రాలిపోదాం... కొన్ని మల్లెలు లేదా గులాబులు, సంపెంగలు, సన్నజాజులు, నందివర్ధనాలు ఏవైనా గాని, అవి పూలు.. వాటికి తెలిసింది అల్లరి సుగంధాలు విరజిమ్మడం... పిల్లనగోవిలా ప్రవహిస్తున్న ప్రకృతిలో అల్లనల్లన సువాసనల కేరింతలు నీకు తెలుసా పుట్టినప్పుడు ఏడుపే అద్భుతమైన అలౌకిక రాగంతో... కన్నవారిలోను, విన్నవారిలోను తన్మయీ భావన అవి పూలే కాదు.. జలపాత సారంగీ తీగలు సుడిగాలి ఈలపాటలు ఉప్పొంగే నదీజలధారల జలతరంగిణీ ఝరులు అయినా అవి పూలే పుస్తకాల పుటల్లో మనం దాచుకున్న పూలే అక్కడి జ్ఞానాన్ని తెమ్మెదల్లా గ్రోలుతున్న పూలే.. సువాసనల కట్టడాలే... మనం చిరిగిపోయిన కనురెప్పలకు క్షణాల కుట్లు వేసుకుంటున్నాం కన్నీళ్ళను చూపుల్లో మూట కట్టేస్తున్నాం చచ్చిపోయిన మన నెత్తుటిలో పాతపంచెలు ఉతుకుతున్నాం అక్కడ జలధి కెరటాలుగా ఎగిసిపడినా అవి పూలే.. తెలుపులో ఏడురంగులుంటాయని వాటికి తెలుసు కాని నలుపును చూడలేని పూలు... నిర్లక్ష్యపు దుర్గంధం నష్టపరిహారం గేట్లు ఏత్తేస్తుందని తెలియదు గడ్డకట్టిన చెడురక్తం ఉప్పెనలా వచ్చిపడిరది అవి అమాయకపు పూలు నెమలీకల వీణా నాదాలు దుర్గంధం చీకటిలో ఆర్తనాదాల నీడలై పోయాయి ఇస్త్రీ మడతనలగని సానుభూతి అరిగిపోయిన గ్రాంఫోన్ రికార్డు తిరుగుతుంది మనం ఇక్కడ ‘‘అయ్యో..’’ల పద్దులు రాస్తున్నాం లెక్క లక్షలు కోట్లు దాటింది.. శిశుపాలుళ్ళ సంఖ్య పెరుగుతోంది నల్లనయ్య ఒక్కడూ లేడు నలుపును కడిగేవాడూ లేడు చేతులు చొక్కా జేబులయ్యాయి. కాళ్ళు పట్టెమంచం పరుపులయ్యాయి అవి పూలే ప్రకృతి వాటికిష్టం పిల్లనగోవిలా ప్రవహించే ప్రకృతిలో సప్తస్వరాలు పలికించే రంధ్రాలుగా మారిపోయాయి... మనం సువాసనలను కాపాడలేక దుర్గంధాల జెముడువనంలో చెంపలపై మురికికాల్వలుగా ప్రవహిస్తున్నాం...
by Abd Wahed
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1uSJWi6
Posted by Katta
by Abd Wahed
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1uSJWi6
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి