పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

28, ఏప్రిల్ 2014, సోమవారం

Sri Venkatesh కవిత

**శూన్యం** ఆశని ఆర్పేస్తున్న పవనం నడుమొంగిన యవ్వనం మెదడుకి పడిన బెజ్జం చేతి రాత చేస్తున్న నాట్యం ప్రయత్నం పళ్ళు బిగించి చూస్తున్న చోద్యం చచ్చుబడిపోయిన అవయవం చతికిలబడిన ఆశయం ముళ్ళు మోసుకొచ్చిన వసంతం ఆకలిని అవహేళన చేస్తున్న ఆహరం జయాన్ని శాశిస్తున్న అపజయపు విజయం వాంఛలపై నీరుగారిపోతున్న వ్యామోహం ప్రకాశాన్ని స్పృశించలేకపోతున్న స్పర్శ భయం పరలోకపు కాగడలో ఇముడుతున్న ఇహం ఆత్మను అమ్మేసుకుంటున్న పిచ్చి దేహం మన:స్సాక్షి మానభంగంలో మనసుదే సింహ భాగం కష్టానికి తూకమివ్వనంటున్న అదృష్టపు అంగడి అహంకారం అన్ని వెరసి నలుపునే కంటికి చూపిస్తున్న త్రోవ "శూన్యం"!!!! శ్రీ వెంకటేష్ తేది : 28/04/2014

by Sri Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mPROgr

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి