పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, జూన్ 2014, బుధవారం

ఎం.నారాయణ శర్మ కవిత

నిశీధి -" కల "త ______________________________ స్వప్నాలకీ సాహిత్యానికి సంబంధం ఉందా..అంటే"త్రికరణాలలో స్వప్నం మనసుకి రూపమయితే,కవిత్వం వాచ్యభాగానిది"అన్నాడో పెద్దాయన.కలల్ని కవిత్వంగా, కావ్యంగాచెక్కడం అన్ని భాషల్లో కనిపించేదే.తెలుగులో కూడా..రాచమల్లు భైరవకొండారెడ్డి-"స్వప్న శీతాచలం",జాషువా-స్వప్న కథ,విశ్వనాథవారి-"సముద్రగుప్తునిస్వప్నం",సినారె-"స్వప్నభంగం"అజంతా "స్వప్నలిపి,"మలయశ్రీ"స్వప్నం",మిరియాల రామకృష్ణ"సువర్ణ స్వప్నం",సుమనశ్రీ "మహాస్వప్నం"-ఇలా లెక్కబెడితే అనేకంగా కనిపిస్తాయి.ఇక పురాణాల్లోని ఘట్టాలు,వచనకవిత్వంలోని ఖండికలు కూడా అనేకంగా కనిపిస్తాయి. ప్రాచీన కాలం నుంచే స్వప్నాలు కావ్యాలలో దర్శనమిస్తున్నా..వీటిచర్చ ఫ్రాయిడ్ కి ఈవలే ఎక్కువ.ఫ్రాయిడ్ మనోవైఙ్ఞానికశాస్త్రం ఆతరువాత అతనివిశ్లేషణలు.స్వప్నాలగురించి చాలకొత్త విషయాలను ఆవిష్కరించాయి.తానే స్వయంగా"స్వప్నార్థ వివరణ"(Interpretation to dreems)రాసాడు.ఇందులో అనేక స్థాయిల్లో విశ్లేషణలున్నాయి.అతని అనుయాయుల్లోకూడ కలలను విశ్లేషించిన వాళ్లున్నారు C.Hall-The Meaning Of Dreems అనే పుస్తకాన్ని రాసాడు..తెలుగు విషయానికొస్తే "అన్నపురెడ్డి వెంకటేశ్వరరెడ్డి"-స్వప్న సందేశం ప్రసిద్ధ గ్రంథం. నీశీథి తానుకోరుకునే కోరికనే "కల"నిచేసి కవితనందించారు.కలలు కోరికలవల్ల వస్తాయని విఙ్ఞాన వేత్తల వివరణ.ఫ్రాయిడ్ కలని గురించి వివరిస్తూ దాన్ని"ఇష్టావాప్తి""ఈప్సితార్థసిద్ధి""వాంఛాపూరణం"అని అన్నాడు..ఈమూడింటిలోనూ కోరిక అనేఅంశం బలంగా కనిపిస్తుంది.అచేతనమయిన దాంత స్మృతులు,అణచివేయబడున ఙ్ఞాపకాలు పై కోరికని కలిగిస్తాయన్నది ఆయన వివరణ.చరకుడు కూడా తనగ్రంథంలో ఇలాంటి వివరణే ఇచ్చాడని పూర్వులభావన. ఈకవితలో ఇలాంటి బాధావిముక్తిని అన్వేషించే కల కనిపిస్తుంది.ఈ వాక్యాలన్నిటినీ గమనిస్తే మొదటిది తనకు తాను ఆశిస్తున్నట్టుగా వాంఛనిప్రకటిస్తుంది.రెండవ వాక్యం నించి సంభాషణలా ఉంటూ తన స్థితిని ఆశని చెబుతుంది. "ఎండి డస్సిపోయిన భూమి పై పొడి జల్లుల ఓదార్పులా అలసిన కళ్ళ ని కొన్ని మృదువయిన కలలు తడిమితే బాగుండు కలవరం లేని సవ్వడితో కల వరమై కళ్ళని జో కొడితే ఇంకా బాగుండు" ఇది కలనే వాంఛగా వ్యక్తం చేసిన వాక్యం..ఈ సందర్భంలోనే భౌతికంగా స్వప్నాలకు క్షేత్రావస్థగా ఉండే నిద్రని ఆహ్వానించడం కనిపిస్తుంది. "జీవితాంతం తోడు ఉండమన్నట్టు నిద్రకెందుకో అంత బెట్టు కొన్ని ..చాల కొన్ని క్షణాల ప్రేమను అలా ఒక్కసారి గుమ్మరించి పోవొచ్చుగా ప్రపంచాన్ని రాసియ్యమన్నానా ..ఏదో రెప్పల మీద మృదువుగా ఒక సంతకమేగా అడిగాను పెద్ద కోరికలేమి కోరాను ...మార్దవంగా చిన్నగా లాలిపాట తో జోకొట్టమనేగా" ఇలాంటి నాటకీయ శైలిగల వాక్యాల్లో కొన్నిసార్లు అణచివేయబడ్డ కోరికలు,దానికి కారణమైన పగలు వీటన్నిటిమాట్లాడటం కనిపిస్తుంది. ఉదయపు నిసృహ / జ్వరపు పగళ్ళ నుండి/జీవితపు ప్రవాహంలో తల్లడిల్లే మనసు పడవ...ఇవన్నీ దాంతభాగాన్ని స్పర్శిస్తాయి. ఇందులోని వాక్యాలని భాషాశాస్త్ర పద్ధతిలో చూసినప్పుడు కొన్ని మానసిక సంబంధమైన పదబంధాలు కనిపిస్తాయి..అనేక వాక్యాలలో ఒక శైశవ స్వభావం ఉంది."కలవరం-కల వరం"లాంటి సాహిత్య సంబంధమైన శబ్ద లౌల్యమూ కనిపిస్తుంది.చాలామంచికవిత అందించిన నిశీథిగారికి ధన్యవాదాలు.

by ఎం.నారాయణ శర్మ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1uYrYur

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి