పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

28, మార్చి 2014, శుక్రవారం

Krishna Mani కవిత

ముప్పు - తప్పు ***************** భూమాతకు దయ కలిగి తన బిడ్డకు ఒక చోటునివ్వదా ! ఆకాశం కనికరించి నా తనువుకు దాపుగా ఉండదా ! నా గోసకు గంగ మనసు కరిగి చుక్క కన్నీరొంపదా ! ఆ గాలికి జాలి కలిగి పరిమళ మత్తులో నాకు జోల పాడదా ! ఈ అగ్గికి గుండె కదలి నా ఒంటికి కోన వరకు తోడై సాగదా ! చేసాను ముప్పు అది క్షమించరాని తప్పు వీరుణ్ణి శూరుణ్ణి పరాక్రమున్ని అని అంతా నా వశం గోరి గతి తెల్వక మతి లేక నా చుట్టు కంచే పరచి లోకాన్నే ఒంచ దలచి చేసాను ముర్ఖున్నై గొప్పలకు దాసున్నై గోతిని తోడి మురిసితి అహంతో పోసుకుంటి మట్టిని నిండా పిచ్చితో ! తల మాత్రమె మిగిలింది చేతులు కాళ్ళు ఆడక ఇప్పడు వచ్చింది మెదడులో మెరుపులా అసలు జ్ఞానం ఏమని ఏడ్చుదు ఏమని నవ్వుదు ఏమని మొక్కుదు ఏమని అడుగుదు పంచభూతాల సృష్టిని నేను తల్లి ఒడిలో బిడ్డను నేను తలదించి నిల్చుంటి మోము చూపని సిగ్గుతో కనికరించి చూచునని ఆశలేని ఆశతో ! కృష్ణ మణి I 28-03-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o7LcOp

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి