కత్తిమండ ప్రతాప్ || రెండు పాళీలు|| ====================== ప్రేమ రాతలు విరహ గాధలు కలలో ప్రేమలు దిల్సే ఊహలు ఆకాశంలో నక్షత్రాలు సముద్రంలో ఆల్చిప్పలు అన్నింటా నీ ప్రేమే! ముద్దుల్లో నువ్వు సరసంలో లవ్వు కళ్ళల్లో నేను కనుపాపలో నువ్వు ఊహల్లో నువ్వు ఊహించలేనంతగా నేను రాతల్లో సరసం మాటల్లో విరహం ఇద్దరి మధ్య ఏకాంతం వనం లో మనం ఒంటరితనంలో తుంటరి తనం భలే రాతలు నచ్చే క(వి )తలు నీ సిరా పదాలై పదనిసలై పరిగెడుతోంది ! |||||||||||||||||||||||||||| ఆకలి బతుకులు ఎంగిలి మెతుకులు బతుకు కేకలు వినిపించని ఆర్తనాదాలు దాటని పొలికేకలు కనిపించని పొలిమేరలు చెత్తకుప్పల్లో జీవనం రోజు బతుకు రణం మెతుకుల ఆరాటం కడుపు కాలే చుక్కలు తప్ప నక్షత్రాలుకనపడవు రక్తం పీల్చే జలగలు తప్ప ఆల్చిప్పలు దగ్గరకు రావు ఆవేదన ... ఆలోచన ఆవేశం ... ఆక్రందన గొడుగు లేని బడుగు జీవితాలు దగాపడ్డ దారిద్ర్యాలు శాపగ్రస్త జీవితాలు చీకటి బతుకులు ఎందుకో నాకలం సిరా కక్కుతుంది భానుడు భగ భగలాడుతున్నాడు రాత్రంతా నిద్దుర లేదు కదా! ఎరుపెక్కిన సూర్యుడు సిరాలో దాగిపోయాడు ================ మార్చి 28/2014
by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hAT4iu
Posted by Katta
by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hAT4iu
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి