మోహన్ రుషి // స్మైల్ ప్లీజ్! // ఏ ఒక్కరు మాత్రమే ఎలా నిజమవుతారో ఎన్నటికీ అర్థం కాదు. ఏ సాక్ష్యాలూ సాయానికి రావు. బోధంతా చిరుదీపం వెలిగించమని. వెలుగుతున్న నవ్వులన్నీ హృదయాల్లో పుష్పించినవనీ. అల్లుకున్నవన్నీ అవ్యాజ ప్రేమలతలేననీ. లేదా అలా అనుకొమ్మనీ. నువు అందినదాని గురించి రాస్తావు. నేను అందనిదాన్ని మోస్తాను. అదేపనిగా తలపోస్తాను. ప్రపంచం పేను బెత్తాల్తో బయల్దేర్తుంది. అందమైన లోకమనీ, రంగురంగులుంటాయనీ. చెప్పినా వినని పాపానికి నా మానాన నన్నొదిలేసి. మొహాన ఇంత నల్లని రంగుని పూసి. అక్కడో గీతని గీసి. డేంజర్ జోన్ అని రాసి. గాఢ వాంఛ ఒక్కటే నమ్మదగ్గదై. లోపలి నిజం మాత్రమే రక్షించే బంధువై. ఎద పిండే గానంతో, మది మండే పానంతో, ఈ ఒక్క క్షణాన్నై. తొవ్వని తొలిచీ, తొలిచిన తొవ్వనై. నేను మాత్రమే నేనైన ఒక్క నేనై. ఉండిపోతానిక. నా గుండెలో నేనొక శరణార్థినై. 11. 6. 2014
by Mohan Rishi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q3nZNj
Posted by Katta
by Mohan Rishi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q3nZNj
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి