విరహ ని"వేదన" మధు మోహనా వీణా మధురాంత మానస వీధి చిద్విలాసమున తంత్రుల మంత్రమో ... నీ ఊహలు మీటిన చిత్రమో.... సలపజాలను ఈ సాయంత్రనా... వేగలేను ఈ విరహానా.. వెన్నెల కొమ్మయి వన్నెల రెమ్మయి నీకోసం విరిసాను వెండి మబ్బు ఎండల్లో నీకోసం చూసాను సందె మబ్బు గాలుల్లో నీ ఊసే మొశాను రాతిరమ్మ సందిట్లో నా ఊహల ముంగిట్లో ముద్దులెన్నో కురిసేను నడిజామైన నీ జాడ కానక కునుకు చేరదేలనో తెలవారుఝామైన తరిగిపోని నీ మోజులో కరిగిపోనా పొగమంచు పోగేసి నీ రూపు నే గీసి నీలాల కళ్ళలో నే తడిసిపోనా.. తడి ఆరిపోనా.. మౌనమేదో పలికింది.. మధువెదో వొలికింది.. వేణువై నువ్వే పిలువగా.. నీ వాలు చూపు నన్నే తాకగా. తరియించగా తనువు పులికించేనో మదినుంచగా మోహం పురి బిగిసేనో మోహనాంగా.. మురళి మ్రోగించారా. రాగరంజితమై నీలో రవళిoచేదా సాదరంగా నిను ధరియించేదా ఆదరంగా అధరాన్ని అందించేదా ఆకలి పోదివి..నా.. అమృతము. నీ పై కురిసే..దా.. అనుదినము. ఆరడుగల ఆజానుడా ఏడేత్తుల మల్లెనురా.. మది తొలిచే మన్మధుడా నిను గెలిచే మగువనురా మరిచిపోనని మనసన్నది మధువునై మిగిలున్నది నీకోసమే నేనన్నది జాబిలినై జాడ కానగ నీ నీడన అనునయించేదా కనుపాపన ప్రతిక్షణమున నిను పరిణయించేదా పసివాడని పరిమళమై ప్రతి జన్మనా నీరీక్షీంచెదా
by Vytla Yakaiah
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1uWt5ej
Posted by Katta
by Vytla Yakaiah
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1uWt5ej
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి