//జ్ఞానోదయం// జోడించిన విత్తనం చేతుల్లోంచి రెండు ఆకుల్నీ సునాయసంగా కిరణాల దారాలతో పైకి లాగుతున్న సూర్యుడు ముడుచుకున్న కొమ్మ గుప్పిటిని మెజీషియన్ లా ఊపీ ఊపీ పూల గుత్తుల్ని ప్రదర్శిస్తున్న కొత్త ఉదయపు గాలి కృష్ణశాస్త్రి పాటలందుకొన్న భావకవుల్లా వసంతానికి దిష్టి పూసలు కడుతూ రాత్రిలోంచి రాలిపడ్డ గండు తుమ్మెదలు ఏమందం ఏమందమ్మని గొంతు ముడి విప్పి అడివికి పాటల చీరల్ని చుడుతున్న నల్ల కోయిలలు నిజంగా ఇప్పుడు నేను జ్ఞానోదయం కోసం తిరిగీ తిరిగీ వసంతం తోటలో కళ్ళుమూసుకున్న శుద్దోదన కుమారుణ్ణి తరతరాల కులాల అంతరాల దొంతరల్ని తెల్ల పువ్వులుగా విప్పి చేదు పాఠం చెప్తున్న వేపచెట్టు నా బోధి వృక్షం ఒక్కమొదలే గుంపులు గుంపులుగా ఎదిగిన సామ్యవాద ప్రతీక తీపి చెఱకుగడ నా కొత్త నిచ్చెన కొండెత్తు కేంద్రీకృతమైన సంపద చాస్తున్న చేతులకు వేల మామిడి పిందెలై అందాలన్నది నేనాశిస్తున్న పుల్లటి సహకారం నిత్యం కళ్ళ భూగోళాల్ని చుట్టుముట్టే దరిద్ర తుపానుల్నుంచి సామాన్యుల్ని ఉప్పునీటి సముద్రాల్ని దాటిందాలన్నది నా పడవ సత్యాగ్రహం ప్రజాస్వామ్యం తోటలో నెమళ్ళకు తూటాలు దించి నిమిషం మౌనమయ్యే కుట్రల్ని రాపాడించి ఎగిసే మంటల ధిక్కార కారం నా అలంకారం కొత్త కొత్త చిగుర్లై ఎప్పుడు నాలుక మీదికెక్కినా ఎదిగీ ఎదగని పలుకుల వ్యంగ్యం నా మాటల వగరు పొగరు ఇప్పుడు నా రెండు కిటికీల తలుపులు తెరిస్తే నా ఎదురుగా బుద్దుని శిష్యులు. 28/03/2014
by Boorla Venkateshwarlu
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ftr53K
Posted by Katta
by Boorla Venkateshwarlu
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ftr53K
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి