పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

29, ఏప్రిల్ 2014, మంగళవారం

Arcube Kavi కవిత

కుళ్ళిన పళ్ళతోట-5 _______________ఆర్క్యూబ్ ఏంచి దంచి వస్త్రగాలితం చేసి నువ్వెన్ని కథలవడు పాణం మీదికచ్చినంక పత్తిగింజల పొడేం జేత్తది ఆయుర్వేదం మస్తుగ జెప్తది ఇంగువో నల్లమందో నువ్వల నూనో లేక అడవి ఆముదం పాలో ఆకులు కాలాకా ఏ పురుక్కు ఉరి పేనుదాం గోర్వెచ్చ ఉప్పునీళ్ళను పుక్కిలిస్తే గిప్పుడేం వాక ఆస్ప్రిన్ ఎనాల్జిన్ ఐబ్రూఫెన్ దండు ఏదైనా మడిమ దిప్పుద్ది పన్ను బాగం వక్క - చట్టం-పథకం ప్రకారమే దవడకేస్తది షరా మామూల్లే క్షయ క్షయమౌతున్న దంతం ఎవడి ముక్కని మూస్తం ఎంతకని మూస్తం నోరుదెరిస్తే - దేశమంతా కంపే ముక్కు కాడ చెయ్యూపుకునుడే ఇంకా వాని పేస్టులతో ఏం మేర్వానం ? బఠానీలను చూస్తే పంటికి ముక్కు బెదురుద్ది వాని తిండికి సుఖం మరిగినంక అట్టి దారప్పోగును జూసినా పంటికి చెక్కరస్తది ఉత్త సొప్ప బెండు తుపాకివట్టి సకినప్ప సుతం హండ్సప్ అంటది ఫంక్షన్ కి పోతే -పక్క పొంటోడు వాడు -ముప్పై రెండు పళ్ళను ముందటేసుకుంటడు బంతిల కూసుంటె లడ్డు సుతం కిందా మీదా జూస్తది కారప్పూస కిసుక్కుమంటది ఏమోయ్ తాతా అంటూ బొక్కల పులుసు వక్కడ వక్కడ నవ్వుతది కుక్కలు చింపే విస్తారాక్కూ ఎక్కడో కాలుద్ది యవ్వనం పప్పు దప్పడమైతే మనకైనా కాలుద్ది పిసికి పిసికి తింటే మెత్తగ తన్న బుద్దైతది ( ఇంకా ఉంది )

by Arcube Kavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rBjc1Y

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి