సామీప్యత-సారూప్యత ------------------------------ ఆశల అంచున నిల్చుని వెక్కిరించే.. అందని స్వప్నం! కాసులు అందక నలిగిన గుండె .. చిందించిన రక్తం !! ఒకటి. .ప్రేమను ప్రేరేపించే అందాల అరుంధతీ నక్షత్రం ! ఇంకోటి. .పేగులు కబళించే ఆకలిమంటల నగ్నత్వం!! కఠిన హృదయాన్ని కాంక్షించే కన్నుల్లో.. మొదటిది ! కటిక దరిద్రుని సిరా ధమనుల్లో .. రెండోది!! ప్రేమను గుర్తించలేని .. నిశ్చల శిల వెంట స్వాప్నికుడు! శ్రమ విలువ వెతుక్కుంటూ .. ప్రశ్నల దారి వెంట కార్మికుడు! ! -రాము 29-4-14
by Ramakanth Vengala
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/S2i11a
Posted by Katta
by Ramakanth Vengala
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/S2i11a
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి