పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

28, మార్చి 2014, శుక్రవారం

Padma Rani కవిత

!!ఏమార్పు!! వరదలా పొంగిపొర్లే భావాలను దాచి.. నదిలాంటి ఆశల ధృఢనివాసం కట్టలేవు అడవిలో తూఫాను హెచ్చరితో అరచి.. కాండానికి ఊహల ఊయలకట్టి ఊగలేవు విరిగినద్దంలో ముక్కలైన మోము చూసి.. ముఖకవళికలు మార్చానని ఏమార్చలేవు తీయనిమభ్య మాటల తివాచీ ఏదో పరచి.. అరికాలు కడిగి మది మలినం తుడవలేవు రాగయుక్తంగా భావంలేని గీతం ఆలపించి.. అవిటితనచేతి చప్పట్లు విని ఆనందించలేవు పచ్చని తోరణాలుకట్టి వాయిద్యాలు మ్రోగించి.. చావుని కళ్యాణ కార్యక్రమమంటూ చూపలేవు 29-3-14

by Padma Rani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/P1rT9R

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి