కత్తిమండ ప్రతాప్ || వచ్చేస్తోంది మేడే|| ======================================= కనురెప్పల చాటున ఎర్రటిస్వప్నాలెన్నో కదలాడుతున్నాయి కళ్ళల్లో మాత్రం రక్తపు ఛారలు ఎర్రగా దారులు చూపెడుతున్నాయి కళ్ళముందు కదలాడే భావాలెన్నో నిద్రను దూరం చేస్తున్నాయి కలలన్నీ వర్ణాలై కళ్ళముందే రంగులు మారుస్తున్నాయి కలలు మాత్రం నిజాలై సమాజ స్వప్నాన్నే ప్రశ్నిస్తున్నాయి కళ్ళముందు కదలాడే సజీవ దృశ్యాలు నిర్జీవంగా మారుతున్నాయి రక్తంలో తడిపిన చొక్కా ఎర్రజెండాగా మదిలో మెదులుతుంది నాటి చికాగో స్మ్రుతులు నిద్రను మేల్కొల్పుతున్నాయి స్వేధం చిమ్మే శ్రామిక వనం ఎర్ర గులాబీలను పూసింది మేడే వచ్చేస్తున్ధంటూ ఎరుపెక్కిన దారులన్నీ ఎర్రటి బాట పట్టాయి హైలో ... హైలెస్సా... అంటూ పదాలు పాడే పెదాలన్నీ పాదాలకు ఊపునిచ్చి పద పద మంటూ పరుగులెడుతున్నాయి పదాలన్ని పదనిసలై ఉద్యమ ఊపిరి పోస్తున్నాయి పోరు బాటలో శ్వాస కోసం అన్వేషిస్తున్నాయి ఎక్కడో భూకంపాలు జరుగుతున్న ఆనవాళ్ళకు ఇక్కడ పేక మేడలు కూలుతున్నాయి పాదాల పరుగుల శబ్దం గాయాలై వెంటాడుతుంది గత గాయాలు గుచ్చుకుంటూ తరుముకొస్తున్నాయి రక్త చరిత్రను తిరగరాసే కార్మిక కర్షకలోకం కదం తొక్కింది మద మెక్కిన బూర్జవలోకం పీక నొక్కింది ఉద్యమం నిలిచింది ... గెలిచింది... నేను సైతం పోరు బాటలో .... ! జయహో ..... ! ============ ఏప్రిల్ 29/2014
by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jdRgk4
Posted by Katta
by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jdRgk4
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి