తిలక్/తేనె మేఘాలు ------------------- కొన్నాళ్ళుగా మరుగున పడుతూనే ఉన్నా నిత్యం ఇంకిపోయే వాన చినుకులా వేర్లను కప్పేసిన చెట్టులా నాలోకి నన్ను ఎప్పుడో దాచేసుకున్నాను తేనె మేఘాలను స్పృశించిన నా కళ్ళు ఇంకా రమిస్తూనే ఉన్నాయి కొండరెక్కల వెనక కొన్ని కన్నీళ్ళను క్షణాలు యుగాలుగా మారడం అంటే ఇదేనేమో నీ వెలితి కమ్మినప్పుడల్లా తెలుస్తూనే ఉంటుంది నాలోని కొన్ని మధు పాత్రలు పగిలి దు:ఖంగా ఒలికిపోయినపుడు నన్ను నేను తుడుచుకుంటాను నీ ముందుకు రాకుండా నేడు కాదు రేపంటూ నువ్వు చెప్పిన ప్రతిసారి నమ్మాను నిశిరాతిరి చంద్రుడిని కెరటాలు ముద్దాడతాయంటే ఎగసిపడుతూనే ఉన్నా ఇంకా నిన్ను నా చేతుల మధ్య దాచుకోవాలని అయినా నేను మరుగున పడుతూనే ఉన్నా నిత్యనూతనంగా. తిలక్ బొమ్మరాజు 06.03.14
by Thilak Bommaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/P6vqE5
Posted by Katta
by Thilak Bommaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/P6vqE5
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి