పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

26, మార్చి 2014, బుధవారం

Venkat S Dhavala కవిత

నేను నీకై|||||| సమఙ (సోమయాజి) నేను నీకోసమే రాస్తున్నా ఓ కవితనే ఈ ప్రపంచం నా మదిలో జారగా ఆ ప్రకంపనలే మారేను సిరాగా నా యవ్వనం చూసిన వేల ఉషోదయాలే యెదుట నిలిచేను నిషా సరస్సులా నాలో యెన్నడు రేగని కోరికలే ఉదయించేను కొత్తగా నిన్ను చూడగా నువ్వూ నేనూ ఒక్కటి ఐతే అది కాదా అద్భుత కలయిక నీవు విహంగమైతే నేన్నీకై వేచే గగనాన్ని నీవు వెన్నెలవైతే నేన్నెకై చూసే సినీమాలిని ఓ చెలీ సఖీ నా ప్రియ నేస్తం అందుకోవాలి నేను నీ చల్లని హస్తం అదే నా అనందాలకి జీవాస్త్రం అప్పుడు దాసోహమే నాకు ఈ లోకం సమస్తం --సమఙ

by Venkat S Dhavala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NUKovg

Posted by Katta

Jwalitha Denchanala Jwalitha కవిత

జ్వలిత/ నిస్సందేహ పార్ధివ దేహాన్ని శతశతాబ్దాల చరిత్ర పునరావృతం బ్రమల భ్రమణాల వ్రణం కోటికోట్ల గొంతుకల గాయం(నం) నిర్నిర్మిత నిర్ణయాలు నిర్నిశ్చిత యుద్దాలు నిర్నిర్ణిత ఉద్యమాలు నిర్నిర్ద్వంద్వ హామీలు నిర్నిబద్ద ప్రయోగాలు నిర్నిస్సంగ విరోధాలు నిర్నిశీధి ప్రకాశాలు నిర్నిషిద్ద అత్యాచారాలు నిన్ర్నిసంఖ్యాక కాంక్షాశిఖరాలు నిర్నవ నిర్మాణ లంకాగృహాలు నిర్నిదగ్ధ భస్మసరస్సులు అనాయాచిత మధిరా ప్రవాహాలు అకాల మరణాధారిత అపత్నులు అసహాయ అలింగ ప్రసవాలు నిర్నిరోధ జాడ్య హేతువులౌ నేరస్వామ్య రాజ్యాన నిర్నిస్సంఘటిత సమూహాల వ్యూహాత్మక ద్రోహాల సమావేశాల్లో నేనొక నిర్నిస్సందేహ పార్ధివ దేహాని 'నోటా'ఓటు నాపాలిట అలౌకికానంద లౌకిక అస్త్రం/శస్త్రం ..... జ్వలిత 9989198943

by Jwalitha Denchanala Jwalitha



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NUKnYv

Posted by Katta

Patwardhan Mv కవిత

సందర్భం 02- ఎవరిది ఇది ?? (ఎపిసోడ్ సమయం 15 నిమిషాలు మాత్రమే) అందరికీ నమస్కారం.మీకందరికీ నచ్చిందనే నమ్మకంతోనే వచ్చింది సందర్భం-02 ఎపిసోడ్.ఇవాళ కూడా నిన్నటి లాగే ఓ కవిత్వ భాగం మీ ముందుంచుతున్నాను. అఫ్కోర్స్..మనకు అంత కష్టం ఏమీ కాదు.ఎవరిదో చెప్పండి. ఇలా పెట్టడం గూర్చి మీరేం అనుకుంటున్నారు? మీ స్పందనేంటి? ////.....ఎక్కడుంది నీ కప్పుడు కనిపించిన సత్యం? ఏనాటికి దొరుకుతుంది దేశంలో నాకు నచ్చిన సజ్జన సాంగత్యం? నీవానాడు చచ్చావు కనుక నిజంగా బతికి పోయావు ....,నువ్విప్పుడు బ్రతికే ఉంటే పిస్తోలుతో మరణం కాదు చిత్రవధ జరిగి వుండేది నీకు చావో బ్రతుకో తెలియని సందిగ్ధ జీవిత సంధ్యా సమయంలో ఊహలూ ఉద్భోధలూ మానేసి నీ అంతట నీవు ఉరి పోసుకుని వుండేవాడివి ....,నువ్విప్పుడు బ్రతికేవుంటే పచ్చి వెలక్కాయల్లాంటి ప్రశ్నల బాణాల్ని నీ గొంతుకు గురి చూసి కొట్టేవాణ్ణి..//// ఎవరివి ఈ తూటాల్లాంటి వాక్యాలు? నాకు తెలుసు .మీరు చెప్పగలరు.కొన్ని గొప్ప కవిత్వ చరణాలు స్మరణ చేసుకొనే ఈ పోస్ట్ మీద మీ స్పందన కోరుతున్నాను.మరి ఆలస్యం దేనికి?మీ సమయం ఇప్పుడు మొదలౌతున్నది. 26-03-2014,మంచిర్యాల్.

by Patwardhan Mv



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gCrjuO

Posted by Katta

Syam Prasad Bezawada కవిత

కవిత్వ మొక అవసరం ----------------------------శ్యాం ప్రసాద్ బెజవాడ కాదు నాకది అలంకారం కవిత్వం నాకొక అవసరం నన్ను నిలువరించే వివరం మీరు వినేలా తెల్పుకోనొక వరం! తల్లి వంట, చేసేదే పిల్లల కోసం వారు తినక, మరి దేని కోసం? వారు తినటమే, ఆమె అవసరం అందుకే అమె చేస్తుంది, మరో రసం! కవి కన్నబిడ్డలే కావ్యకన్యకలు వారి చిరంజీవమే, కవి కోరికలు అందుకు సాగే పాకాలే, ప్రాసలు విభిన్న నుడికారపు యాసలు! తెలియజెప్పాలి విషయమెలాగయినా కాదనుకుంటే, చేదాటిపోతుందాపైన జీవనయానం, అపరిమితం కాదు శవమైపోయాక వూరట అవసరం లేదు! ముసలితనంలో ముచ్చటగా కనలేరు గ్రీష్మమొచ్చాక ఆకు తొడగలేదు జీవన సత్యాలు విడచి నడువలేరు పథ్యానికీ, పంతానికీ కూడ సమయం అడుగలేరు! అందుకే అనుకున్నది సాధించటం అవసరం అసలు సమయాన్ని శాసించటం అవసరం తెలివి తప్పిపోయినట్టుండే ఒక్క క్షణం తెలిసి వేధించేస్తుంది జీవిత మనుక్షణం! స్పృహకయితే సమయం నిరంతరం మత్తుకు మాత్రం మాత్ర మితమే విశ్లేషణలు సాగాలి కాలానికి అనుగుణం అందు నిర్ధ్వంధ నివేద ననేదొక సుగుణం! అందుకే కావాలదొక అలంకారం కవిత్వం సమాజానికో అవసరం స్వర సంధానంలో నిలిపిన వివరం జనం వినేలా చెప్పుకోగల వరం!

by Syam Prasad Bezawada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/P1surG

Posted by Katta

Bhaskar Kondreddy కవిత

దాము || వొత్తిడి || నువ్వు పాదం మోపిన చోటల్లా నీలిపడగ విన్యాసం బుసకొడుతుంది. మరీచక దూరానికి చేయి చాసేందుకోసం మళ్లీ ఒక ప్రయత్నం చేస్తావు. దట్టంగా కమ్ముకున్న జీవితంలోంచి వూపిరాడక గిలగిలలాడతావు. వినేందుకు హృదయం దొరకదు, పువ్వుకాదుకదా, తొడిమకూడా చిర్నవ్వదు. ప్రేమలాంటి నక్షత్రఖచిత ఆకాశమొకటి స్వప్నంలా బులిపిస్తుంది. ఎవరు తెరుస్తారు కిటికీలు? గుహతొలిచే పులికోసం అన్వేషిస్తావు. ఎప్పటికప్పుడు నీడను తరిమికొడతావు. కనిపించిన దారెంబడి నడుచుకుంటూ పోతావు. ఎవరొస్తారు తోడు? కత్తులులేని ఆకురాయి గరుకుతనం యవ్వనచర్మం పొడవునా వొరుసుకుంటూ వుంటుంది. భూమికన్నా శరీరం భారమవుతుంది. దేహం గుండా భూమధ్యరేఖ దూసుకుపోతున్న చప్పుడికి ఉలిక్కిపడతావు. పోటెత్తే రక్త సముద్రానికి హై బిపి అని పేరెడతాడు డాక్టరు. మెదడు నిండా క్షణాలు ఉబ్బిన శవాలవుతాయి. మృదువైన సంధిగ్థ సంధ్య కూడా ఈడిపస్ కాంప్లెక్స్ లా అనీజీగా కమ్ముకుంటుంది. వున్నట్టుండి కట్టలు తెంచుకున్న మురికినది వొక్కటి నీలోపలినుంచి లోపలికి వొరుసుకుని ప్రవహిస్తుంది. క్రమంలోంచి క్రమం పుట్టి క్రమంలోకి వెళ్లిపోతుంది. నువ్వొక ధీర్ఘ నిశ్వాసమవుతావు. 21/12/94,... ప్రవాహగానం నుంచి. 26/3/14

by Bhaskar Kondreddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/P1ssQJ

Posted by Katta

Nirmalarani Thota కవిత

ఉన్నట్టుండి తెరుచుకున్న నయనాల్లోకి ఓ స్వప్నం దోబూచులాడుతుంది.. ఓ స్మృతి రేఖ పెదాలపై చిరునవ్వు తళుకవుతుంది ఉన్నట్టుండి ఓ లేలేత భావోద్వేగం మేని పులకింతవుతుంది ఓ ఆశా పవనం నుదుటిపై అమ్మ లాలింత స్పర్శవుతుంది ఉన్నట్టుండి ఓ పలకరింపు మూగబోయిన భావాలను నిదురలేపుతుంది ఓ అనుభూతి కెరటం తనువును నిలువునా తడిపేసి వెళుతుంది ఉన్నట్టుండి ఓ పిలుపు శూన్యాలను దాటి జీవితమంతా నినదిస్తుంది ఓ ఓపలేని ఆత్మీయత ఝుంఝుమ్మారుతంలా గుండెను కుదిపేస్తుంది కొన్ని పరిచయాలెందుకు వెంటాడుతాయో కొన్ని ఙ్ఞాపకాలెందుకు వేటాడుతాయో కొన్ని బంధాలెందుకు మనసును కట్టేస్తాయో కొన్ని వ్యక్తిత్వాలెందుకు అస్తిత్వాన్ని కూడా దోచేస్తాయో జీవితమంతా అలోచించినా అంతు చిక్కని ప్రవళిక.. విఙ్ఞానమెంత వృద్ది చెందినా శోధించినా మెదడుకందని ప్రహేళిక మనస్తత్వ శాస్త్ర గ్రంధాలెన్ని ఉద్భవించినా కొన్ని ఫీలింగ్స్ కి కారణాలు దొరకవు . . కదిలించే ఆర్ద్రత తప్ప..! !

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hs8B3X

Posted by Katta

Yasaswi Sateesh కవిత

యశస్వి*పొసగని కాలంలో..* సమాధానం చెబుతాను.. అడిగింది నువ్వే.. నమ్మడం మాట దేముడెరుగు వినిపించుకోవు.. మరి అడగడమెందుకో అర్థం కాదు.. రోదిస్తావ్!.. బాధిస్తావ్.. సాధిస్తావ్ నా మనోఆకాశాన్ని చిందరవందర జేస్తావ్ నే ధ్వని కాలుష్యాన్ని, పదకాలుష్యాన్ని ఆశ్రయిస్తాను. ఒకరికి పట్టిన దెయ్యాన్ని వేరొకరు వదిలించాలని చూస్తాం సమాధానపడడం సాధ్యం కాదు పరిస్థితి విషమిస్తుంది. కొన్ని క్షణాలు మరణిస్తాయి మన మధ్య చీకటి పరుచుకుంటుంది. నువ్వు అంతఃపురంలో విశ్రమిస్తావ్ నే సమాధిలోకి దారి వెతుకుతుంటాను. కీచురాళ్ళు రొదపెడుతూనే ఉంటాయి. కాలం అకాలంలో శమిస్తుంది మరోనిముషానికి శపిస్తుంది ఏదోశక్తి ఇద్దరినీ పరీక్షిస్తుందని ఎవరో ఒక్కరికే అనిపిస్తుంది ప్రాణం పాతరోజులకై పరితపిస్తుంది అందని ఏకాంతం పరిహసిస్తుంది దిండు తడుస్తుంది రాత్రి గడుస్తుంది.. పొద్దు పొడుస్తుంది నిట్టుర్పు విడుస్తుంది ఇద్దరి మధ్య ప్రేమ.. మౌనంలో పురుడుపోసుకుంటుంది అహంలో ఊపిరితీసుకుంటుంది ఇచ్చిపుచ్చుకోవడంలో తీరాలు దాటిస్తుంది అంతరాలు పాటిస్తుంది మాటల్లో ఉరితీసుకుంటుంది చేతల్లో కసిదీర్చుకుంటుంది రాతల్లో ఓదార్చుకుంటుంది ప్రేమ అమరం.. కదా! తను మాయమై..మనసుల్ని చంపేస్తుంది.. మనుషుల్ని మాత్రం కొన ప్రాణాలతో నిలిపే ఉంచుతుంది.. అదేమంటే.. కలసి జీవించడం కావాలి కదా అంటుంది. == 26.3.14==

by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QfuPAC

Posted by Katta

Abd Wahed కవిత

సాంప్రదాయికంగా గజల్ కు ఉన్న ’’ప్రేయసితో సంభాషణ‘‘ అన్నఅర్ధానికి అనుగుణంగా ఒకే రదీఫ్ ఖాఫియాలతో వీలయినన్ని షేర్లను, ఒక సుదీర్ఘ గజల్ గా తెలుగులో రాస్తే... ఈ ప్రయోగం ఎలా ఉందో పాఠకులే చెప్పాలి. నాల్గవ విడత ఐదు షేర్లను ఇప్పుడు పోస్టు చేస్తున్నాను. ఇప్పటికి పదిహేను షేర్లు అయ్యాయి. పదహారవ షేర్ మరో మత్లాగా రాశాను. మత్లాతో కలిపి చదివితేనే గజల్ అందం. గజల్లో ప్రతి షేర్ దానికదే స్వతంత్రంగా ఉంటుంది, కాబట్టి ఇలా ఒక యాభై లేదా వంద వరకు షేర్లు రాయాలన్నది ఆలోచన. ఈ ప్రయత్నం ఎలా ఉందో చెప్పడం మరిచిపోవద్దు.. ప్రతిమాట తేటతెనుగు తీయదనము లాగున్నది ప్రతి శ్వాస సన్నజాజి పూలవనము లాగున్నది వెలుగుతెరలు పిట్టల్లా గూడుకట్టి చెట్లపైన చూస్తున్నవి చంద్రముఖికి స్వాగతము లాగున్నది ముత్యాల్లా మిలమిలమని మెరుస్తున్న మాటలు దేవవీణ తీగల్లో సంగీతము లాగున్నది మంచుతెరలొ దాగిఉన్న మల్లెపూల దరహాసం కుచ్చీళ్ళలొ చిక్కుకున్న చక్కదనము లాగున్నది వినువీధిన తారకలే నేలవాలి పోయాయా నీ వాకిట ముగ్గులతో అద్భుతమూ లాగున్నది

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QfuQVb

Posted by Katta

Yasaswi Sateesh కవిత



by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hrpN9Q

Posted by Katta

Pardhasaradhi Vutukuru కవిత

మనం ఏ సమాజం లో వున్నాం మనుషుల మధ్య వున్నామా మృగాలతో కలసి జీవిస్తున్నామా ఏమిటి ఈ పైశాచికత్వం ఎందుకు ఈ విస్రుంఖలత్వమ్ ఈనర రూప రాక్షసులకు నీ నా భేదం లేదు పెద్ద చిన్నా వయో భేదం లేదు పసి పిల్లలనుంచి వయో వృద్దులకు లేదు కదా రక్షణ ఈ నీచజాతి మనుషులనుంచి గుడిసె లో రక్షణ లేదు భవంతులలో రక్షణ లేదు బీద పిల్లలకు లేదు రక్షణ బ్యాంకు అధికారి భార్యకు లేదు రక్షణ పట్టు మని పాతికేళ్ళు వుండవు అత్యాచారాలు ,హత్యలు ఎటు పోతోంది మన రాష్టం వీళ్ళను పట్టుకునే వ్యవస్థ ఏమి చేస్తోంది శవాన్ని అక్కడే వుంచి హంతకులు దారి తప్పిస్తే గుడ్డి అధికారులు అలాగే తిరిగి అధికారులు వెళ్ళిన తరువాత శవాన్ని నదిలో వేస్తె తరువాత పరిశీలనా ఎంత ఘోరం వాళ్ళు పట్టి బడితే జరిగిన అత్యాచారం ,హత్య రోజంతా ప్రచారం చేసి కుటుంబాన్ని మానసిక అత్యాచారం చేసే అధికారం మీడియాకు ఎవడు ఇచ్చాడు ?? హత్య జరిగినది ,హంతకులు దొరికారు చెప్పుకోవచ్చు అత్యాచారం చేసి అని పదే పదే ప్రచారం చేస్తే ఆ కుటుంబ ఏమి అవ్వాలి ఇది ఏమి నీతి ?? ఏమి సమాజం ?? !!పార్ధ !!26mar13

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gBqnXo

Posted by Katta

నవీన్ కుమార్ కొమ్మినేని కవిత

!!నవీన్ కుమార్!!03/26/2014 ఒక వేసవి వాగున నీరల్లే మెరిసినదే నీ రూపం వేకువజామున కిరణంలా తాకినదే నీస్నేహం మేఘమాలవై నామదిలో తాళమే నువై నాహృదిలో నిలిచినావే నిరతమై నా కళ్ళల్లో చిరుదివ్వెల్లే !చ! ఒక మేఘమై నువురావే నీ జడిలో తడపగా నన్నే నెమలిపింఛమౌ నువ్ నా ప్రియ స్వప్నమే నీ తీపితలపులే నిలిచెను నాలో తనువంబరమున తేలే... నీ పాదాలే స్పృశియించే పూమార్గం నేనే !చ! మది అలలనురగలుగ చేరే..అందాల తీరం పలుజన్మలందు నీతోడే ..కోరే క్షణం నీవలపు తలుపులే తెరిచెనునాకై మనమందలమున ఊగే నామదిలోన నిదురించే కలవైనావే (మలయాళం సినిమా "ప్రణయకాలం"లోని "ఒరు వేనల్ పుళ్రయిల్ తెలినీరిల్" అనే పాట స్పూర్తితో నేరాసిందిది. అంతా మేల్ వెర్షనే. కొంచెం సొంతపైత్యం, చాలావరకు అనువాదం.. ఇక్కడ ప్రచురణార్హం కానిచో తొలగించగలరు)

by నవీన్ కుమార్ కొమ్మినేని



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/P06uh0

Posted by Katta

Yasaswi Sateesh కవిత



by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gBqna6

Posted by Katta

Chakra Pani Yadav కవిత

ఆటవెలది పద్యం నన్నయింట పెరిగి నడక నేర్చిన భాష కృష్ణరాయ కొలువు కులుకు లీని నేటి కవుల చేత నానా రుచుల జూపె తేనె లొలుకు తెలుగు తీపి నెరుగు

by Chakra Pani Yadav



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/P06tJV

Posted by Katta

Madhavi Annapragada కవిత

//మాధవి అన్నాప్రగడ//మది గాయం // అక్షరాలకందని శిక్షేదో వేసినా... మది మౌన పోరాటంలో నను బందీని చేసినా.... నీ పేరే లిఖిస్తున్నా ..ఆవిరైన నా ఆశలపైన...!! అడుగుల జాడవి నువ్వైనా ..... నా గమ్యానివి నువ్వని తెలిసినా ..... దిక్కు తోచక ... దిక్కులు చూస్తున్నా అదేం చిత్రమో..!! నీచూపుల తీరంలో కొట్టుమిట్టాడే కోటి కలలు నీ మౌనంలో మరణిస్తున్నాయి .... నీకలవరింతల్లో నాకన్నీళ్లు దాచేస్తూ ఎదచాటు వేదనని నొక్కేస్తున్నా. నీ జ్ఞాపకాల ఒంటరితనంలో పూర్తిగా ఓడిపోయి .. తప్పక చేస్తున్నా మదిని ముక్కలు... గాయం నాకే అని తెలిసినా... అందుకేనేమో......!! నిన్న నా కౌగిలిలో ఒదిగిన నువ్వు... నేడు నా అక్షరాల్లోనే మిగిలిపోయావు.....!!! 26/03/14

by Madhavi Annapragada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jHDC6H

Posted by Katta

Jwalitha Denchanala Jwalitha కవిత



by Jwalitha Denchanala Jwalitha



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dqngkA

Posted by Katta

Ramadasu Tanguturi కవిత

తెలుగు జాతి మనది..26-Mar-2014/Ramdas తెలుగు జాతి మనది..రెండుగ విడిన జాతి మనది.. జాతి గౌరవం మోకరిల్లగా..విశాలంధ్రకు వేరు శాసనం..! ||తెలుగు జాతి|| తెలంగాణం ఒక త్రికోణం.. ఆంధ్ర ప్రాంతమొక అగ్ని పర్వతం.. రెండిటి మధ్య ఆగాధం..పూడ్చడమే మన విధానం..! మూడు లింగముల పేరుతో..ముచ్చటగా వెలిగిన మన తెలుగు..! ముక్కల చెక్కల చిక్కులతో..ఉక్కిరి బిక్కిరిగ మిగులు..! ||తెలుగు జాతి|| గౌతమి క్రిష్ణలకేం తెలుసు..అంధ్ర గుండెలొ ప్రాకారం..! బంగళాఖాతం చేరిక ముందరే..బంధువులిద్దరి వివాదం..! ఆనకట్టల ఆయకట్టులతొ..ఆన్నపూర్ణకు ఆటపట్టుగా వెలిగిన భూమి..! అన్నదమ్ముల ఆవేశంతొ..మనకిపుడు తరతరాలకు తీరని లేమి..! ||తెలుగు జాతి|| రచన: టి.వి.రాందాస్ సెల్:+91 9010474244

by Ramadasu Tanguturi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jHDzrD

Posted by Katta

Chi Chi కవిత

_రెండు రాళ్ళు _ జ్ఞాపకమే జ్ఞానమంతా!! చొరవ చేసే మర్మమేదో చెరిగిపోదని జన్మలో వెలుగు తానని తెలిసి కలిగిన చీకటెoతో చేటని నివురులూదిన నోటి మాటకు ఎదురుతిరిగిన కాంతికి జారవిడచిన దారులన్నీ ఒక్కదారై ఎదురుపడితే!! మరలిపోదది మాటచాటున మర్మమో అది మంత్రమో మనది కాదది మనసు చాటున మౌనమో అది మాయమో వినదు చెప్పదు వింత కాదు , వదిలిపోదూ తిరిగిరాదు సాకుతానని సామెతంటే , సాగమనటం పాటి కాదు!! మూలమేదని మాటలంటే , మాటలేదని మూలమన్నా మూల మాటల మూలమేదో మరిచిపొమ్మని మౌనమన్నా ప్రాణమిక్కడ పాతుకుందని పాత కాదని కొత్తదన్నా కొత్తదేదని కొమ్ములొచ్చిన కోరికేదో కోరనన్నా అయినదంతా మరచిపోయినా అయిన వారం కాకపోము జ్ఞానమైనా మరిచిపోయే జ్ఞాపకాలం కాదు మనము రెండు రాళ్ళకు ఊపిరొస్తే రాళ్ళు రాళ్ళే కాళ్ళు రావు కాంతి కల్పిన కార్యమేదో కాకపోదది కాస్త మేలు!!___(26/3/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jHDzaY

Posted by Katta

Sana Chittaluri కవిత

'చిత్తలూరీలూ మనసులో వుంటరు, మాటల్లోకి రారు. చూపుల్లో వుంటరు, కల్లల్లో ప్రతిబింబమై మెరవరు. ఊపిరిలో వుంటరు, చిరుగాలై తాకరు. మన గుండె గదుల్లో మౌనంగా తిరిగే సీతాకోక చిలుకలు కొందరు...! చిత్తలూరి 9603254546

by Sana Chittaluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jHjkKH

Posted by Katta

Laxman Swamy Simhachalam కవిత

లక్ష్మణ్ స్వామి || దగ్ధ మోహన గీతం !! || కరకు శిలా పుష్ప పత్ర ఆకు రాగపు శిలాజం జ్వలిత నేత్ర పర్వత నయనం అరణ్య వీణ కొ౦డ గుహలో నాదం ! ఇసుకరేణువుల కేంద్రకాల్లో ప్రకంపన కడలి అడుగున తడబడ్డ కెరటం గుడ్లగూబ నేత్రపు చూపుల్లో అంగారక సౌందర్యం !! గబ్బిలాలబిలాల్లో చలరేగిన ఆర్త నాదం తాజ్మహల్ పునాదుల్లో పావు ‘రాళ్ళు’!! ఎండమావుల్లో చంద్రవదన మాయా మొహం దాహం తీరదు ! అగ్నిశిఖల్లో ఆవిరి చినుకు కునుకు తీస్తూ ... శిథిల ఆలయాల్లో సమాధైన ఓంకారం! పూల పెదాల సుధల్లోకి జాలువారిన అక్షరం పొన్న చెట్టు వేళ్ళ అడుగున సన్నాయి పాట వింటూ సమాధి ఆత్మల తన్మయం ! నెత్తుటి ద్వారాల్లోనుండి జాలువారిన వెన్నెలని కాల్చిన లావా ! బిచ్చగాడి పళ్ళెం లో పరవశిస్తున్న oనాణెం, ఖణ్ ఖణ్ మంటూ ...! చర్చి గంటలు ఆకలి మంటలకు తోడయి జ్వలిస్తూ ...! నక్క స్వప్నంలో నగ్నమైన యువరాణి పరాభవానికి తోడేళ్ళ దండోరా ! నీరెండిన భావిలోని కప్ప కన్నీటి కొలనులో విచ్చుకున్న కలువ ఆరే ఆఖరిదీపం ! రాలు పూల పాటల్లో రెల్లుగడ్డి పూల గర్జన! గడియారపు ‘ముళ్ళు’ దిగి ఉబికిన రుధిర వరదల్లో చేపల హంగామా !! వడ్రంగి పిట్ట చెక్కిన బొరియల్లో ని వజ్రాల మూటల రాశులకి కాపలా వున్నా కాల నాగులు ! కోన ఊపిరిని కొవ్వత్తిని చేసి ప్రాణ దీపాన్నాపే శ్రామికుని గొంతు పై వేలాడుతున్న ఖడ్గం ! కుత్తుకల్ని కోసే కసాయి స్వప్నాకాశాన కారుణ్య జాబిలి ! మన్మధున్ని కాల్చేసిన విభూధి నుండి ఉన్మాది ఆధ్యాత్మికం ! చీమలు వెంటే గొర్రెలు మేకలు ... చిలుక పలుకుల సారంగి ! నెమలి మా౦సం తింటూ జాతీయ గీతం పాడే ‘మార్లు మాతంగి’ సవా లక్ష భిన్న పూల విలక్షణ కాందీశీక కవి సంచి నిండా కమిలిన, అమలిన అక్షర పుష్ప భాష్పాలు !! -----------------26 -03 - 2014

by Laxman Swamy Simhachalam



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h8VpES

Posted by Katta

Ramadasu Tanguturi కవిత

---Notuku votu...25-mar-2014----

by Ramadasu Tanguturi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jHjhhX

Posted by Katta