పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!. ‎

2, మార్చి 2014, ఆదివారం

Ramakanth Vengala కవిత

పోలవరం-చలిజ్వరం ============== నియంత్రిస్తున్న నేత్రాల్ని పరాజితుల్ని చేస్తున్న.. దుస్స్వప్న౦.. పోలవరం! అది నిర్మితమవుతున్న క్రమంలో.. వైద్యమందని గూడాలను.. వణికిస్తున్న చలిజ్వరం!! విభజన నేపథ్యంలో గిరిజనుల ఉరికంబం! ఆస్తుల పంపకంలో ఏలికల వర్తకం! తూనికరాళ్ళలో ఏదో మోసం!! ఫలితంగా.. గోదారి పదఘట్టనల కింద నేలమట్టమవుతున్న పూరిగుడిసెలు! తెలంగాణా తుదిఘట్టంలో.. తాకట్టుపెట్టబడ్డ ఆదిమనుషులు!! ఈ పీడకల నిజమైతే.. ఇక..విముక్తి నిర్వచనం.. 1947- అర్థరాత్రిస్వాతంత్ర్యం! 2014- అర్థరహితస్వాతంత్ర్యం!! -రాము

by Ramakanth Vengala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hR78Gf

Posted by Katta

Humorist N Humanist Varchaswi కవిత

కవి కోకిలలకై ఎదురుచూస్తున్న ఓపచ్చటి చెట్టు......!

by Humorist N Humanist Varchaswi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mUFdZ9

Posted by Katta

Patwardhan Mv కవిత

నిరంతరం కవిత్వం కోసం తపించే మిత్రులు కవి యాకూబ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.

by Patwardhan Mv



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NI7mWM

Posted by Katta

Nvmvarma Kalidindi కవిత

పచ్చని చెట్టుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ...కవి యాకూబ్ గారి పుట్టిన రోజు ఈ రోజు.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Nic8dD

Posted by Katta

RajendraKumar Devarapalli కవిత



by RajendraKumar Devarapalli



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eObyKM

Posted by Katta

Panasakarla Prakash కవిత

ఈ ఉదయ౦ ఆకాశ౦ దుప్పటిలో౦చి తల బైటపెట్టిన‌ సూరీడు ఇప్పుడే నిద్రలేస్తూ.. మబ్బు కళ్ళు నలుపుకు౦టున్నాడు లోక౦ ఇ౦కా మసగ్గానే ఉ౦ది కిరణాల చేతి స్పర్శ తగలక... పూలరేకులమీద పుప్పొడిలా అ౦టిపెట్టుకున్న మ౦చుబి౦దువులు ఆవిరికావడ౦లేదు చెట్ల మద్దెలు తడిసిన వయ్యారపు నడుమొ౦పులై ఉదయానికి స్వాగత౦ పలుకుతున్నట్టున్నాయ్ సూరీడి కిరణాలను నేలక౦టే ము౦దే అ౦దుకోవాలని చిటారుకొమ్మమీద చిగురులు ప్రయత్న౦ చేస్తున్నాయ్ గోదారిసకలో కట్టిన పిచ్చుకగూళ్ళు ఇ౦కా చెమ్మారలేదు డాబా మీద ఆరబెట్టిన ఒడ్లు మ౦చులో తడిసి మెరుస్తూనే ఉన్నాయ్ సీతాకాలాపు హద్దులు దాటి సూరీడు నేలను చేరుకోడానికి ఇ౦కొ౦త సమయ౦ పట్టొచ్చు.. రాత్ర౦తా మ౦చు తు౦పరలో తడిసిన నేల.. ఉదయకిరణాల వెచ్చదన౦లో వొళ్ళారబెట్టుకోవాలని పాప౦ ఉదయ౦ను౦చి ఎదురు చూస్తూనే ఉ౦ది. పనసకర్ల‌ 2/03/2014

by Panasakarla Prakash



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bWyDQz

Posted by Katta

Renuka Ayola కవిత

(తొలి హాస్య కవితా సంకలనం. ౨౦౮ ఫిప్ర వరి లోనిది ) రేణుక అయోల//నాతో మాట్లడని నాకవిత్వం// నా కవిత్వం - అమాయకపుది, పల్లెటూరిది కొత్తదనం , డాబు,దర్పం తెలియనిది అధునికత అంటగడదామని- ముతక పంచ ముల్లు కర్రపడేయేంచి క్రాఫుదువ్వి ప్యాంటు చొక్కా తొడిగాను అయినా పెదవి విరిచారు కొత్తదనం లేదని - కవితే కాదని వాదించారు అప్పుడే- ఆస్పష్ట అనుభూతి కలిగిస్తూ పాత మాటల్నికొత్తగా చెబుదామని నా గుండె గుడికి దారం కట్టి నీ కనుల గేటుకి వేలాడదిశానన్నాను, ప్రేమకోసం నీ పెదవులు కత్తిరించి నా వీపుకి అతికించు కొన్నాను అన్నాను నీ కోసం నా శరీరం ఫ్లాస్కులో పోసినవేడి నీళ్ళలా కుత కుత మంటోంది అన్నాను. ఇలా ఇన్ని మార్పులు జరిగాక నా కవిత్వం ఆధునిక మైయింది పొగడ్తల సముద్రంలో ఈదులాడతూ నాతో మాట్లాడం మానేసింది

by Renuka Ayola



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bWyDQl

Posted by Katta

Patwardhan Mv కవిత

అంతర్జాల కవిత్వం రెండవ శ్రేణికి చెందిందా??? నేను పెద్ద సిధ్ధ్దాంత చర్చలను చేసేంత స్థాయిలో లేను కానీ మిత్రులారా తోచింది మీతో పంచుకుంటున్నాను.ఈ అంతర్జాల కవులూ అంటూ-- మనను ఒక ప్రత్యేక తెగగా గుర్తించడం /////వివక్షించడం మీకు నచ్చుతుందా?నాకైతే లేదు. 01)మామూలు కవులకూ-మనకూ ఏమైనా తేడా ఉందా?? పదే,పదే కొందరు ఈ అంతర్జాల కవులు అంటూ ప్రస్తావించినప్పుడు ఇదే అనిపిస్తున్నది. 02) కేవల ముఖ పుస్తకాన్ని వాడుకోవడం తప్ప మామూలు కవిత్వానికీ--మన కవిత్వానికీ ఏమైనా ఏమైనా తేడా ఉందా? 3) నాలుగు ఆంగ్ల పదాలూ,నాలుగు బూతు మాటలు రాయడం -- ఏం కేవలం అంతర్జాల కవిత్వానికీ మాత్రమే సొంతమా??? నిజానికీ మన కవిత్వానికీ ఇవి ఎంత వరకూ పోషకాలుగా ఉంటున్నాయి? నాకు పిండీకృతార్థంగా అర్థమైంది ఏమంటే "స్వీయ నియంత్రణ లేదు అంతర్జాల కవిత్వానికి"" అన్న కారణంగా కొందరు దీన్ని తక్కువ చూపే ప్రయత్నం చేస్తున్నారు.ఈనాటి కవి పొందుతున్న స్వేచ్ఛ వారిని నివ్వెర పరుస్తున్నది. మనమూ మరింత బాధ్యతాయుతంగా రాయాల్సి ఉంది. మరి మీరు ఏమంటారు? నేను చెప్పింది సక్రంగా ఉందా?లేదా?దయచేసి చెప్పండి. కోపం వస్తే మరీ సంతోషం. 02-03-2014,మంచిర్యాల్.

by Patwardhan Mv



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bWyDzO

Posted by Katta

Ramakrishna Kalvakunta కవిత

కవిత్వమూ -నేనూ నేను నేనే,నువ్వు -నువ్వే కవిత్వము నన్ను ఆవహించాక నువ్వే నేనై ప్రవహిస్తూ ఏకాంతంలో సమూహామై గెలుపోటములకతీతంగా .... నవ్వుతూ చేస్తున్న యుద్ధాలు మొగ్గ పువ్వై విచ్చుకోవడం ,మనసై పరిమళించడం ఓర్వ లేని కాలం గాయాల్ని చేస్తున్నా దుఃఖ సముద్రాల్ని క్షణంలో దాటే సాహసీ !జీవితం కవిత్వం తోడుంటే కడలి కెరటాలోక లెక్కనా ! అలజడుల పరీక్షల్ని ఆర్ద్రత తో దాటేద్దాం కాసే చెట్టుకే కదా రాళ్ళ దెబ్బలు వెలుగుతోటే కదా చీకటి వెన్నంటి ఉండేది చితిని చేరే లోపు ఎన్ని మైలు రాళ్ళు దాటాలో గుండెని ఊండగా చుట్టి పిండే సుఖ దుఃఖ వలయాల దృశ్యాలు .. గతి తప్పిన చిరుగుల్ని అతికిస్తూ ఊహాకూ వాస్తవానికి మధ్య ఊగిసలాటే కదా జీవితం ఒక అజ్నాతనేస్తం జ్నాపకం భుజం తడుతుంది చందమామ చుట్టూరా మబ్బుల తెరలు పున్నమి వెలుగుల్ని ఆపగలవా ఎన్ని బహిరంగ యుద్ధాల్ని జయించానో -నన్ను నేనింకా గెలవనే లేదు నింగి రాలిన నెల చినుకు నేలను తడపక మానదు మట్టిన మోలాకెత్తిన చిగురు వృక్షమై పెరగక మానదు చినుకుల్ని దోసిట్లో ఎంత కాలమాపగలవు గుండెల్ని కొంచెం మెత్తపడనీ!,కన్నీళ్లతో తడిసి ముద్దవనీ ! మనిషన్నాక ప్రేమించకుండా ఉండగలడా ప్రణాళికలన్నీ ఒక్క చిరు నవ్వుకే కాలపు కత్తి గాట్లు కనుమరుగవడం ఖాయం అనంత ఆత్మీయత ముందు -లోహపు గుండెలైనా కరిగిపోవాలిసిందే ఎంత ప్రయాణించినా తీరం చేరాల్సిందే ! మనిషైనవాడు ఎన్నటికైనా ప్రేమించాల్సిందే ! _డా .కలువకుంట రామకృష్ణ

by Ramakrishna Kalvakunta



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fzajoE

Posted by Katta

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి ఆశ్రమంలో ఆ గొంతు ఉపన్యసిస్తుంటే నా ఊపిరే సంగీతమై నా అణువుల్ని ఛేదిస్తూ నాలోకి ప్రవహిస్తుంటే నేను నాలోంచి నిష్క్రమిస్తూ.... నన్ను నేను త్యజించుకుంటుంటే నా హృదయం తేలికైపోయినట్టు ఆకాశం నన్ను తడుముతున్నట్టు స్వర్గం నన్ను హత్తుకుంటున్నట్టు నా జీవితం వెలిగిపోతున్నట్టు ఒక అర్ధం కాని అనుభూతి! నేను ఆ మైకంలో మునిగి తేలుతున్నప్పుడు నేను నా ప్రపంచం బయట మరో ప్రపంచంలో కళ్ళు తెరుస్తున్నప్పుడు నన్ను ఆకర్షించిన శక్తి నన్ను ఆక్రమిస్తున్నప్పుడు ఒక తెలియని పరవశం! ఆ ఆధ్యాత్మిక ధ్రవ్యాల మైకానికి నేనిప్పుడొక బానిసని కన్నీళ్ళు ఆవిరైపోతూ ఉంటే మొహం మీద కృత్రిమంగా పుట్టుకొస్తున్న నవ్వుని. ఆ గంజాయి తోటలో మరణించడానికి మళ్ళీ మళ్ళీ వికసిస్తున్న పువ్వుని. 28FEB2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eO88aT

Posted by Katta

Krishna Mani కవిత

అహంకారధికారమ్ ******************** అంతానికి అహంకారం ఆదిబిందువు తెలిసి మసలరా నేర్పుగా ! దొడ్డి దారిన వచ్చి దొంగాటలాడితిరి తిన్నదేమో అరగక పొట్ట బలిసి ఉరిమితిరి ఉన్నదంతా మాది ఉన్నదేంది మీది ? అని ఒండ్రుకప్పలమోత రొక్క మూటల చెంత అడుగు జరుగు యాల ఇంకేంది అధికారం ! అడ్డగోలు గెంట్లు ఇంకెన్ని పెడతరు గీత దగ్గరుంది పడుతదాగు దిక్కారం పొతదింక గ్రహచారం కునుకు పోయి గుండె జారి కలలు చెదిరి కలత చెంది కన్నబిడ్డల బతుకు కోసం గతమునొచ్చి పిడికిలెత్తి బండగొడితే ఎట్ల పగలదు నిండు రెండుగా ? కృష్ణ మణి I 02-03-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NHZk02

Posted by Katta

R K Chowdary Jasti కవిత

శ్రీనివాస్ వాసుదేవ్ ఆకుపాటపై నిన్న సాయంత్రం ఒక అందమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో హైదరాబాద్ లోని Golden Threshold లో శ్రీనివాస్ వాసుదేవ్ గారి “ఆకుపాట” కవితా సంపుటి ఆవిష్కరణ జరిగింది. ఆ కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నందుకు నాకు సంతోషం గా ఉంది. Kavi Yakoob గారు ఒక ఆకాశహస్తమై కవులను ఒక చోట సమావేశపరచి కవిత్వాన్ని ముందుకు తీసుకుపోవడంలో పోషిస్తున్న ఆతని పాత్ర ఎంతో ముదావహం. ఈ ఆవిష్కరణలో పాల్గొన్న అరుణ్ సాగర్ గారు, కవి యకూబ్ గారు, హెచ్చర్కే గారు, నారాయణశర్మ గారు ఆకుపాటపై తమ తమ స్పందనల్ని అత్యద్బుతంగా వివరించారు. చివరగా కవి శ్రీనివాస్ వాసుదేవ్ మాట్లాడుతూ ఆకుపాట నేపద్యాన్ని క్లుప్తంగా చక్కగా తెలియచేశారు. నేనింకా పుస్తకాన్ని చదవలేదు. నిన్న సభకి అధ్యక్షత వహించిన వారు పుస్తకంలోని కొన్ని కవితల గురించి తమ స్పందనలని తెలియచేస్తుంటే అది తప్పకుండా అద్బుతమైన కవితల సంకలనమని చదవకుండానే తెలిసింది. అయితే పుస్తకాన్ని పూర్తిగా చదివిన తర్వాత మరో సారి నా స్పందనల్ని తెలియచేయగలను.. ఆకుపాట ముందు అక్కడ వర్షం కురిసి ఆకుపాటని, శ్రీనివాస్ వాసుదేవ్ ని, మా అందరి కవుల్ని, ఇతర మిత్రుల్ని స్వాగతిస్తూ ఆవిష్కరణ ముగిసే వరకూ తను ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా ఆకుపాటని వింటూ మౌనంగా ఉండిపోయింది. విచిత్రం కదూ. ఈ సందర్భంగా శ్రీనివాస్ వాసుదేవ్ గారిని అబినందిస్తూ ఆకుపాట మంచి ఆదరణకి నోచుకోవాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నాను. ఇటువంటి కావ్యావిష్కరణలు మరెన్నో జరగాలని కవిత్వం కోసం ఎంతో విలువైన సమయాన్ని వెచ్చిస్తూ కవిత్వాన్ని ఒక దైనందికవిషయంగా స్థిరపరచాలని ఒక మంచి సంకల్పంతో ఎంతో కృషి చేస్తున్న కవి యకూబ్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ...... - జాస్తి రామకృష్ణ చౌదరి

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pMZxhF

Posted by Katta

Sriramoju Haragopal కవిత

పాట మునుం నువ్వెందుకు వానలెక్క వొచ్చిపోతవు ఈ చలికాలం కొసల ఎండిన ఆశల పండుటాకులు కన్నీటి గాలిచెమ్మకు తడై బరువెక్కిన గుండెలు వెక్కి వెక్కి రాలిపోతున్నయి ముందుగ ఎరుకజేస్తె నీదేం బోయేదుండె పొక్కిలైన ఇల్లు,వాకిలి నవ్వులతొ అలికివుందునుగద మామిడిపూలవాసనల్నిదాచివుంచుదు, గోగుపూల దండలు దోర్నాలు కడుదు నిమిషమన్న నిలిచివుంటె బాగుండు నువ్వు రెప్పలద్దుకుని ముఖమన్న చూసుందును పాలగోకులెక్క యాదిలెన్నొస్తయి కొండవాగు తీర్గ మనసెంత పొర్లిపారుతది అరుగుమీద ఉలికిపాటు నిద్రలో కలవరింతలు నీ కడియాలు కైగట్టి పిలుస్తె ఎట్ల మల్ల కనపడవు, రమ్మనవు 01.03.14

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pMZuSZ

Posted by Katta

Sravanthi Itharaju కవిత

సౌగంధిక జాజరలు" స్రవంతి ఐతరాజు" " మల్లికా ఓ మల్లికా" మల్లికా..ఓ మల్లికా.. మూగబోయావా..మౌనమించావా.. చెదరిన వీణియలా..శృతితప్పిన రాగంలా.. మనసులేని మమతలా..మమతలేని మనువులా.. నా జడలో చేరి వూసుల రాశులు నింపడం లేదుగా.. మదిలో నా గదిలో సువాసనల పరిమళాలొకించడంలేదుగా.. ఏం ఎందుకని?నా రాజు..ఆ రేరాజు..కనిపించడంలేదనా??? లేక మా అలవాటు సరాగాలు అనురాగాలై పలకడంలేదనా??? ఔన్లే నా మనసు చెలికాడిని చూసి సిగ్గిలి నా నవ్వుల్లో దాక్కునేదానివి కంటిచూపుల్లోంచి తనపై వ్రాలేదానివి నా కురుల సింగారానివై రాణిలా గునిసేదానివి.. తన హృదిలో నా మదిలో గిలిగింతలు పెట్టేదానివి తనచేతులనుండీ త్వరపడి నా తలపై తలంబ్రాలయ్యేదానివి ఓస్! నీ మౌనం శాశ్వతమనుకోకు మా.. త్వరలోనే నా రాజు ... నీ మౌనంలో మోహనాలు పలికిస్తాడు సుమా!!!

by Sravanthi Itharaju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eNRwju

Posted by Katta

Thilak Bommaraju కవిత

My poem at vaakili... http://ift.tt/1ofCecx తిలక్ /ఇంకొన్ని జ్ఞాపకాలు ---------------------------- నేను గదిలో ఒక్కడినే కూర్చున్నప్పుడు సముద్రమంత నిశబ్దం అలుముకుంది నా చుట్టూ నేనెక్కడొ అగాధంలో పడిపోతున్నట్టుగా కొన్ని ఆలోచనా సరళ రేఖలు నా ఖగోళంలో గీసుకుని వాటి మీద నడుస్తున్నప్పుడు దూదిమేడలా నేను కూలిపోతున్నపుడు నాకు ఆసరా ఇస్తూ ఇంకొన్ని జ్ఞాపకాలు ప్రహరీలా నిర్మించినపుడు వాటి కింద ఏనాడో శిధిలమైపోయిన కొన్ని పిచ్చుకగూళ్ళు అందులో నేనో మూల నన్ను నేను తడుముకుంటున్నపుడు ఏమితోచక తోకచుక్కలా రాలుతున్న నా కన్నీళ్ళు కొన్ని అక్కడక్కడా నీటిచెమ్మలుగా నిద్రాణమైపోతుంటాయి నువ్వొచ్చేసరికికి నేను కరుగుతూ నిన్ను కూడబెట్టడానికి ప్రయత్నిస్తుంటాను నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా... తిలక్ బొమ్మరాజు 19.02.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ofCecx

Posted by Katta

చెన్నాప్రగడ వీఎన్నెస్ శర్మ కవిత

విరహమూ సుఖమే_ఇష్టసఖుడు అరుదెంచేవేళ ..@శర్మ \2.3.14\

by చెన్నాప్రగడ వీఎన్నెస్ శర్మ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pMz2ZG

Posted by Katta

Sky Baaba కవిత

నిద్ర పట్టని ఈ రాత్రిని ఎవరితో పంచుకోను ? ప్రేయసి గాఢ నిద్రలో ఉంది !

by Sky Baaba



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eDpOdS

Posted by Katta

Katta Srinivas కవిత

ఆకుపాట ఆవిష్కరణ దృశ్యాలు http://ift.tt/1eDauOj

by Katta Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eDauOj

Posted by Katta

Nauduri Murty కవిత

కవిత్వంతో ఏడడుగులు 24 . నిన్నను ఒక మిత్రుడు తను కవిత్వం రాయలేకపోతున్నందుకు ఉత్తరం రాస్తూ, ఏమి వ్రాయను? ఏది రాద్దామన్నా ఎవరో ఒకరు ఇంతకుముందే వ్రాసేరేమోనన్న అనుమానం వెంటాడుతోంది. అందుకని రాయడం మానేసి చదువుతున్నాను అని రాసేడు. ఏ రచయితకైనా చదవడం చాలా ముఖ్యం... కవికి మరీను. అయితే, శ్రీశ్రీ చెప్పినట్టు "మనం చెప్పింది ఇంతకుముందు ఎవడో చెప్పే ఉంటాడు, ఆ చెప్పింది మనకంటే బాగా చెప్పి ఉంటాడు" అని అనుకుని రాయకపోవడం వల్ల కవి సృజనాత్మకతకి భంగం వస్తుంది. ఆ మాటకి వస్తే, ఏ ప్రపంచ సాహిత్యంలోనైనా కొన్ని వందల ఏళ్ళ సాహిత్య చరిత్రచూస్తే రాసిన వస్తువుమీదే ప్రతి తరంలోనూ కవులు రాస్తున్నారు. అయినా పాతతరాలకంటే మంచికవిత్వం కొత్తతరంలో వస్తూనే ఉంది. కారణం వస్తువు కొత్తదని కాదు, చెప్పే విధానం కొత్తది. అందిస్తున్న పాఠకుడు కొత్తవాడు; ఉపయోగిస్తున్న ప్రతీకలు వాటి సమకాలీనతవల్ల పాఠకుడి అనుభూతిపరిధిలోనివి... అందుకు. అదే పాత ఉపమానాలూ, పదబంధాలూ ఉపయోగిస్తే పాఠకుడు తప్పకుండా కవికి తలుపులు మూసెస్తాడు. ఇక్కడ ఒక చిన్న రహస్యం కూడా ఉంది. ప్రతికళాకారుడికీ ప్రవృత్తితోపాటు ఒక వృత్తి ఉంటుంది. అది అతని ప్రత్యేకత. ఆ వృత్తిపరిధిలోని విషయాలనూ, అనుభూతులనూ అతను "ప్రత్యేకతనుండి సార్వజనీనతకి ("from specific to Universal") తీసుకెళ్ళగల ప్రతిభావంతుడైతే, అతను ఖచ్చితంగా విజయం సాధిస్తాడు. రావిశాస్త్రి కథకుడుగా రాణించడానికి అతని వృత్తిలోని అనుభవాలను అతను సార్వజనీనికం చెయ్యగలగిన సమర్థతే. ఈ చిన్న కవితకూడా ఆ కోవలోకే వస్తుంది. ప్రకృతిలోని Macro cosm , Macro Cosm ఈ రెండింటిలో ఎంత సామ్యం ఉందో ఒక శాస్త్రజ్ఞుడు ఎంత అందంగా చెప్పాడో పరికించండి. మైక్రోస్కోప్ లో ... . ఇక్కడకూడా మతిపోగొట్టే సుందర దృశ్యాలూ, చంద్రోపరితలాలూ, నీరవ ప్రదేశాలూ ఉన్నాయి. ఇక్కడకూడా జీవకణాలూ, సేద్యగాళ్ళూ, తమజీవితాన్ని తృణప్రాయంగా త్యజించగల యోధులైన కణాలూ ఉన్నాయి. ఇక్కడకూడా సమాధులూ, కీర్తిప్రతిష్టలూ, గుర్తింపులేకపోడాలూ ఉన్నాయి. వ్యవస్థలమీద తిరుగుబాటు గూర్చి నేను గొణుగుడు వింటున్నాను . మిరొస్లావ్ హోబ్, చెక్ కవి, వ్యాధినిరోధశాస్త్రజ్ఞుడు (13 September 1923 – 14 July 1998) . In the Microscope . Here too are the dreaming landscapes, lunar, derelict. Here too are the masses, tillers of the soil. And cells, fighters who lay down their lives for a song. Here too are cemeteries, fame and snow. And I hear the murmuring, the revolt of immense estates. . Miroslav Holub (13 September 1923 – 14 July 1998) Holub is one of the foremost Czech poets of the 20th century (and of Europe) and a reputed Immunologist. He has 10 volumes of poetry to his credit. His poems frequently deal with the grim realities of life and are written with scientific exactitude. He is widely translated (into more than 30 languages).

by Nauduri Murty



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mT4LpH

Posted by Katta

Sri Urfriend కవిత



by Sri Urfriend



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bVzqB8

Posted by Katta