సురెక || తెలుగు గజల్-13 .. హళదిచంద్రాలు కురుస్తుంటే తెలిసిందిలే అది మేకము బలిఆసమని పాదచారులను కఱుస్తుంటే తెలిసిందిలే అది శ్వానము పొలిసీసమని. .. కన్నవాళ్ళను కలవాలని పుట్టింటికి సతిపోతే విభునికి తెలిసిందిలే అది వెన్నెల చలిమాసమని. .. అత్తింటిలో చేతికిచ్చిన లవణలడ్డు తినిచూస్తే బావయ్యకు తెలిసిందిలే అది సాలిక మెలిహాసమని. .. చేతికొచ్చిన పెళ్ళిపిలుపు ఒకసారి చూసుకుంటే ప్రియునికి తెలిసిందిలే అది నెచ్చెలి తొలిమోసమని. .. తనుచేసిన కనుసైగకు స్పందనేమి రాకపోతే సఖునికి తెలిసిందిలే అది నచ్చని చెలికోసమని. .. మీదపడిన బొద్దింకతొ ఎగురుతూ అరుస్తుంటే ప్రభువుకు తెలిసిందిలే అది శాలిని గిలిలాసమని. .. మల్లెపూవులు మరచిపోయి మత్తులోన ఇంటికెళ్తే మగనికి తెలిసిందిలే అది కౌగిలి వెలివాసమని. .. (తెలుగు గజల్-13 * 11/06/2014 )
by Yessaar Katta
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hHuCT0
Posted by Katta
by Yessaar Katta
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hHuCT0
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి