కళ్ళెదురుగా నీవున్నా కనబడని దూరాలెన్నో గుండె నిండుగా నీవే వున్నా ............నిను చేరలేని శూన్యాలెన్నో నీ గుండె లయనేనైనా ప్రతిస్పందన కాలేను నా కంటి పాప నీవైనా కన్నులలో దాయలేను నీ మోవికి సుధనై మారేదేపుడు నీ శ్వాసకు శ్వాసగా మారేదేపుడు నీవే నేనని సంబరపడనా తోడుగ లేవని వేదన పడనా ఎలా విప్పి చెప్పను నేను మది తొలిచే ఆవేదనను ఎలా నిన్ను మరువను నేను అణువణువూ కలసిన నిన్ను శశిబాల...28 march 14
by Sasi Bala
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1frCCkg
Posted by Katta
by Sasi Bala
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1frCCkg
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి