లఘు కవితలు: (ఇవి రెండేళ్ళ క్రితం రాసిన లఘు కవితలలో కొన్ని. 'పాలపిట్ట' ఏప్రిల్ ప్రత్యేక సంచిక నుండి ) ....॥ రిక్కలు ॥.... మిణుగురులు రెక్కల రిక్కలు ఎగిరే రవ్వలు ఎక్కడో తారా విస్ఫోటనం రాత్రి చీకట్లలో రాలి పడుతున్నది నక్షత్ర ధూళి . ఒక ఉదయాన్ని బహూకరించాలని ఆరాట పడుతున్న చంద్రుని తొందర రాత్రి గడచినా చీకటి వీడని పడమర ఇంకా బాధ్ధకంగానే ఆవులిస్తున్నది ప్రాగ్దిశ. తమస్సు కమ్మిన తమిస్రను తట్టి లేపింది వేకువ హస్తం కళ్లు తెరచిన కాలం ఒళ్లు మరచింది ఉషస్సు తెచ్చిన కానుక ఉదయరాగం . సెలయేటి పాటలకు సలిల సంగీతం సమకూర్చినవి రాళ్లు నీటి అడుసులో దిగబడ్డవి పాపం వాటి కాళ్లు . మనసు మల్లె మొగ్గలను విచ్చుకున్నట్టు నింగి శరశ్చంద్రున్ని హత్తుకున్నట్టు రేయి రేయంతా పరిమళం చీకటి కొమ్మ సిగబంతి హృదయం.
by Ramaswamy Nagaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lbsOB6
Posted by Katta
by Ramaswamy Nagaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lbsOB6
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి