ప్రతి చెట్టు నన్ను చూసి నవ్వుతున్నట్టే ఉంటుంది కొమ్మల చేతులు చాపి రా రా రమ్మని పిలుస్తున్నట్టే అనిపిస్తుంది దగ్గరకెళతానా.. పచ్చ పచ్చగా నవ్వుతూ నా కోసం రంగు రంగుల పువ్వుల్ని పరుస్తుంది ఒక రో నేలంతా పొగడ పూలను చిమ్ముతుంది మరో రోజు ఆకాశ మల్లెల్ని రాలుస్తుంది నాకు గుచ్చుకోకుండా మొగలి పొత్తుల్ని వేలాడ దీస్తుంది నా చుట్టూ సంపెంగలు,సన్నజాజులు,మల్లెమొగ్గలు పరిచి గల గలగా నవ్వుతుంది తలెత్తి చెట్టు పైకి ప్రేమగా చూస్తానా పువ్వులకి తోడుగా రంగు రంగుల పిట్టలు చెట్టు మీద కూర్చుని కంఠం సవరించుకుంటూ కమ్మటి పాటల కచేరి పెడతాయి కుహూ అంటూ కోయిల.. కిలకిలమంటూ చిలకలు ఎన్నిన్ని పిట్టలు ఎన్నెన్ని రాగాలు ఏక్తార వాయించే తోకపొడుగు పిట్ట టీ టీ అంటూ టీ కావాలని అరిచే నల్లపిట్ట తీక్షణం గా చూస్తూ కళ్ళని నేలకతికంచే గద్ద ఆకుపచ్చ చెట్టు మీద ఎంచక్కా కూర్చుని సంగీత కచ్చేరి చేస్తూ ఉంటాయి చెట్టు కింద నేను.. చెట్టుని పెనవేసుకుని చెట్టుని ప్రేమిస్తూ చెట్టునిఆరాధిస్తూ చిత్తరువులా...చిద్విలాసంగా....
by సత్యవతి కొండవీటి
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1uUQwET
Posted by Katta
by సత్యవతి కొండవీటి
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1uUQwET
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి