 06.03.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/P6vqE5

Posted by Katta

Chi Chi కవిత

_TraileR_ ఆటేస్కో , పాటేస్కో వాటేస్కో , చాటేస్కో కాటేస్కో , పోటేస్కో ఓటేస్కో , నోటేస్కో నీకో నాకో ,లాక్కో పీక్కో మందైతే డిస్కో , కాకుంటే చేస్కో!! లేరు పరాయిలిక్కడ , పాములదే సొమ్ము ఊరు తురాయిలిక్కడ , అంటదెవరికీ దుమ్ము!! శ్మశానంలో No smokinG please అక్కడొకటే Rest in peacE!! ఆడదేమో all in none , పురుషుడేమో only one పీడ చాలక పుట్టుకున్న నపుంసకమో two in one!! నిజమే నీ వెంటపడి అన్వేషణ చేస్తోందని తెలిసే నువు దొరకవు నీ భ్రమ బతుకే better అని!! భాషేసే వేషాలే బతుకంతా పండగ మేతేసే మోసాలే మనసంతా నిండుగా!! వాడు , వాడికన్నా , వాళ్ళిద్దరికన్నా , వాళ్ళందరికన్నా అన్నన్నా!! ఆడంగి చేష్టల్లో అందరమూ మిన్న!! ఇంకా ఎంతో ఎంతెంతో ఉన్నా ఇంతకన్నా గొప్పగా చెప్పలేకున్నా!! ______________________Chi Chi (7/3/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ovuX8K

Posted by Katta

Kapila Ramkumar కవిత

చేరాతో ముఖాముఖి వ్యాసాలు » సెప్టెంబర్ 1999రచన : చేరా [ శ్రీ చేకూరి రామారావు గారి వివరాలు కొన్ని, వారి మాటల్లోనే. ఉస్మానియాలో B.A., ఆంధ్రాలో M.A. Telugu, Madison, Wis.లో, Cornell Univ.లో Linguistics చదువు. M.A., Ph.D. Linguistics from Cornell. ఉస్మానియాలో 196994 Lecturer, Reader, Professor, Dean వగైరా. తెలుగులో పుస్తకాలు. 1. రెండు పదుల పైన. పద్య గేయ సంకలనం. 2. తెలుగులో వెలుగులు. భాషా వ్యాసాలు. 3. వచన పద్యం లక్షణ చర్చ. సంపత్కుమారతో కలిసి. 4. తెలుగు వాక్యం. (తెలుగు వాక్య నిర్మాణ పరిశీలన) 5. ముత్యాల సరాల ముచ్చట్లు ఛందో వ్యాసాలు. 6. చేరా పీఠికలు. 7. చేరాతలు సాహిత్య విమర్శ, పరామర్శ (చేరాతలు 1986-94 మధ్యలో ఏడున్నర ఏళ్ళు. అందులో కొన్ని మాత్రమే సంకలనంలో వచ్చాయి.) ఇంగ్లీషులో Linguistics essays సంకలనం కాలేదు. సంకలనం కాని వ్యాసాలు చాలా ఉన్నాయి. ఇతరం. A.P. Open University B.A. Telugu సిలబసుకు ప్రధాన చోదకుడు. Indira Gandhi National Open Universityలో B.A. తెలుగు పాఠాలు రాశాడు. ఈ రెండూ ఆధునిక భాషను సిలబసులో పెట్టాయి. ఇదీ క్లుప్తంగా. ] _____________________________________________________________ ఒక అంశం -- మచ్చుకు మిగతాది: ఈ లింక్‌లో చదవండి http://ift.tt/1l8vixY ______________________________________________________________ వచన కవులకి కూడా ఛందో పరిజ్ఞానం, సాంప్రదాయ సాహిత్యంతో పరిచయం అవసరమని మీరు భావిస్తారా? భవిష్యత్తులో రాయాలనుకొనేవారికి సాంప్రదాయ సాహిత్య పరిజ్ఞానంలో కనీసార్హతలుగా మీరేమైనా సూచిస్తారా ? చేరా. వచన కవులకు ఎంత సాహిత్య పరిజ్ఞానం అవసరం అనేది ఎవరూ నిర్ణయించలేరు. వచన కవులకే కాదు, ఏ కవులకైనా సరే. ఆ మాటకొస్తే ఎవరికైనా సరే. ప్రత్యేక జ్ఞానాల విషయం వస్తే ఛందః పరిజ్ఞానం అవసరమా అంటే, వచన కవిత్వం రాసే వాళ్ళకి దానికి మాత్రమే పరిమితమయ్యే వాళ్ళకి ఛందః పరిజ్ఞానం అవసరం లేకపోవచ్చు. కాని కొంచెం విస్తరించదల్చుకుంటే ఈ లోపం కొట్ట వచ్చినట్టు కనిపిస్తుంది. ..కొన్ని ఉదాహరణలిస్తాను. 1. రావులపల్లి సునీత అనే కవయిత్రి “అన్వేషణ” అనే కవితా సంపుటి ప్రకటించింది. అందులో “పుష్పవిలాపం” పద్ధతిలో ఏదో ప్యారడీ లాంటిది ఉంది. (రిఫరెన్స్‌ నా దగ్గర లేదు) కరుణశ్రీ గారి పద్యాలను (ఛందఃపరిజ్ఞానంతో) చదివినవారు అయ్యో ఇది ఛందస్సులో లేకుండా ఇదేం ప్యారడీ అనిపిస్తుంది. 2. కొండేపూడి నిర్మల కూడా ఇట్లాగే ఒకటి అంటే పద్యాలకు వచనకవిత్వం ప్యారడీ రాస్తే నేను తీవ్రంగా వ్యతిరేకించాను. తరవాత అచ్చువెయ్యటం మానుకుంది. 3. శ్రీశ్రీ ప్రాసక్రీడలు అందరికీ తెలిసిందే. అది మాత్రా ఛందస్సులో ఉంది. దాని వివరాల జోలికి వెళ్ళను. విశాలాంధ్ర వాళ్ళు అచ్చువేసిన నా “ముత్యాల సరాల ముచ్చట్లు”లో ఉంది. జయప్రభ, రంగనాయకమ్మ మీద “అసలే కోతి” అని (యశొధరా వగపెందుకే?), చేరా మీద “ముళ్ళకంప ఛందం!” అని చింతల నెమలి లో రాసింది. ఈ రెండూ తిట్టి కవితలు. శ్రీశ్రీ ప్రాసక్రీడలు మాత్రాఛందస్సుల్లో రాసిన సెటైరు. ఆ సెటైరు పాదానికి పన్నెండు మాత్రలుండే ఛందస్సులో ఉంది. శ్రీశ్రీ ప్రాసక్రీడల పరిజ్ఞానం ఉన్న ఎవరైనా జయప్రభ రాసిన రెండు సెటైర్లూ ప్రాసక్రీడల మోడల్లో రాసినట్లు చెప్పగలరు. కాని ఛందస్సు అర్థం కాకపోవటం వల్ల వాటిలో అతిక్రమణలు చాలా ఉన్నాయి. ఛందస్సు తెలిసిన పాఠకులకు అవి రుచించవు. నా ఇష్టం వచ్చినట్టు రాస్తాను, నీ ఇష్టం ఐతే చదువు లేకపోతే మానెయ్యి అనటానికి వీల్లేదు. సరే ఇది ఛందస్సుకు సంబంధించింది. ఇక భాషావిషయం. కవిత్వానికి మాట్లాడే భాష నిషిద్ధం కాదు కాని దానికే పరిమితం కాదు. కవిత్వభాషలో ప్రాచీనభాష నిషిద్ధం కాదు. భాషలో దొరికే అన్ని వనరులనూ కవిత్వభాష వాడుకుంటుంది. ఉదాహరణకు మళ్ళీ జయప్రభ కవిత్వాన్నే చూడండి (ఆమె స్పెల్లింగులను వదిలెయ్యండి). ఈనాటి వచన కవులలో ఇంత ప్రాచీనభాష వాడిన కవులు ఇటీవలి కవుల్లో లేరంటే అతిశయోక్తి కాదు. కాని అద్భుతంగా వాడింది. (జయప్రభ కవిత్వంపై నా అభిమానానికి అదొక కారణం.) వచనకవులకు ప్రాచీన కవిత్వ భాషా పరిజ్ఞానం అవసరమా అంటే ఏం చెప్పాలి? ఆ పరిజ్ఞానం ఎట్లా వస్తుంది? ప్రాచీన కావ్యపఠనం వల్ల వస్తుంది. నా కక్కర్లేదు అంటే ఎవరూ ఏమీ చెయ్యలేరు. ఉద్యోగాల్లోనో, కోర్సుల్లోనో చేరేవారికి లాగా, అర్హతలను (కనీసమైనా, గరిష్టమైనా) సూచించటం నాకు చేతకాదు. కాని సంప్రదాయ సాహిత్యాన్ని మాకు అక్కర్లేదని వదిలెయ్యటం అయాచితంగా దొరుకుతున్న ధనాన్ని కాలదన్నుకోటం లాంటిదని నా అభిప్రాయం! 7.3.14

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l8vixY

Posted by Katta

Naresh Kumar కవిత

సొన్నయిల నరేష్కుమార్ // నువ్వలా// నువ్వూ నడిచే ఉండి ఉంటావ్ కొన్ని అక్షరాల వెంట ఎప్పుడొ అప్పుడు... వధించే ఉంటావ్ కదూ మరికొన్ని అమాయక క్షణాలని విస్కీ బాటిల్ లో ముంచి నడిచే జనాలు ఉన్న శూన్యపు దారివెంట నా అడుగుల ని పోలిన మనిషి మొహాన్ని చూసే ఉంటావ్ లే.... వెచ్చని టే కేటిల్ లో మరిగిన నిమిషాలని గొంతులోకొంపు కుంటూ ఒక స్వేచ్చా గానమై గాల్లో నిలుచున్నప్పుడు మిత్రుడా...! నువ్వూ నాలానే ఒక ఎర్రని వానపామై ఎవరిమొహం పైనో పాకే ఉంటావ్ ఇవాలంటే ఒక మగాడిగానో మహా ఉన్నతుడి గానో ఓ ముసుక్కప్పుకున్నావ్ గానీ నాకు తెలుసు నాలా నువ్వూ అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు అచ్చంగా మనిషి గానే ఉండి ఉంటావ్........ 07/03/14

by Naresh Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lCxsJb

Posted by Katta

Abd Wahed కవిత

గాలిబ్ కవితలపై వివరణలను చదివి ఆనందిస్తూ, చక్కని కామెంట్లతో నన్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈ రోజు గాలిబ్ కవితల్లో మొదటిది గాలిబ్ సంకలనం లోని 10వ గజల్ మొదటి షేర్. సతాయిష్ గర్ హై జాహిద్ ఇస్ ఖద్ర్, జిస్ బాగ్ రిజ్వాం కా ఓ ఇక్ గుల్దస్తా హై, హమ్ బేఖుదోం కే తాఖె నిస్యాం కా సాధుపుంగవులు స్వర్గఉద్యానవనాన్ని చాలా ప్రశంసిస్తున్నారు కాని, అది మా లాంటి ధ్యాసలేని వారు మరపుగూటిలో వదిలేసిన పూలగుచ్ఛం ఉర్దూ పదాల అర్ధాలు చూద్దాం. సతాయిష్ అంటే ప్రశంస, మెచ్చుకోలు. జాహిద్ అంటే సాధువు, ధర్మపరాయణుడు. బాగ్ అంటే ఉద్యనవనం. రిజ్వాన్ అనేది స్వర్గానికి అధిపతి అయిన దేవదూత పేరు. బాగె రిజ్వాం అంటే రిజ్వాంకు చెందిన ఉద్యనవనం, అంటే స్వర్గం. గుల్ అంటే పువ్వు. దస్తా అంటే పట్టుకునేది, లేదా హ్యాండిల్. గుల్దస్తా అంటే పూలగుచ్ఛం, లేదా బోకెట్. ఖుద్ అంటే స్వయం. బే అంటే వ్యతిరేకార్థాన్ని సూచించే పదం, బే ఖుదీ అంటే తనలో తాను లేకపోవడం. స్వయం గురించిన ధ్యాస లేకపోవడం, తన్మయత్వంలో ఉండడం, ఆబ్సెంట్ మైండెడ్. తాఖ్ అంటు గోడలో కట్టిన చిన్న గూడు లేదా షెల్ఫు. నిస్యాం అంటే మతిమరుపు. తాఖె నిస్యాం అంటే మతిమరుపు గూడు. ఇది గాలిబ్ 10వ గజల్ లో మొదటి షేర్. ఇందులో మొత్తం 12 షేర్లున్నాయి. అన్ని షేర్లు అద్భుతమైన భావాలే. ఈ కవితలో తాఖె నిస్యాం అంటే మతిమరపు గూడు అన్న పదప్రయోగం హైలేట్. సాధారణంగా మనం వస్తువులను అల్మారాలో, షెల్ఫుల్లో ఉంచుతాం, దాచుకుంటాం. ఒకప్పుడు గోడలో గూడులా కట్టి ఉండేది. అందులో ఉంచేవారు. అలా ఉంచిన వస్తువులను మరిచిపోవడం కూడా జరుగుతుంటుంది. గాలిబ్ తన మతిమరుపునే అలాంటి గూడుగా వర్ణిస్తున్నాడు. ఈ కవితలో కూడా వ్యంగ్యం ఉంది. స్వర్గం కావాలని కోరుకునే వారు, స్వర్గం లభించాలని తీవ్రంగా అభిలషించేవారు, స్వర్గ లోక ఉద్యనవనాల సౌందర్యాన్ని ప్రశంసిస్తూ ఉంటారు. ధర్మపరాయణులుగా జీవించి స్వర్గానికి అర్హత పొందాలనుకుంటారు. ఎలాగైన స్వర్గం తమకు దక్కాలన్నదే వారి కోరిక. కాని అలాంటి స్వర్గం తనకు పెద్దగా ముఖ్యమైనది కాదంటున్నాడు గాలిబ్. తమను తాము మరిచిపోయి, తన్మయత్వంలో జీవిస్తున్న వారికి (బేఖుదోంకో) ఈ ధర్మపరాయణులు కోరుకునే స్వర్గంపై ఆసక్తి ఉండదని చెబుతూ. అలాంటి వారు మతిమరపు గూటిలో పెట్టి మరిచిపోయిన పూలగుచ్ఛం వంటిదే స్వర్గం అంటాడు. ఈ కవిత పైకి కనబడుతున్నంత సరళమైనది కాదు. ధర్మపరాయణులు స్వర్గం కోసం పరితపిస్తూ ఉంటే, దానికి ఎంతగానో విలువ ఇస్తూ ఉంటే తాను మాత్రం తన ప్రేయసి ధ్యాసలోనే ఉన్నాడు. ఆ తన్మయత్వంలో మునిగిపోయాడు. గూటిలో పెట్టి మరిచిపోయిన పూలగుచ్ఛంలా స్వర్గాన్ని మరిచిపోయాడు. ఇందులో సూఫీ కోణమేమంటే, ఇక్కడ ప్రేయసి ఆలోచనలు కాదు, నిజానికి దేవుని పై ప్రేమలో సమస్తాన్ని మరిచిపోయాడు. దేవుడిస్తానని చెప్పిన స్వర్గాన్ని కూడా మరిచిపోయాడు. ఇదే విషయాన్ని చెబుతూ ధర్మపరాయణులు స్వర్గం కోసం అంతగా పరితపించడం ఆయనకు ఆశ్చర్యంగా ఉంది. ఒక వస్తువును గూటిలో పెట్టేయడమంటే అర్ధం దానితో పనిలేదు కాబట్టి అక్కడ వదలడం. స్వర్గాన్ని పూలగుచ్ఛంగా గూటిలో వదిలేసాననడమే కాదు, మరపు గూటిలో అంటూ ఇక దాన్ని పూర్తిగా మరిచిపోయానంటున్నాడు. ఇందులో ఉన్న వ్యంగ్యం చాలా సున్నితమైనది. స్వర్గాన్ని గాలిబ్ పూలగుచ్ఛంతో పోల్చాడు. అంటే దాని విలువను, శోభను తగ్గించలేదు. దాన్ని మరపుగూటిలో వదిలేసానని చెప్పడం ద్వరా తన దృష్టిలో స్వర్గం కన్నా తన తన్మయత్వమే ముఖ్యమని చెబుతున్నాడు. దేవుని ధ్యాసలో సర్వం మరిచిపోయి తన్మయత్వంలో ఉన్నవాడికి మరేదీ ముఖ్యమైనది కాదన్న భావం ఇందులో ఉంది. రెండవ కవిత గాలిబ్ సంకలనం 10వ గజల్ మూడవ షేర్. నా ఆయీ సత్వతె ఖాతిల్ భీ మానే, మేరే నాలోం కో లియా దాంతోం మేం జో తిన్కా, హువా రేషా నయస్తాం కా హంతకుడి ఉగ్రరూపం నా ఆర్తనాదాన్ని ఆపలేదు పంటిమధ్య గడ్డిపరక వేణునాదాల స్ధానమైంది ఉర్దూ పదాలను చూద్దాం. సత్వత్ అంటే ఉగ్రత్వం, ఆగ్రహోదగ్ర స్వభావం. మానె అంటే నిరోధించడం. నాలా అంటే పిలుపు, ఆర్తనాదం. దాంత్ అంటే దంతాలు, తిన్కా అంటే గడ్డిపరక, కాని దాంతో మేం తిన్కా లేనా అన్నది ఉర్దూ పలుకుబడి. దీనికి అర్ధం చేష్టలుడిగిపోవడం, మాట్లాడలేకపోవడం, గొంతునొక్కబడడం వగైరా. రేషా అన్నా కూడా గడ్డిపరకే లేదా పీలిక, దారప్పోగును కూడా రేషా అంటారు. నై అంటే వేణువు. నయస్తాన్ అంటే వేణువుల ప్రదేశం, అంటే వెదురు పొదలున్న చోటని చెప్పవచ్చు. ఈ కవితను అర్ధం చేసుకునే ముందు నయ్ స్థాన్ అన్న పదాన్ని కాస్త చూద్దాం. నయ్ అంటే వేణువు. ఉర్దూలో ఆబాద్, ఖానా, బార్, జార్, స్థాన్ వగైరా పదాలను ఒక నామవాచకం తర్వాత చేర్చితే అది ఒక ప్రదేశాన్ని సూచించే పదమవుతుంది. తెలుగులో కూడా గుట్ట, పాడు, పేట వగైరా పదాలను చేర్చితే ప్రదేశాన్ని సూచించడం జరుగుతుంది కదా. సంతపేట, పావురాల గుట్ట వగైరా పేర్లు ప్రదేశాన్ని సూచిస్తాయి. అలాగే హైదర్ అన్న పదానికి ఆబాద్ చేర్చితే హైదరాబాద్ అవుతుంది. షరాబ్ అంటే మద్యం దానికి ఖానా పదం చేర్చితే షరాబ్ ఖాన్, మద్యం దొరికే చోటు. గుల అంటే పువ్వు, గుల్జార్ అంటే పూలతోట. గాలిబ్ ఇక్కడ నయ్ అన్న పదానికి స్థాన్ అన్న పదాన్ని కలిపి వేణువులు స్ధానం లేదా వేణువుల ప్రదేశం అన్న అర్ధం వచ్చేలా చేశాడు. అంటే ఇది వెదురుపొదల ప్రదేశం అని చెప్పవచ్చు. వెదురుపొదల్లో గాలి వీస్తే ఒళ్ళు గగుర్పొడిచే శబ్ధాలు వస్తాయన్నది కూడా మనం గమనించాలి. ప్రతి వెదురు ఒక వేణువులా మారిందా అనిపిస్తుంది. అలాగే కవితలో ఉపయోగించిన దాంతో మేం తిన్కా లేనా అన్న పదబంధానికి అర్ధం, మనిషి పంటిమధ్య గడ్డిపరకను కరిచిపట్టుకుంటే మాట్లాడలేడు. మరోవైపు అతడి ముక్కునుంచి వదిలే ఊపిరివల్ల ఆ గడ్డిపరక కొట్టుకుంటూ శబ్ధం వస్తుంది. మనిషి మాట్లాడలేడు, కాని అతడి నోటిలో మాటలు రాకుండా కరచుకుని ఉన్న గడ్డిపరక మాట్లాడుతుంది. ఇప్పుడు గాలిబ్ ఏం చెప్పాడో అర్ధం చేసుకోవడం తేలిక. అతనిపై దాడికి వచ్చిన ప్రత్యర్థి ఉగ్రరూపం చూసి గాలిబ్ నోరువిప్పలేకపోయాడు. ఇక్కడ దంతాల మధ్య గడ్డిపరక కరచిపెట్టుకున్నాడు. కాని ఆ గడ్డిపరక ప్రతిఘటిస్తూ, వేణువులా ఆర్తనాదాలు చేస్తోంది. ప్రత్యర్ధి గాలిబ్ మాట్లాడకుండా గొంతునొక్కగలిగాడు, కాని గాలిబ్ నోట ఉన్న గడ్డిపరక గొంతునొక్కలేకపోయాడు. ఈ కవిత చాలా లోతైన భావం ఉన్న కవిత. దౌర్జన్యపరుడు ఎంత బలశాలి అయినా గాని అణిచివేతలకు పాల్పడి బలహీనులను ఎంతగా పీడించినా గాని ప్రతిఘటనను వాళ్ళు ఆపలేరు. హంతకుల ఆయుధాలు, హతుల గొంతులు మూగబోయినా, హతుల రక్తం బిగ్గరగా అన్యాయాన్ని ప్రతిఘటిస్తూనే ఉంటుంది. ఈ కవితలో గాలిబ్ ఊహాశక్తి గమనించదగ్గది. ఉర్దూలో ఒక పలుకుబడిని, పండ్లమధ్య గడ్డిపరక కరచుకోవడం... అంటే నోరుమూతపడడం అన్న పలుకుబడిని ఉపయోగించి, తన నోరుమూతపడినా, పండ్లమధ్య ఉన్న గడ్డిపరక గొంతు నులమలేరన్నాడు. మరో మాటలో చెప్పాలంటే, బలహీనులు, పీడితుల మౌనం కూడా ఆర్తనాదాలతో ప్రతిఘటిస్తుందని చెప్పాడు. ఈ కవితలో రెండవ పంక్తిలో చెప్పిన వేణువుల ప్రదేశం అన్న పదప్రయోగం కూడా గమనించదగ్గది. ఇలాంటి ఆర్తనాదాలు చేసే గడ్డిపరకలన్నీ గుమిగూడే ప్రదేశం అవుతుందన్న హెచ్చరిక ఇందులో ఉంది. అంటే దౌర్జన్యానికి గురైన ఆ ఒక్క గడ్డిపరక అనేక వేణువుల్లా మారి దౌర్జన్యపరులను ప్రతిఘటిస్తుంది. కేవలం రెండు పంక్తుల్లో చాలా లోతయిన సామాజిక స్పృహను పలికించడం గాలిబ్ కు మాత్రమే సాధ్యం. ఫక్తుగా గజల్ భావంతో అర్ధం చేసుకున్నప్పుడు కూడా ఇందులో చమత్కారం ఆకట్టుకుంటుంది. ఇక్కడ ఖాతిల్ అన్న పదాన్ని గాలిబ్ తన ప్రేయసిని ఉద్దేశించి వాడినట్లు భావిస్తే. గాలిబ్ తన ప్రేయసితో ’’ఓ హంతకీ, నువ్వు ఎంత కోపంగా నా మీదికి వస్తున్నా, నా నోట మాటరానంతగా నేను లొంగిపోయినా, నా మౌనం కూడా నిన్ను ప్రతిఘటిస్తుంది, (నా పండ్లమధ్య ఉన్న గడ్డిపరక కూడా నీ దౌర్జన్యాన్ని సహించడం లేదు) అని చెప్పడంలో చక్కని చమత్కారం ఉంది. ఒక ప్రేమకవితలో ఇలాంటి సామాజిక స్పృహను పలికించడం చాలా కష్టం. తర్వాతి కవిత గాలిబ్ సంకలనం 10వ గజల్ లో 5వ షేర్ కియా ఆయినే ఖానే కా వో నక్షా తేరే జల్వే నే కరే జో పర్తూ ఏ ఖుర్షీదే ఆలమ్ షబ్నమిస్తాం కా నీ సౌందర్య శోభతో అలంకరించబడింది అద్దాల గది మంచుబిందువుకు ఉషోదయ తొలికిరణం చేసిన అలంకరణే అది ఉర్దూ పదాల అర్ధాలు చూద్దాం. ఆయినా అంటే అద్దం. ఆయినా ఖానా అంటే అద్దాల గది. నక్షా అంటే చిత్రం, మ్యాప్. జల్వా అంటే శోభ అని అర్ధం చెప్పుకోవచ్చు. పర్తూ అంటే నీడ. ఖుర్షీద్ అంటే సూర్యుడు. పర్తూ యే ఖుర్షీద్ అంటే సూర్యుడి నీడ, ఇక్కడ భావం సూర్యకిరణాలని. ఆలమ్ అంటే ప్రపంచం, పరిస్థితి అన్న భావం కూడా ఉంది. షబ్నమిస్తాన్ అంటే ప్రాతఃకాలపు మంచుబిందువులు వాలిన చోటు. అంటే పువ్వులు, చెట్ల ఆకులు, పచ్చిక వగైరా అని చెప్పాలి. లైట్ అండ్ సౌండ్ షో లా ఈ కవిత ఒక హీట్ అండ్ లైట్ షో లాంటిది. తన ప్రేయసి అద్దాల గదిలోకి రాగానే చోటుచేసుకునే అద్భుతాన్ని గాలిబ్ ఇందులో వర్ణించాడు. ఆమె ప్రవేశించడమన్నది సూర్యోదయంలా ఉంది. ఉషోదయపు తొలికిరణం పడకముందు మంచుబిందువులు పూలపై, ఆకులపై, పచ్చికపై వాలి గర్విస్తూ ఉంటాయి. కాని సూర్యకిరణాలు వాటి గర్వాన్ని పటాపంచలు చేస్తూ వాటిని మాయం చేస్తాయి. మంచుబిందువులు గాల్లో కలిసిపోతాయి. అదేవిధంగా తన ప్రేయసి రాకముందు అద్దాల గది తన మెరుపులు చూసి చాలా మురిసిపోయిందంట. అద్దాల గది తన శోభ చూసి చాలా గర్వించేదట. కాని గాలిబ్ ప్రేయసి ఆ అద్దాల గదిలో అడుగుపెట్టిన వెంటనే ఆమె సౌందర్యశోభ ముందు అద్దాలగది మసకబారింది. వెలవెలబోయింది. అద్దాల గది గర్వం కూడా మంచుబిందువుల గర్వంలా గాల్లో కలిసిపోయింది. ఇది ఫక్తు ప్రేమకవిత. ఇందులో నక్షా అన్న పదం గమనించదగ్గది. ఉర్దూ తెలిసిన వారికి నక్షా బిగాడ్ దూంగా అన్న పదప్రయోగం తెలిసే ఉంటుంది. ఎవరైనా ఇద్దరు కోట్లాడుకుంటున్నప్పుడు, కోపంగా నీ ఎముకలిరగ్గొడతాను వగైరా పదాలు ఉపయోగిస్తారు. నక్షా బిగాడ్ దూంగా అన్న పదాలు కూడా అలాంటివే. అంటే నీ రూపం చెడగొడతాను, అంటే కొట్టి అసలు రూపం పోయి ముఖం వాచేలా చేస్తాను అన్నది భావం. ఇక్కడ వాడిన నక్షా అన్న పదం కూడా అలాంటిదే. అద్దాల గది నక్షా అంటే అద్దాల గది రూపాన్ని ప్రేయసి ఎలా మార్చిందంటే, దాని గర్వం అణిచిపోయి చతికిలబడింది. ఈ కవిత ప్రేయసిని మెప్పించడానికి అతిశయోక్తులతో రాసిన కవిత. ఇది ఈ వారం గాలిబాన. మళ్ళీ శుక్రవారం కలుద్దాం. అస్సలాము అలైకుమ్.

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lCvlFj

Posted by Katta

Kotha Anil Kumar కవిత

** తరాజు ** బల పరిక్షల తరాజు తయారయ్యింది ఒక దిక్కు దొంగ ఓట్లు ఇంకొక దిక్కు మాదండి నోట్లు - కొత్త అనిల్ కుమార్ ** సమాధానం .** ఓట్ల పండుగ జేసుకునుటానికి నోట్ల తోరణం కట్టుకుంది ఈ అరాచక సమాజం. మరి, ఏ రాజకీయ నాయకుడు చెబుతాడో సరి ఐన సమాధానం . - కొత్త అనిల్ కుమార్

by Kotha Anil Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cdH6Pi

Posted by Katta