అరవిందరాయుడు *************** వి ల యం ********* ఓ బాధ్యత ఆదమరచి జాగరూకతకు నీళ్ళొదిలినపుడు ఓ నిర్లక్ష్యం విధినిర్వహించినపుడు ఓ నిర్లిప్తత కాలాన్నే శాసించినపుడు జరిగిన పెనుభీభత్సఫలమే ఈమహావిషాధం ఓ జలసైన్యమా నీవద్దకు చేరినది నీ ఆగర్భ శత్రువులు కాదే! ఓసలిలమయ స్మశానవాటికా! నీ మ్రోలనిలిచినది కాలంచెల్లినవారు కాదే! మరెందుకు నీ ప్రళయవిన్యాసం నీవుకేవలపయోరాశివి మాత్రమేకాదు కరుణ ఇసుమంతయినా లేని నిష్ఠుర ఎడారివి ఇంతదనుక నీఒడిలో కేరింతల హారాలతో అనుభూతు నైవేద్యం కొరకు ఆత్మీయ సందడులు చేసినది వేరెవరో కాదు మేథోజగత్తుసారథులు నీ సౌందర్యోపాసకులు ప్రతిగా నీవుచేసినదేమిటి? విశ్వాసఘాతుకం కాదూ నీ మృదువైన నీటిగుండె కొండరాళ్ళ పరిష్వంగంలో బండబారినదికదా నీ అమృతమయ తరంగాలు అమాయకుల పాలిట మృత్యుకుహరాలాయెకదా! ఆఖరుక్షణాల్లో చేయిచేయికలిపి నీకెదురుగా నిలిచి వారు తమహృదయాలను పరచినపుడూ నీ రాతిహృదయాన్ని తమకౌగిట్లోపొదవుకుంటూ రక్షణభారాన్ని నీపైమోపినపుడూ తృణీకరిస్తూ నీమొరటు కెరటాలతో వారిని అగాధంలోకి ఎంతతేలికగా విసిరేశావు? నీకూ మా మా'నవ'ప్రకృతిలోని వికృతి అబ్బినదిలే. ఐనా నిన్నంటే ఏం లాభం సుదూర గ్రహ గర్భజలాలను శోధిస్తూ పక్కనే పొంచిఉన్న విలయాలకు తలలువంచే మమ్ము మేము నిందించుకోవాలిగాని..... ******************** 11-6-2014 ******************(20)
by Aravinda Raidu Devineni
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l1jGA9
Posted by Katta
by Aravinda Raidu Devineni
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l1jGA9
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి