పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

28, మార్చి 2014, శుక్రవారం

Harikrishna Mamidi కవిత

పువ్వుల్లో దాగున్న నువ్వెంత అతిశయం ! ------ మామిడి హరికృష్ణ ఈ వేకువ వెలుగుల్లో నేను కోరుకున్న నువ్వు బంగారు కిరణాల బంతి పువ్వు ఈ ఉదయపు క్షణాల్లో నేను మెచ్చిన నువ్వు లేత రేకుల గులాబీ పువ్వు ఈ మధ్యాహ్నపు నిర్జన వీధుల్లో నేను తలుచుకునే నువ్వు విచ్చుకున్న చేమంతి పువ్వు ఈ సాయంత్రపు నీరస ఘడియల్లో నేను ఆరాధించే నువ్వు పరిమళాలు చల్లే మల్లె పువ్వు ఈ చీకటి వెన్నెల వేళల్లో నేను అభిమానించే నువ్వు మాల కట్టిన కనకాంబరం పువ్వు నా వెచ్చని గుండెల్లో నేను ప్రేమించే నువ్వు సిబ్బి పై నెరిసిన బతుకమ్మ పువ్వు ...!

by Harikrishna Mamidi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hzjPE5

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి