పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

29, ఏప్రిల్ 2014, మంగళవారం

Ravela Purushothama Rao కవిత

మేఘసందేశం రావెల పురుషోత్తమరావు -------------------------------------- మబ్బులు ఎప్పుడూ దూరంగానే మసలుతూ వుంటాయి కారుమబ్బులుగా కదలినప్పుడు కర్షకుల గుండెల్లో హర్షాతిరేకం తెలిమబ్బులుగానే నింగిలో నిలిచిపోతే శేద్యగాండ్ర కళ్ళల్లో కన్నీటి వరదలు. సందేశాలిచ్చే మబ్బులసంగతి కాస్త అటుంచితే సమయానుకూలంగా ప్రవర్తించే మబ్బులకే గుండేగొంతుకల్లోంచి జనావళి ప్రశంసల పూలజల్లులు. పొలాలనన్నింటినీ హలాలతో దుక్కులుగా దున్ని దిక్కులవైపు ఆశగా చూసే రైతాగానికి ఆశలు పుట్టించి నిరాశలనందించే మేఘాలపై అందరికీ ఆక్రోశం==ఆవేశం-

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h7KVm6

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి