సొన్నాయిల నరేష్కుమార్ //ఊరుపేరెంది మరి// ఉర్కుతనే ఉంటం అందరం ఇంట్లకేంచి ఆఫీస్కూ ఆఫీస్ల ఖుదాహఫీజుల్జెప్పి ఇంట్లకూ... "బైంగన్ కా జిందగీ" అనుకుంటనే బేషరం గాల్ల లెక్క బజార్లపొంట నడుస్తనే ఉంటం ఏదో పీకుదాం అని తెల్లవడ్డ సూర్యుడు పొద్దూకంగ సైబాత్ సమజైనట్టు మల్ల ఎర్రవడి వొర్రెల దుంకుతడు మనకతం గాదు గ్రాండ్గ బతుకుతున్నం అనుకుంటనే రావొత్తు ఏన్నో పారేస్కొని పల్లెం ల మారన్నం బెట్టుకునుడు మర్శిపోతం. ఎప్పుడన్న ఓసారి రేడియల కెల్లి గొరటెంకన్న వొర్లినప్పుడు యాదికచ్చిన ఊరు కండ్లల్లకెల్లి కార్కత్తది... ఊల్లెకు వొయ్ సిల్పర్లతోటి గల్లిలల్ల గాయి గాయి తిర్గబుద్దైతది సికింద్రవాద్ల తలుపుదీశి ఊర్కడుగువెడ్తే పల్లె పట్నపు మొకమేస్కొని గడంచెలగూసోని నవ్వుతాంటది... మాడుప్మొకమేస్కొని మంచాల గుసుంటే సర్వపిండి ని పిజ్జా లెక్క కొరుక్కుంట పక్కపొంటి కూసోని కడుపుల కత్తివెట్టినట్టు తమ్ముడచ్చి అడుగుతడు "అన్నా మనూరికి కొత్త పేరేం బెడ్దామే" అని ... 29/4/14
by Naresh Kumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nzt0Mm
Posted by Katta
by Naresh Kumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nzt0Mm
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి