// జయ రెడ్డి బోడ // చెవిలో పువ్వు // కూలి నాలీ పిల్ల పెద్ద, కార్మిక వర్గమంతా పల్లె పల్లెన అందరూ ... మత్తుగా గమ్మత్తైన మత్తులో ఊగుతూ జోగుతూ ...వాడ వాడలో కేకలు కేకలు చచ్చే ముందు బలి పశువుల్లా వివేకం మరిచారో,ఇక మళ్లీ తేరగా దొరకదని ధనం,మధ్యం వ్యసనాలకు బానిసలై.. ధనాఘారాలు నింపుకున్న కసాయిలకు తమ భవిష్యత్తును ఫణంగా పెట్టి మరీ .. మరిక తమను తాము కోల్పోయి అమ్ముకుంటా రేమో తమ "రేపును", రేపే మరి గడచిన కాలంలా తమను తాము చిరకాల బానిసలుగా వీలునామా రాసిస్తారేమో రేపే మరి రంగు రంగుల జెండాల హామీల వలలో పడి గమ్యం తెలియని ప్రవాహాల్లో కొట్టుకు పోతు, తమను పాలించే పగ్గాలను ఏ అవినీతి పరుని చేతిలో పెడతారేమో రేపే మరి మీ వద్ద ఏదైనా అదృశ్య శక్తీ అయినా ఉంటే ఆపండయ్య ఇప్పుడే ..వారిని వారు నిండా ముంచుకోకుండా .. ఎవరైనా చెప్పండయ్యా మైకం కమ్మిన వారి ముఖం పై కొన్ని చల్లని నీళ్ళు చల్లీ, వారికి కాస్త బుద్ది చెప్పి .. పునీతులు కండయ్య బాబ్బాబు మంచి "పాలకుడు" ఎక్కడైనా పుట్టి ఉంటే??? కలలోనైనా సరే వారి చెవిలో చెప్పేసి రండయ్య చిరకాలం 'చెవిలో పువ్వు' పెట్టించు కోవద్దని చెప్పండయ్య ప్లీజ్ ... (29-04-2014)
by Jaya Reddy Boda
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mWz7Yy
Posted by Katta
by Jaya Reddy Boda
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mWz7Yy
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి