అప్పుడప్పుడూ కళ్ళెదుటే సరోవరం కదిలించబడతుంది కదలలేని స్థితిలోపడి ఎదురుచూస్తుంటాం సహాయమందించే స్పర్శకోసం నిరాశగా సంవత్సరాలు గడచిపోతాయి అలా పడివుండటం అలవాటయ్యిందనుకుంటారు తోసుకువెళ్ళడాన్కి మనసే లేదనుకుంటారు దేహాన్ని కృంగదీసిన వ్యాధి అంతరంగాన్ని కృంగదీస్తుందని ఎవరికైనా ఎలా తెలుస్తుంది? చెట్లు ఆకుల్ని రాల్చినట్టు కాలం సంవత్సరాలను రాలుస్తుంది కదిలే దేహాలన్నీ కదలిపోతుంటాయి ఎవరికోసమో ఎదురుచూసినంతకాలం అలా పడివుండటం తప్పదు * * * నన్ను నన్నుగా ఎరిగి దేహాన్నీ అంతరంగాన్నీ లేవనెత్తి సాగిపొమ్మని ఆజ్ఞాపించినవాడి మాట ఆశ్చర్యమే! *****************29.04.2014 04:50 hrs ISD
by John Hyde Kanumuri
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kfvZnY
Posted by Katta
by John Hyde Kanumuri
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kfvZnY
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి