పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, జూన్ 2014, బుధవారం

Maheswari Goldy కవిత

|| హృ ద య సం కీ ర్త న || మహేశ్వరి గోల్డి మేఘరాగాల మౌన సందేశాలు చదివిన శరత్కాలపు వీచికలు ....!! ఏ మధూదయమో ఓ కలల ఉషస్సులో విరియ సంకల్పితమయి వసంత వింజామరపు గాలుల నిశ్వాస చైత్రములు తగిలి ఆగిన క్షణమొకటి మౌన శిలల మమతావేశపు లోగిలి మధురలాలనలో శ్వాసిస్తూ .....!! ఆకాశ నక్షత్ర విరులను అల్లుకుపోతూ అందంగా అలంకృతమవుతున్న భువిపై ముత్యాల ముగ్గులు ఇంద్రుని కొలువున చంద్రమతీ చకోరాల సాక్షిగా నిను కీర్తిస్తున్న ప్రత్యూష పవనాలు .....!! పడమటి కనుమల కాంతి కెరటాల నిశ్శబ్ధ ధ్వనిలో సుస్వరాలొలికిస్తూ సాహితి సుమాక్షర కలశాలతో కనువిందు చేయ జిలుగు వెలుగు తారకలయి వేల ప్రమిదలతో ........................... నీ చెలిమి అనే సమాగపు ఆనవాళ్ళను ఊహిస్తూ కలహంసల శృతిలో మౌనరాగాలు ఆలపిస్తున్నవి ఓ మనోహరా...!! 11/06/2014

by Maheswari Goldy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SxrmgP

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి