ఎవలైతేంది ..... !!- ---------అన్నవరం దేవేందర్ ఆయన ఎవలైతేంది వూరు పక్కన గుట్టలన్నీ గులాబీ జాం లా గుటుక్కు మని మింగడు గదా ! జర జల్లెడ పట్టి సూడు ఆయన ఎవలైతేంది వూరు సుట్టు వాగులల్ల ఇసుకనంతా దేవుకొని పుట్న్నల్లెక్క బుక్కడు గదా ! జర మెరిగాల్లెక్క ఏరు ఆయన ఎవలైతేంది అడవి లోని కలప సంపదనంతా కర కర మింగడు గదా ! జర జాలి ల వడబోయి ఆయన ఎవలైతేంది భూముల్లోని ఖనిజాలను గంప గుత్త పట్టి పండ్లోలె అమ్ముకోడు గదా ! జర పశనతు పట్టు ఆయన ఎవలైతేంది నీ సుట్టు ముట్టు జాగలన్నీ కంపినీలకు కట్టబెట్ట లఫంగి కాడు గదా ! జర వస్త్రగాలం పట్టు ఆయన ఎవలైతేంది వోట్లన్నీ గంప గుత్తగ కమాయించుకొని నెత్తిన కూసోడు గదా ! జర తేజాబుల కడుగు అప్పుడు సోక్కం తెలుస్తది ... --
by Annavaram Devender
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lmsEq3
Posted by Katta
by Annavaram Devender
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lmsEq3
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి