పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

28, మార్చి 2014, శుక్రవారం

Rama Krishna కవిత

రెడ్డి రామకృష్ణ//కవిత్వపు ముద్ర // తెల్లని కాగితం ముందేసుకొని చేతిలో పెన్ను పట్టుకొని కూచుంటాను కాగితం మీదికి కవితను ఆవాహన చేస్తూ.. మహాకవుల వాక్యాలను మంత్రాల్లాగ మననం చేస్తూ... రాత్రంతా తనలో తాను దహించుకు పోయి తెల్లని వెలిబూడిదై గాలిలో కలిసిపోతుంది తెల్లవారేసరికి చీకటి ఎక్కడా మిగల్లేదు కానీ తూర్పున ఒక నిప్పు కణిక మాత్రం ఆరకుండా రాజుకుంటూ కనపడింది కవిత మాత్రం కానరాలేదు మరొకసారి నగరం నిశ్శబ్దమైన నిశి రాత్రి మేడమీద చుక్కల ఆకాశం కింద అటూ యిటూ పచార్లు చేస్తూ మనసులో వెన్నెల మధురిమను నింపుతూ కవితకై పడిగాపులు కాస్తె మనసు మంచు ముద్దై జలుబు వచ్చింది తప్ప కవిత మాత్రం కానరాలేదు యింకోరోజు తప్పని సరనిపించి కొన్ని అక్షరాల్నికుప్పగా పేపరుపై పోసాను అందులో కొన్ని అక్షరాలైనా భావంతో సమ్యోగం చెంది పదాలుగా ఏర్పడతాయి గదా కాసేపాగి శనగలును ఊదినట్టు ఊదాను పొట్టంతా ఎగిరి పోయి గట్టిగింజలు మిగిలినట్టు కొన్నిపదాలు మాత్రమే మిగిలాయి వాటిని ఒకక్రమంలో అమర్చి మట్టిబొమ్మలు చేసే కళాకారునిలా ఒక ఆకారాన్నిచేకూర్చాను కానీ జీవం కనపడలేదు కవితకోసం నేను తపన పడ్డన్నినాళ్లూ రాలేదు కాని ఒకరోజు మనసంతా దుఃఖ భారాన్ని మోస్తూ ఆందోళనగా ఉన్నఫ్ఫుడు కళ్లనించి కన్నీరు ఒచ్చినంత సహజంగా టప టపా నాలుగు బొట్లుగా జారి మనసు కాగితం మీద తన ముద్రేసిపోయింది *** 28/03/2014

by Rama Krishna



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hCNdt7

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి