_అపాయం_ చెప్పొస్తే ఏంటి చెప్పకుండా వస్తే ఏంటి!! అన్నీ ఆలోచనలే వాటికవే మూలంగా పరస్పరమైనట్టే ఉన్నా ఒక ఆలోచన ఇంకో ఆలోచనకు మూలమనిపించడం మూర్ఖత్వమే!! వెంబడిస్తే రెండూ ఉండవ్ మరి.. ఒకేసారి రెండు లేదా ఇంకా ఎక్కువ సరళ్లను విస్తరించుకునే పరిదికి అసలొక సరళే లేదు సరళoటేనే పరిది ఆలోచనలోది!! ఆలోచనలే ఆలోచన.. ఆచరణకు అడ్డం లేని ఆలోచనయితే ఆలోచన కోరికవుతుంది మూలం కదలకుండానే!! కోరికవ్వని ఆలోచనలెన్నోఆలోచనకే తెలియదు ఆలోచన కాని కోరికైతే లేదు!! పరిది పడితేనే ఆలోచన కోరికయ్యేది మరి.. అపాయం కోరికలో లేదు , ఆలోచనలో లేదు పరిదిలోనే!! ఏంటా పరిది?? సావ దొబ్బించుకుంటున్నా సావుకు లేని పరిదులు aka సరళ్లు బతుక్కుండటం అలోచించి!! ఉన్నందుకవసరమేగా మరి.. ఎవరికి వారే ఏమవుతారో తెలియని ఏమరపాటులో ఎన్నవుతున్నారో ఏమవుతున్నారో మూలం కదలకుండా!! కదలకుండా ఏంది నా కపాలం మూలమే లేకుండా!!______________ (29/4/14)
by Chi Chi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1keQjGg
Posted by Katta
by Chi Chi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1keQjGg
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి