పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

29, ఏప్రిల్ 2014, మంగళవారం

Pardhasaradhi Vutukuru కవిత

అతివ అంటే ఆదిపరాశక్తి వనిత అంటే విశ్వశక్తి పురాణ ప్రవచనాలలో ఎంతో వున్నత స్తానం ఆమెకు భారత మాత , ఆంధ్రమాత , గంగా మాత పవిత్ర ప్రక్రుతి కి కుడా మాత్రుస్తానం కల్పించాం కంటి ముందు కన్నతల్లి ని హీనం గా చూస్తున్నాం ఇది ఏమి సంస్కృతి ... ఎందుకీ రాక్షసత్వం మనిషిగా పలకరిస్తే మదం తో కాలరాయటం ఆర్తి గా అభ్యర్ధిస్తే అమానుషంగా అత్యాచారం చదువు లేని వాడు వింత పశువు అని వాళ్ళని అనుకుంటే జ్ఞానం వున్నా వాడు కుడా క్రూర పశువు లా చేస్తే ఎక్కడికి వెళుతోంది మన సమాజం ముఖ పుస్తక పరిచయం సంస్కారం అనుకుంటే దీంట్లో ను నీచ సంస్కారమే కదా పలకరించిన ప్రతి స్త్రీ నీకు ప్రేయసా .... ?? ఈ కాముక దృష్టి ఎలా పోతుంది .... ?? సాంకేతికత ను ఆధారం చేసుకుని వారి పరికరాలలో అశ్లీల సాహిత్యం ఎంతటి ఘోరం ?? ఈ నీచ నికృష్ట భావాల సమూహాలతో చక్కగా కాపురం చేసుకునే ఎన్నో కుటుంబాలు వీధిపాలు అవుతాయి కదా .... దాని పాపం మనకు తగలక మానదు ... యత్ర నార్యస్తు పూజ్యతే ... తత్ర రమంతే దేవత !!పార్ధ !!29apr14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QYvje4

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి