పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, జూన్ 2014, బుధవారం

Thilak Bommaraju కవిత

తిలక్/సమాధి కింద :::::::::::::::::::::::::: వెన్నెలను మీద పోసుకున్న కెరటాలు నిత్యం తడుస్తూ కొన్నివేలమార్లు పుడుతూ నీటిలోకి దూకిన కాంతి బొంగరంలా ఎంతదూరం వెళ్ళిందో ఓ చూపు కొలుస్తూ బస్సు కిటికీలోంచి నా కనురెప్పలు విడివడి బయటెక్కడో పడతాయి కొబ్బరాకులపై కూర్చుంటూ తెగిపడిన నా ఆత్మలు అక్కడక్కడ కనిపిస్తుంటాయి ఏరుకోలేనన్ని ఏమో ఎన్ని కొండగోతుల్లో డొక్కలు పగిలాయో నిత్యపు మైనం కాల్చిన రక్తం నా అస్థిపంజరం గుండా నన్ను తోస్తూ క్షమిస్తూ హింసిస్తూ నిరాశా విత్తనాలు ఎడారిపూల సమాధుల కింద కప్పబడ్డాయి తిలక్ బొమ్మరాజు 11.06.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Sx8i2h

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి