A Genuine feeling of A Muslim - - - - - - - - - - సంసిద్ధతా ప్రకటన - - - - - - - - - - - - రూహీ తబస్సుం (Akkampeta Ibraheem) రక్తవర్ణ దృశ్యమొకటి కంటిపాపపై వేలాడుతూనే వుంది దగ్ధమైన బతుకుకావ్యం గుండెగూటిలో జ్వలిస్తూనే వుంది అందరూ మర్చిపోయారు నేను తప్ప ఆదమరిచి హాయిగా నిద్రపోలేని భయం వొకటి పీడకలై వెంటాడుతూనే వుంది నలుచెరుగులా కమ్ముకున్న భ్రాంతి దేశమిప్పుడు అభివృద్ధి జ్వరంతో పలవరిస్తోంది ఒకే మందు ఒక్కటే మందు తిరుగులేని మందు మార్కెట్లో వైబ్రరిట్‌గా మరి ప్రత్యామ్నాయం లేదన్నట్లుగా మందు అనుకుంటున్నది కాలకూటమది తెలిసున్న పేగులు తెగిపడుతూ.. తపిస్తున్నాయ్. ఎవరికీ ఏ భయాలూ లేవు చీమ గుడ్డంత కూడా ప్రమాద సూచనా లేదు రేపటి స్వప్నాల్ని ఇప్పుడే కలగంటూ గట్టిగా కళ్ళు మూసుకున్నట్లుంది పడగెత్తి వస్తున్న పెనుతుఫాన్నే చూస్తూ నేనొక్కడినే సుడిగాలి ఎగరేసుకుపోయిన వగుడాకునౌతున్నా భ్రమల మేఘం ఆకాశాన్ని ఆవరించింది ఆ మూల నేలంతా పచ్చగా మారిందట ఇప్పుడన్ని మూలలూ పచ్చదనం కోసం పరితపిస్తున్నాయ్ పచ్చగా మారడంకోసం ఎర్రని చెమ్మను పీల్చడం అక్కడి ప్రయోగం కదా మూలమూలనా పచ్చబడాలంటే ఎన్ని అరుపు నదులు కావాలో అన్ని తలలూ అంగీకారంతో ఊగిపోతున్నాయ్ ఆవగింజంత అభ్యంతరం ఏ కంటిలోనూ తొంగిచూడ్డం లేదు నా కళ్ళనిండా మాత్రం పులి మీసాలకంటిన చిక్కటి నెత్తుటి వర్ణం సరే... నా భయాలు నావి వాళ్ళ ఆశలు వాళ్ళవి ఐదేళ్ళకు ఒకసారి అవకాశమొస్తే బాగుపర్చే వాణ్ని భాగమిచ్చే వాణ్ని ఎంచుకునే భాగ్యం వాళ్ళదైతే బ్రతకనిచ్చే వాడికై దేవులాడే దైన్యం నాది ***** మున్ముందు రాబందు మళ్ళీ రెక్కలు చాచినప్పుడు చెల్లాచెదురయ్యే పావురాల గుంపులో నువ్వు నన్ను తేలిగ్గానే పోల్చుకుంటావ్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నెత్తురోడుతున్న ఈ కపోతం 'నా గూటిలోదే'నని నిర్ధారించుకుంటావ్ అంతరంగంలోనైనా అశ్రుకణమౌతావ్ అప్పుడు కూడా అక్కడిలాగే పచ్చబడ్డమే నువ్వూ కోరుకుంటే ఎరుపు నదినై ప్రవహించడానికి నేనెప్పుడూ సిద్ధం
by Sky Baaba
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nBbHug
Posted by Katta
by Sky Baaba
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nBbHug
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి