పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, జూన్ 2014, బుధవారం

Avvari Nagaraju కవిత

||వెన్నల పాపడు||ఎ.నాగరాజు ఆకాశంలో వెన్నెల కింద పాపడు తన నీడతో తాను ఆడుతున్నాడు రాగిరంగు జుట్టు కదలుతూ గాలితో మేఘాల నవతల తోస్తోంది ఏ ఆచ్చాదనా లేని వాడి నల్లని దేహం నెమరి ఈ రాత్రిని స్వాంత పరుస్తోంది పగలంతా ఎండ కింద కాగిన నేల తప్పటడుగుల పాదాల వీవెనలతో చల్లగా నిదురకు సిద్ధమవుతోంది కేరింతలతో ఆడి ఆడి అలసినా పాపడు అమ్మ పక్కకు చేరి ఆయి తాగుతున్నాడు ఆనుకుని పడుకునే వొంటితో వాడు ఆకాశ విల్లు పాలు కారిన పెదాలపై చంద్రుడికి ఇక నుంచి పవళింపు వేళ 11-06-2014

by Avvari Nagaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hJ7F1u

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి