.....॥ ఇరు పార్శ్వాలం ॥..... చీకటి నుండి చీకటి కి నా ప్రయాణం వెలుతురు ధారగా ప్రవహించడం నీ నైజం మనం రేపవళ్లం ! అనుదిన అనివార్య దిన పార్శ్వాలం ! శైవల మౌన శిలల మీద నా నడక ఎగసిపడే ఏటి పాట నీ నడత . నేను అసహన అగ్ని గోళమై బద్దలౌతుంటాను నీవు నిర్లక్ష్య తుహిన తుషారంలో తడుస్తుంటావు . నేను అసంబద్ధ జడధారిని ! నీవు అతివ్యాప్త చైతన్య ధునివి ! మృత్యువుకు మృత్యువుకు మధ్య సాగే మన దైనందిన జీవనయానంలో ఇరువురం ఇరుసంజల ఇరుకు దారులం నీవూ నేనూ ప్రతినిత్యం అంతుపట్టని జీవన మరణాలం ! Dt:23.05.2014
by Ramaswamy Nagaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k1CLMc
Posted by Katta
by Ramaswamy Nagaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k1CLMc
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి