|| గెలుపు పిలుపు || తెలంగాణ పేరొక కీర్తిపతాక – కల్లు సాక బోసి , ఊరి పోశవ్వ కు దిష్టి తీయాలె బొడ్రాయి చుట్టూ పొర్లుదండాలు తీసి మొక్కులు చెల్లించాలె చావిడి కాడ ఆలువా ఆడి కచేరీల కరణం పంతుల్తో పహాణి చౌపస్లాలో మన రాష్ట్రం పేరు రాయించాలె ముసలోల్ల కండ్లల్ల ముసిముసి నవ్వుల భవిష్యత్ చిత్రపటం ఆవిష్కరించాలె తెలంగాణ గెలిచిన నిరీక్షణ – వైతాళికుల నుడుగులను అడుగడుక్కి నాటుకోవాలె త్యాగాలను దిగుట్ల సందె దీపాల్లా వెలిగించుకోవాలె పోరాట రూపాలను కతలు కతలు గా చెప్పుకోవాలె వేరు తెలంగాణ సాధనాశూర – గోదావరికి మనవూరి చెరువు దారి చూపించాలె కళలు , సంస్కృతి వానాకాలం చదువులు కాకుండా చూడాలె పజ్జోన్నల చేల మీంచి పల్లెపదాల గాలులు తేలియాడుతూ రావాలె తుమ్మ శెల్క పడుగు పేర్చి , చెమ్మచెక్క ఆడాలె సాగరతీరం స్పురణ మూర్తుల స్మరణ కీర్తనల కేంద్రం కావాలె ‘జయ జయహే’ గీతానికి పట్టాభిషేకం జరుగాలె చెడి, బతుకబోయే బిడ్డ...తెలంగాణ – *** -దాసరాజు రామారావు, 28-03- 2014
by దాసరాజు రామారావు
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/P1rST7
Posted by Katta
by దాసరాజు రామారావు
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/P1rST7
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి