పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, జూన్ 2014, బుధవారం

Sai Padma కవిత

సాయి పద్మ // ఈసుళ్ళు వానరాకముందే ముసురుకునేవి ఆలోచనలే కాదు , ఈసుళ్ళు కూడా ఏదీ తెలీని ముగ్ధ మోహనాంగి లా ..ప్రియుని స్పర్శతో, ప్రౌఢత్వాన్ని తెచ్చుకొనే, పడతిలా , కొంచం భయపడుతూ, వెలుగు నీడలా అమరికలో అలవోకలో , వెలుగుని కావలించుకొని ఆత్మాహుతి చేసుకొనే పిల్ల ఈసుళ్ళు కాస్త వ్యవధి ఇస్తే, కొంచం సమయం ఇస్తే నిరాశని నిండారా దుప్పటి కప్పుకొని నిద్రపోయే మనుషులకి , ఈసుళ్ళ సోదలూ వ్యధలూ ఎందుకనేమో .. నిమిషంలో వూడ్చి పారేస్తారు వరండా నిండా ఈసుళ్ళు .. యిట్టె వచ్చి అట్టే మరణించే మన ఊహల మేడల్లా కోరికల, ఆశల , నిరాశల ఈసుళ్ళ ని ఊడ్చే చీపుళ్ళు ఉంటె బాగుణ్ణు ..!! -సాయి పద్మ

by Sai Padma



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pEHrO0

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి