పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

28, మార్చి 2014, శుక్రవారం

Mala Chidanand కవిత

||ఐక్యం|| నీ చిరుదరహాసం చిందించెను నా వదనంలో మందహాసం. నీ అమృతవాక్కులు అందించెను నాకొక నవజీవితం. నీ ఐశ్వర్యవంతమైన హృదయం నాకదే ఆవాసస్థానం. నీ అందమైన మనసులోని కుసుమం నేనన్నదే నాకు గర్వం. నీ కలలో విరిసే రంగుల హరివిల్లు నా కళ్ళలో మెరిసే నక్షత్రాలు. నీ ప్రతిశ్వాసలోని సుగంధం నన్నలరించే అద్భుత భావం. నీవాలాపించే దేవగానం నాలో ప్రవహించే జీవజలం. నీవు కురిపించు నిష్కల్మష ప్రేమ నాలో చిగురించెను చేతనత్వం. నీవే నా ఊపిరి.. నీలోనే నా ఉనికి.. నీతోనే సఖ్యం..నీలోనే ఐక్యం.. ॥మాలచిదానంద్॥28-3-2014||

by Mala Chidanand



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fsNQF0

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి