కొత్త పాట ___________అరుణ నారధభట్ల మేల్కొన్నది మళ్ళీ ఈ కోడి ఇప్పుడిది నిరంతర శ్రమజీవి! కోర్కెల బుట్టనూ... పట్టాభిషేకపు కాంక్షలను నిండు గర్భిణిలా మోస్తూ...! ఇప్పుడే మావిచిగుర్లు నమిలిన కోయిలలా సప్తస్వరాలనూ...సప్తవర్ణాలనూ ఏకం చేస్తూ....ఇంగ్లీష్ రంగుల స్వప్నాలను భుజాన వేలాడదీసి మరో సునామీలోకి నడిపించడానికి! ఎన్ని నిర్లక్ష్యపు గుండెలో వేలికి దిద్దిన నీటిబొట్టుతో సరిపుచ్చుకునేవి... నాటకం రక్తి కడితే చాలనుకునేవి... గొంతు తడిపితే సరిపోతుందనీ అనుకునేవి! ఓ పట్టుచీరో...నాలుగు పచ్చనోట్లో క్షణికమైన కోర్కెలేనా ఈ జీవిత విలువ! ఐదేళ్ళ సంబరానికై చేసే తపస్సులో నీవెప్పుడైనా ఆటబొమ్మవే గానీ.... పందెం గెలిచిన కోడి నాలుగేళ్ళూ బుట్టనింపుకొని ఆఖరుకు నీపై చెమటచుక్కలను చిలకరిస్తుంది! మళ్ళోసారి సంబరాలు జరుపుకోవడానికి ఇప్పుడు నీ చేయూత అవసరం! నాలుక తడిపే మైకం కన్నా సుభిక్షంగా పండించే పిల్లకాలువైనా సరే... కావలసింది నువ్వు పదికాలాలు పదిలంగా ఉండటం! కాసిన్ని ముఖాన నీళ్ళు చల్లుకొని నిద్దుర మత్తునుండి మేల్కొని చూస్తే అన్ని రంగుల్లో ఏ రంగు నీ జాతకానికి కాస్తయినా సరిపోతుందో తెలిసేది! ఇప్పుడు అంతానీవే చెడగొట్టాలన్నా.... బాగుపరచాలన్నా... నువ్వు నొక్కే స్విచ్చును బట్టే భవిత! 7-3-2014
by Aruna Naradabhatla
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NDwCxF
Posted by Katta
by Aruna Naradabhatla
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NDwCxF
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి