/// అవని/// మట్టితోనె జరిగెను మానవుని సృజన భౌతిక అవసరాలు సమస్తం భూవుత్పత్తులపైనే కొండలు కోనలేకాదు సప్తసముద్రాలను మొయు చున్నావు భూమి తల్లీ మాయమైనాయి ఆహ్లాదపరచిన పిల్లతెమ్మెరలు ఆయువును హరిస్తూ వాయుకాలుష్యమై కర్మాగార వ్యర్దాలు కలుషితము చేస్తూ నదీనదాలను కారణమవుతున్నాయి అనారోగ్యాలకు హరించిపోతూ అడవులు సైతం కంటతడి పెట్టిస్తూ జంతుజాతులను చినుకులేక మేఘాలు మౌనాన్నిదాల్చినాయి ఎడారులైనాయిపంటపొలాలు అణుబాంబు ప్రయోగాలు అణువిద్యుదుత్పత్తులు ఉన్మాదుల ద్వేషాలు మారణహోమాలు జాతి వినాశనానికే దారితీస్తాయి తీరాలు ముంచెత్తి సముద్రాలు మత్యకారుల బ్రతుకు విలువ కోల్పోయె హరిత సుందరమైన అవని తల్లి కన్నీరు పెడుతోంది కళను కోల్పోయి అవని అనగానె ఒడలు పులకరించును కదా భూమాత అందరికి తల్లియే కాదా...!! అందరము పూనుకుందాము అవని అందాన్ని కాపాడుకుందాము!! .....వాణి కొరటమద్ది 29/4/2014
by Vani Koratamaddi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rBjbuU
Posted by Katta
by Vani Koratamaddi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rBjbuU
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి