పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, మార్చి 2014, శనివారం

Cv Suresh కవిత

సి.వి.సురేష్ || రె ౦ డు హృ ద యా ల మ ధ్య న‌ || ఇక చాలిస్తావా? ప్రవహిస్తున్న నీ జ్ఞాపకాలకు అడ్డుకట్ట‌ వేయ‌వా? శరాఘాతాల్లా తగులుతున్న నీ ఊహలకైనా చెప్పు ఇక‌ భరి౦చే శక్తి నా గు౦డెకు లేదని నీ ఆలోచనలు అగ్నికణికలను రాజేసి హృదయాన్ని మెలిపెడుతున్నా జాలిలేని కాల౦ ఆగిపోతో౦దే కానీ నా లోని శేష ప్రశ్నలకు సమాధాన౦ ఎక్కడ? ప్రతి అస్తమాన౦ వేదనని మిగిలిస్తో౦టే ఘనీభవి౦చిన రాత్రుళ్ళు నాలోని చీకటితో సయ్యాటలాట‌ నా మనో గదిలో ప్రశ్నల హోరుతో నేను విలవిల ఏకా౦తాలను కమ్మేసే మరుపెరుగని నీ సా౦గత్య౦ రొజుకి౦త గు౦డెను తొలుస్తూ నాలోనే బాసి౦పట్టేసుకొని ఋతువుల జాడే కనిపి౦చని నా జీవితాన‌ ఎ౦డుటాకుల శబ్దాలు కర్ణకఠోర౦గా మౌన స్థబ్ధతను నే పధిలపరుచుకొ౦టే ఉలుకూ పలుకు లేని నీ జ్ఞాపకమే నన్ను తీవ్ర హి౦సకు గురి చేస్తు౦టు౦ది 2 అయినా సరే... నాలా నీవు వేదన పడకూడదని నేననుకు౦టానా! నా మనసు మాత్ర౦ నీవి౦కా నాకన్నా ఎక్కువగా బాధ‌ పడాలని అనుకొ౦టో౦ది నిన్నె౦తగానో ప్రేమి౦చే నాలో... ఈ వి౦త స్థితి నాకే ఆశ్చర్య౦!!! @ సి.వి.సురేష్

by Cv Suresh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k3QdCx

Posted by Katta

Bharathi Katragadda కవిత

సీ. ఇంతుల చరితలు ఇలలోన మెరువంగ కన్నీటి రాసుల కథలు ఏల? మహిళలే రాణులై మహిని పాలింపగ కన్నీటి రాసుల కథలు ఏల? సిరులనే కురిపిస్తు శ్రీలక్ష్మి నడవంగ కన్నీటి రాసుల కథలు ఏల? చదువుల శక్తిచే శారద నడవంగ కన్నీటి రాసుల కథలు ఏల? తే. తరుణి కథలన్ని బాధలె తరచి చూడ అతివ రెక్కలకష్టమె అవని వెలుగు పురుష లోకాన కామపు ముసుగు లోన తరతరాలుగా తరుణియె తల్లడిల్లె!

by Bharathi Katragadda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k3N6KA

Posted by Katta

Srinivasu Gaddapati కవిత

అగ్నిపర్వతం ---------------- హిందీ:-ఓంప్రకాష్ వాల్మీకి స్వేచ్చానువాదం:_శ్రీనివాసుగద్దపాటి _________________________________________ గడిచిన ఆ క్షణాలగురించి ఏడుస్తూ కూర్చుంటావా..?! కాన్నీళ్ళు కారుస్తూ కూర్చుంటే మనకుదొరికేదేంటి.....?! సానుభూతి.... దయ..... కరుణ... ఇంకా..... వారి వేదనాభరితమైన కవిత్వం పొస్ట్ కవర్లలొ ఉత్తారాలు మరో కవరు ఇంకో ఉత్తరం ఆ ఉత్తరాలను చూస్తూనే.. ద్వేషంతో చింపేస్తూ.. చెత్తబుట్టలో పారేయటం ఎప్పుడైనా చూశావా...? కన్నీళ్ళు తుడుచుకో.. ఆపేయ్ వాటిని మూసేయ్ ఆ అవమానవీయ అకృత్యాలను లావాలాచేసేయ్ కూడబెట్టుకున్న ఆ కన్నీళ్ళను ఏదో ఒకరోజు అది తన్నుకొస్తుంది అగ్నిపర్వతం లా.... 08.03.2014

by Srinivasu Gaddapati



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NKe5Qt

Posted by Katta

Harish Babu కవిత

//అందుకే నువ్వు అమ్మవైనావ్//భీమ్// నా కష్టాల్లో కన్నీళ్ళై.., నా సంతోషం వెనుక కారణం అయ్యావ్ అలిగినపుడు తరగని కూటి కుండ.., ఫోన్ చేయనప్పుడు నిద్రపోని రాత్రులు హాస్టల్ నుంచి ఇంటికి వొచ్చిన ప్రతిసారీ దీర్ఘంగా నన్నే చూసే ఆ కళ్ళకు..., ఏం ఇచ్చి ఋణం తీర్చుకోను...! ఋణం సంగతి దేవుడికి ఎరుక.., నువ్వు పదికాలాలు చల్లగా బ్రతుకు బిడ్డ అంటావ్ అందుకే రాజేశ్వరి నువ్వు 'అమ్మ'వైనావ్ మొగుడు తాగొచ్చి కొడుతుంటే.., ఉయ్యాలలో నిద్రపోయే బిడ్డ భవిష్యత్తు అంచనా వేస్తూ తన్నుకొచ్చే ఏడుపుని కడుపులో దాచిపెట్టి కన్నీళ్ళనే ఆకలిగా తీర్చుకున్నావ్ పట్నంలో చదివే కొడుకు ఇంటి నుంచి తిరిగి వెళ్తుంటే ఒక్కసారైనా చూడకపోడానీ వాడి చూపుకోసం రోడ్డు మలుపు దాక ఎదురుచూసే ఓ చిన్ని ఆశవైనావ్ ఒకటేమిటి "అమ్మ" చెప్పుకుంటూ పోతే ఎన్నో...! ఈ జన్మనిచ్చినందుకు కృతజ్ఞతలు చెబితే స్వార్ధం అంటావ్ అదే స్వార్ధంతో నేనే అందరికన్నా మిన్నగా బ్రతకాలని ఆ దేవుడినేకోరుకుంటావ్ ...! నీ ప్రేమకు నేను ఏం చేయగలను అమ్మ ఇలా పిచ్చి వ్రాతలు వ్రాయటం తప్ప...!

by Harish Babu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NK0jND

Posted by Katta

Yasaswi Sateesh కవిత



by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1imDs8E

Posted by Katta

Yasaswi Sateesh కవిత



by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ecPwSx

Posted by Katta

Sri Modugu కవిత

శ్రీ మోదుగు // దీవెన … // ఈ నల్ల రాళ్ళలో తెల్లని కలువా పడి లేచిన కెరటమా ఉదయించే అరుణమా అవమానాలను అధిగమించి భయాలను బందీ చేసి పసలేని త్యాగాలను కాలరాసి ఆడంబరాలను తృణీకరించి నిబ్బరానికి ప్రతీకగా ఉత్తేజానికే ప్రెరణ గా వాస్తవానికి కానుకగా నిలిచిన నిత్య చైతన్యమా ఇదే నా దీవెన మనో వాంఛా ఫల సిద్ధి రస్తు.... Date:08/03/2014

by Sri Modugu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k37awR

Posted by Katta

Nirmalarani Thota కవిత

పూవు విరిసింది . . వెన్నెల కాసింది . . చినుకు కురిసింది . . హరివిల్లు వెలిసింది . . సృష్టిలో ప్రతీది స్త్రీ వాచకమే . . పకృతంతా స్త్రీ మయమే . . ! ఆకాశమై పరచుకునే మనసు మాదే . . నీరై కరిగి జాలువారే ప్రేమ మాదే . . అవని ఒడలంతా మోసే సహనమూ మాదే . . ఉచ్వాస నిశ్వాసాల గాలిలో ఊపిరి పోసేది మేమే . . దీపమై వెలుగు పంచే వంటచెరుకై కడుపు నింపే నిప్పు కణికలం మేమే . . పాతాళ గంగ మేమే . . హిమవన్నగ శిఖరం మేమే . . నింగి నేలా నీరూ నిప్పు గాలి పంచభూతాలు మా రూపాలే . . చైత్ర కోయిలలై చైతన్య గీతికలై జగతిని మేలుకొలిపే సుప్రభాత వీచికిలం . . జీవితమంతా పూలై, పండ్లై , నీడై , చివరికి వంట చెరుకై కాలిపోయే తరుణీ తరువులం . . ఎవడురా. . . ఆడది అబల అన్నది . . ? పురుటినొప్పులకోర్చి జన్మనూ తనవారి తప్పుల్ని కడుపులో దాచుకొని అడుగడుగునా ఆలంబనై జీవితాన్నిచ్చే సహన బలం మీకుందా . . ? పస్తులుండి కూడా రక్తాన్ని పాలుగా చెమట చుక్కల్ని పంచభక్షాలు చేసి తన వారి కడుపు నింపే మా త్యాగం బలం మీకుందా? కట్టుకున్నవాడు తరిమేసినా కసాయి సంఘం వెలివేసినా కాఠిన్యపు విధి కాటేసినా ముళ్ళ బాటన రక్తమోడుతూ కన్న పిల్లల్ని వెలుగు బాటన నడిపించే మా మనో బలం మీకుందా? కండబలం కాదురా . . గుండెబలం కావాలి . . ఆ కండల్ని పెంచింది మేమేననే బుద్ది బలం కావాలి . . కాసింత ప్రేమ చూపితే అల్లుకుపోయే గోరంత అత్మీయత పంచితే అంకితమైపొయే " ఆడ మనసును " అర్ధం లేని ఆంక్షలతో అంతం లేని కాంక్షలతో ఆధిక్యపు పురుషంకారంతో ఆత్మభిమానాన్ని కించ పరిచి పోరాట బాట పట్టించారు . . గదిలో బంధించి కొడితే పిల్లికూడా పులి అవుతుందే . . మరి తల్లి ఏమవుతుంది . . ? సహనాన్ని సౌహార్ద్రతనీ అసమర్ధతగా భావిస్తే సీతలు సత్య భామలై . . అనసూయలు అపరకాళికలై అంతు చూస్తారు . . మనసు కళ్ళు తెరిచి చూడండి . . ఇది . . మగాడితో చెలగాటం కాదు . . మనుగడ కోసం పోరాటం . . మోజుపడ్డ ఆధిపత్య పోరు కాదు . . గాయపడ్డ అస్థిత్వపు కడలి హోరు . . ఏదో ఒక రోజు తీరం దాటిన కెరటాలు ఉప్పెనై ముంచుకొస్తే . . మునిగిపోయేది మీరూ . . మేమూ . . ఇకనైనా మారండి . . ఆడదాన్ని అబలగా కాక ఆలంబనగా గౌరవించండి . . ఆత్మీయంగా అక్కున చేర్చుకోండి . . ! ప్రకృతంతా పరుచుకున్న ధరణి మేమైతే సూర్య చంద్రులు మీరు . . తొలి పొద్దులో మీ చుట్టూ మేము . . మలి సంధ్యలో మా చుట్టూ మీరు . . జీవితాంతం తిరగాల్సిందే . . సహగమనం సృష్టి గమనం సాగాల్సిందే . . ! నిర్మలారాణి తోట [ తేది" 08.03.2014 ]

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ecyzaJ

Posted by Katta

Jaya Reddy Boda కవిత

// జయ రెడ్డి బోడ // మహిమాన్విత // యాస లోనైతేనేం గిరిజన బాషలోనైతేనేం తల్లిగా నీ ప్రసవం ఒకటే ఆ లాలింపూ.. ఒకటే నీ ప్రేమకోసం తపన పడే ఒకరికి యుద్ధం, నీ ఓదార్పే ఒకరికి సింహాసనం నిన్ను గెల్చుకోవడమే ఒకరికి రాజ్యాధికారం నీ తోడుతో జీవన నౌకను నడిపిన నావికుడికి చిరకాలపు.. సేద దీర్చు ఒక సుమధుర తల్పం నువ్వు బ్రతుకు పోరులో అలసిన వారికీ దేవుడిచ్చిన గొప్ప వరం నీ ఒడి, నీ చిట్టి చేతులే ఎడారి బాటసారికి చల్లని వింజామరలు మళ్లీ నువ్వొక దినానికి కట్టిన ఒక రూపు రేఖవు కాదు వెరసి సర్వ మానవాళి ఇచ్చలు దీర్చు ... కలియుగ కల్ప వృక్షానివి నువ్వు .. ఓ అతివ ఓ మహిళా.. గొప్ప మహిమాన్వితవు నువ్వే నువ్వే ... ! (08-03-2014. మహిళా దినోత్సవం సంధర్భంగా మహిళా మణులు అందరకు శుభాకాంక్షలు )

by Jaya Reddy Boda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ecyyUr

Posted by Katta

Padma Sreeram కవిత

మహిళా దినోత్సవం...??? ||పద్మా శ్రీరామ్|| ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి… ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి… మారుతున్న కాలంతో మగువ కూడ మారాలి మంద బుద్ధి నడక మాని మగువ తెగువ చూపాలి మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ. త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ ఇవీ సమాజం ఆడవారి కళ్ళకు తీయగా కడుతున్న వలువలు.యుగయుగాలుగా ఎవరి కాలికిందో కాదు తను నమ్మిన సంప్రదాయాల విలువల క్రింద తనని తానే బందీ చేసుకున్న అమాయిక మహిళల గాధలు పునశ్చరణ చేసుకుందామా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగానైనా ఒకపరి… నిజాయితీగా…. త్రేతాయుగం….. అయోనిజ భూజాత…శీలపరీక్ష పేరుతో అగ్నిపునీతై , అమాయత్వానికి ఏకైక సింబల్ ఆఫ్ వుమన్ గా యుగయుగాలకు నిలిచిపోయిన ధాత్రి .. సీత… శీలమంటే ఆడవారికి మాత్రమే కాదు నిర్దేశింపబడినది…ఏక పత్నీవ్రతం చేపట్టిన శ్రీరామచంద్రుడికీ శీల పరీక్ష కోరవలసినదే కదా సీతమ్మ తల్లి…. కోరలేదు సరికదా భర్త ఆజ్ఞ కు శిరసొగ్గింది… అదలా ఉంచితే ఎవడో చాకలివాడు ఏదో అన్నాడని రాజ ధర్మం పేరుతో నిండుచూలాలిని నట్టడవికి పంపేస్తాడా ??? మనందరిచేతా పురుషోత్తముడిగా పిలువబడుతున్న రామచంద్రమూర్తి చేయతగ్గ కార్యమేనా ఇది? పెళ్లిలో మంత్రాల అర్ధం ఇదేనా? నాతిచరామి అంటే ఇంతేనా ? ఆడిన మాట తప్పనివాడు ఆదర్శపురుషుడు మన రాఘవుడు …మరి ముందు జరిగినది పెళ్ళి…అన్నమాట నాతిచరామి..తరువాతే రాజయ్యాడు…మరి రాజ ధర్మం ముందు వైవాహిక వాగ్దానం వీగిపోయిందా…పాపం సీతమ్మ తల్లి ఎంత వగచిందో అజ్ఞాతవాసంలో ఎన్ని ఇక్కట్లు పడిందో….కానీ నిశ్శబ్దంగా పిల్లలను భర్తకప్పగించి అవతారం చాలించింది…అదీ మౌనంగానే భర్తను ఏనాడూ తూలనాడి ఎరుగదు.ఎందుకిలా చేసావని ఎదురుపడి అడిగిన దాఖలాలూ లేవు…త్రేతాయుగపు మహిళాధ్యాయం ఆ తల్లి మౌనంతోనే ముగిసిపోయింది… అక్కడే నిలిచిపోయింది. ద్వాపర యుగం . ఒక విధివంచిత కాదు కాదు భర్తృ వంచిత అయిన ద్రౌపది కధ. కురుక్షేత్ర సంగ్రానికి బీజమేసిన అతివ వ్యధ. మౌనమవలేదు ఈ మహిళ. అన్యాయమనిపించిన చోట ఎలుగెత్తి ప్రశ్నించింది. మనసైనవాడూ, స్వయంవరంలో తనను గెలుచుకొన్నవాడు అమ్మ మాటను అడ్డంపెట్టి అన్నతమ్ములకు పంచాడు. ధర్మరాజు అనే పేరు మాటున ఒక భర్త తన్నొడ్డాక పెళ్ళాన్నొడ్డాడు. అసలు ఆ సమయములో ఆమె ఎవరి పత్నో చరిత్రకు తెలుసో లేదో . ఒకవేళ అతని పత్ని కానియెడల తమ్ముని పత్నిని ఒడ్డడం ధర్మమో అధర్మమో… ఆ ధర్మరాజుకు,అతని సహోదరులకు ద్రౌపది పాతివ్రత్యం కాని,ఆమె ఎదలో రగిలే జ్వాలలు కాని అర్థమౌతాయని అనుకోవడం మన అవివేకమే అవుతుంది. వారి వారి జన్మలన్నీ కర్మ బంధాలే కావొచ్చు కానీ ఆడది ఎంత ప్రేమించినా సంతృప్తి చెందని సగటు మగాడు ఆనాడూ ఉన్నాడని ధర్మరాజు ద్రౌపది అంతిమ దశలో ఆమెనుద్దేశ్యించి చేసిన విమర్శ ఋజువు చేస్తుంది.. భగవంతునికి స్త్రీల పట్ల ఎంత వివక్షుందో ద్రౌపది నుదుటి రాత ఇలా వ్రాయడంలోనే తెలుస్తోంది. యుగంతో పాటు కాలమూ మారింది . మహిళలు సైతం అక్షర జ్ఞానంతో కొంతవరకూ మారారు. వెనుతిరగక అలసిపోని అవిశ్రాంత శ్రామిక మహిళలు ఆత్మ స్థైర్యంతో విజయ పధంలో పయనిస్తూ అగ్రపధంలో ఉన్నారు. కానీ అవీ వేళ్ళమీద లెక్కించే ఘనతలే. నేటి సమాజాన్ని చూస్తే ఇక చరిత్రలన్నీ ముగిసే కలియుగమొచ్చింది అనిపిస్తోంది . కార్పొరేట్ కల్చర్ పెరిగింది.క్లబ్బులూ పబ్బులూ డిస్కో థెక్కులూ పెచ్చుమీరాయి. వాటితోపాటే మృగాళ్ళకు ఆకలి హెచ్చింది. తల్లి, చెల్లి , కూతురు, మనవరాలు ఎవరైనా కానీ వరసేదైనా కానీ ,పక్కింటమ్మాయి కానీ మతిస్థిమితం లేనిదైనా కానీ , పసికూన కానీ , పతివ్రత కానీ …ఆడదైతే చాలు అనుకుంటూ కిరాతకంగా శీల దోపిడీలు హెచ్చాయి. ఒక శ్రీలక్ష్మి తో మొదలై నిర్భయలతో ముగుస్తున్నాయి చాలా కధలు.ఎక్కడుంది లోపం పుట్ట్తుక లోనా , పెంపకంలోనా, సమాజం లోనా, సినీ ప్రభావం లోనా , నాగరికతల్లోనా? లోపమెక్కడున్నా బలిపశువు వనితే ఎందుకవుతోంది? ఇదే వరుస కొనసాగితే ఆలయాల్లో స్త్రీ దేవతలు కూడా ఉండరు. అమ్మతనం కరువై…మమకారం మరుగై ఎడారైన ఎడదలతో సమాజం బ్రతుకీడుస్తుంది. మహిళ కోరే మార్పు ఎక్కడినుంచో దేవునిలా ఊడిపడదు. మననుంచే రావాలి. మహిళల్లోంచే రావాలి. బూజు పట్టిన భావాల్లోంచి బయటికి రాగలగాలి. వరకట్నపు చావు లేని రోజు , ఆడపిల్లపై అఘాయిత్యాలు లేని రోజు , ధైర్యంగా ఆడవాళ్ళందరూ కనీసం రాత్రి 10 లోపు బయట క్షేమంగా తిరగగలిగే రోజు కోసం ఎదురు చూపు . “ఆకాశంలో సగం అవనిలో సగం…. నా తనువులో సగం…ఇంకేమి ఇవ్వాలి మీకీ జగం” అంటూంటారు కొందరు పురుషోత్తములు. మహిళకు సగ భాగాలక్కరలేదు.అసలు ఎవరిసొమ్మునో ధారాదత్తంగా ఏ మహిళా స్వీకరించదు.తనకూ వ్యక్తిత్వముందని గౌరవించాలి. అస్థిత్వ గుర్తింపుకై ప్రాకులాడే స్థాయి నుంచి మహిళలు దిశానిర్దేశం చేసే స్థాయికెదగాలి . ఎవరో ఏదో చేస్తారని కాదు. ఇది చదివి కొందరైనా స్త్రీల బ్రతుకులు మార్చేందుకు పూనుకొంటారని, తమతో సమాన గౌరవం మహిళకిస్తారనే చిన్ని ఆశ. అప్పటివరకూ వత్సరానికొకసారి ఆకులు రాల్చే శిశిరంలో వచ్చే మూర్దాభిషేకం ఈ “మహిళా దినోత్సవం” …బలిచ్చే జీవానికి బహు పూజలన్నట్లు జరుపుకుంటూనే ఉందాం. మర్నాటికల్లా మళ్ళీ మామూలే…. అయినా సరే చెప్తున్నా నా ప్రియ సోదరీ మణులందరితో పాటు ఇంత బడబాగ్నిని మోస్తున్న నా తల్లి మూగ ధరిత్రి క్కూడా….. “ హ్యాపీ ఉమెన్స్ డే “ 8th March 2014

by Padma Sreeram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1imaqG4

Posted by Katta

ఉమిత్ కిరణ్ ముదిగొండ కవిత

అన్వేషణ... హీమాలయ గుహంతర్బాగాలలో తపస్సు చేసుకొనే ఋషి దగ్గరకు వెళ్ళి నేనడిగాను."దేవుడెక్కడుంటాడు" అని అతడు నావైపు నవ్వుతూ చూసాడు.. కొండల్ని, కోనల్ని, ఎగిరే పావురాల్ని. సముద్రాన్నీ. ఆకాశంలో నక్షత్రాల్నీ.పూసే పువ్వులనీ. పూఅంచురేకుల మీద నిలబడ్డ మంచు బిందువులనీ, దయార్థ్ర హృదయులని.కరుణామయులనీ.ప్రకృతినీ.వికృతినీ,సాకృతినీ. చూపించి ఇదంతా భగవంతుని ఆకృతే అన్నాడు. అసంతృప్తితో వెనుతిరిగాను. పర్వతశిఖరాలు దిగుతూ వస్తూ వుంటే కొండ చరియలలో చెట్టు మొదలు కొడుతున్న ఒక కష్టజీవి నుదుటి మీద చెమట చుక్కలో ఇంద్రధనుస్సు కనబడింది. అందులో దేవుడు నాకు కనబడ్డాడు." అన్వేషణ అంటే అదే, మనలో వున్న శక్తిని మనం తెలుసుకోగలగటం. మనలో వున్న కళని సరిగ్గా గుర్తించి బయటకు తీసుకురాగలిగే ప్రయత్నం చేయటం. అదే సౌందర్యం ! అదే జీవితం !! మన అన్వేషణంతా దాని కోసమే సాగాలి !!! ఉమిత్ కిరణ్ ముదిగొండ 8/3/14

by ఉమిత్ కిరణ్ ముదిగొండ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fan3ks

Posted by Katta

Kancharla Srinivas కవిత

తరతరాల చెరగని రాతిరి దీపాన్ని ముసిరిన చీకటి వేకువేది మహిళా జగతికి వెన్నెలేది మాతృమూర్తికి...

by Kancharla Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/O55wzx

Posted by Katta

Prasada Murthy Bandaru కవిత



by Prasada Murthy Bandaru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n4JQmT

Posted by Katta

Rajkumar Bunga కవిత

ఆర్కే||అమ్మా, అక్కా, చెల్లి, భార్య, కూతురు|| ఈ ఒక్క దినం చేసేయ్యమంటార?? ఒక్క మాటతో రాసేయ్ మంటార ఏమి వ్రాయను మీ కోసం...... ఒక్క రోజులో వ్రాసేది కాదు ఒక్క రోజుతో పోయేది కాదు అమ్మా, నీ "పురిటినొప్పుల" పురాణం ఒక్కరోజులో చెప్పలేనిది అక్కా నీ చెయ్యి పట్టుకొని నేను ఆడిన "దాగుడు మూతలు" ఒక్కరోజులో చెప్పలేనిది చెల్లి నా చెయ్యి పట్టుకొని నీవు ఆడిన "తొక్కుడు బిళ్ళలు" ఒక్కరోజులో చెప్పలేనిది భార్య నా చెయ్యి పట్టుకొని నీవు ఆడుతున్న " జీవిత చదరంగం" ఒక్కరోజులో చెప్పలేనిది కూతురు నా కడుపు గట్టుకొని నీకోసం కూడగడుతున్న " జీవిత పోరాటం" ఒక్కరోజులో చెప్పలేనిది దినం చేసేయ్యమంటార?? ఒక్క దినంతో పోయేది కాదు, బంధం.... మీలో ఏ ఒక్కరు లేకపోయినా ఆ దేవుడు మీ ద్వారా నాకీ రూపం ఇవ్వకపోవును ఆర్కే||20140308||

by Rajkumar Bunga



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PbNxZt

Posted by Katta

Madhav Murthy కవిత

మనకి జన్మనిచ్చేది... బాల్యంలో నడక నేర్పేది.. యుక్తవయసులో ప్రేమను తెలిపేది.. యవ్వనం లో జీవితాన్న్ని పంచుకునేది... వృద్దాప్యం లో సేద తీర్చేది.. మగాడి జీవితానికి అర్ధం లా నిలిచేది..మహిళ. మాధవ - 8/3/2014

by Madhav Murthy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Pbztit

Posted by Katta

వెంకట చలపతి బాబు కూరాకుల కవిత

కూరాకుల వెంకట చలపతి బాబు ||మహిళ ది..నో..త్స..వం.. || వచ్చింది.. మహిళని దేవతని చేసే రోజు వచ్చింది ఎప్పటిలాగే కవుల ఊహలకు కలాలకు పనిచెప్పింది అందరిగొంతులు ఒకే పాట పాడే రోజు రానే వచ్చింది (ఈ ఒక్క రోజే!) మానవతా సంఘాలు, మహిళా సంఘాలు సంఘసంస్కర్తలు (అని చెప్పుకునే వారు) ఎవరైతెనేమి అందరి రంగు ఒకటే..! మహిళా జిందాబాద్! మహిళా జిందాబాద్!! తడి ఆరిన గొంతులో రెండు నీళ్ళ చుక్కలు సృష్టికి మూలం " స్త్రీ " ఆకాశంలో సగం ఆమే! (అని అంటారు అంతే!) నిరంతర పోరటం చేసి అలసిన మనసుకు రెండు సాంత్వన వచనాలు కాదు ఇవి కానే కాదు నవమాసాలు పడ్డకష్టం గాలికి ఒక్క అమ్మ అనే మాటతో.. ఎక్కడైన బ్రతక గలననే ధైర్యం భర్త అనే భారోసాతో.. అలసిన నాడు ఇంత సాయం ఇంట్లో.. ఇవి చాలు స్వర్ణ సింహాసనాలు రత్న కిరీటాలు అక్కర్లేదు బ్రుణ హత్యలు బలాత్కారాలు చెయ్యకపోతే చాలు.. కవిత్వాలు వల్లించనక్కరలేదు కన్నీళ్ళు పెట్టించకపొతే చాలు దేవతని చెయక్కరలేదు మనిషిగా చూస్తే చాలు #08-03-2014

by వెంకట చలపతి బాబు కూరాకుల



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k2qbzt

Posted by Katta

Satish Namba కవిత

సతీష్ నంబా || ఆదిపరాశక్తిని || నేను కల్పవృక్షాన్ని నీవు నన్ను కల్పనగా చూస్తావు నేను అందాల హరివిల్లుని ! నీవు నన్ను అంధకారంలోకి నెట్టేస్తున్నావు నేను నిర్భయమైన నిజాన్ని నీ స్వార్ధంతో నిర్ధాక్షిణ్యంగా తోసెస్తున్నావు ! ఆడది జన్మనిచ్ఛే తల్లని తెలిసీ నాలో నివు నగ్నత్వాన్నిని చూస్తున్నావు మృగాడివై నేను ఆమృతకలశాన్ని నీ జీవనారంభానికి అంగట్లో సరుకులా నన్ను చూస్తావు అమ్మలా కాకుండా ! నేను అనురాగాన్ని రా ఆటబొమ్మని కాను నేను నీకు ఆసరానిరా అలసత్వాన్ని కాను నేనను అమ్మనే కాను ఆదిపరాశక్తిని కూడా ! అభిమానిస్తే ఆదరిస్తా ప్రేమిస్తే ప్రాణమే ఇస్తా అలుసుగా చూస్తే ఆణచివేస్తా పరీక్షిస్తే ప్రాణాలు తీస్తా నేను అమ్మనే కాదురా ఆదిపరాశక్తిని !

by Satish Namba



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hWhkiw

Posted by Katta

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ ------------------।। గాయం ।। నీ కనుల కొలనులు వొలకబోసిన కన్నీళ్లు కాబోలు పాదాల కింద చేరి రంపపు కొత కోస్తున్నాయి . దారంతా ఎడారి మంటయ్యింది ప్రేమ చలిమంటలో హృదయం అగ్నికి ఆహుతైన వేళ . లావాగ్ని రాజేస్తుంది గంధం చిలికే రాతిరి నక్షత్రాలను నిప్పులుగా మార్చుకుని చీకటి సాక్షిగా . ముక్కలైపోయిన మనసు ముక్కలను ఎవరో పేర్చుతున్న శభ్ధం విషంతో అతికిస్తూ . ఎవడో ఒకడు వచ్చి మనసు తలుపు తడుతూనే ఉంటాడు గాయపడ్డ హృదయాన్ని మరమ్మత్తు చేస్తానంటూ . ఇప్పుడు నీ కళ్ళు వర్షించకూడదు జ్వలించాలి ! (08-03-2014)

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hWhk2a

Posted by Katta

Krishna Mani కవిత

తల్లి ప్రేమలో మమకారం భార్య ప్రేమలో అనురాగం చెల్లి ప్రేమలో అనుభందం స్త్రీ ప్రేమలో తరగని సిరులు ఎల్లవేల్లల వెన్నెల వెలుగులు ! -** మహిళా దినోత్సవ శుభాకాంక్షలు **-

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oziUaq

Posted by Katta

Om Prakash కవిత

మిత్రులందరికీ అంతర్జాతీయ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు అమ్మగా జన్మించని జన్మకాదు సార్దకం ఆడజన్మ ఆద్యంతం లోకానికి ఆదర్శం తల్లిగా అమృత క్షీరం అందించినా చెల్లిగా అనురాగం కురిపించినా ఇల్లాలిగా జీవితమంతా ప్రేమించినా ఎన్ని సేవలు చేసినా ..... ఎన్ని త్యాగాలు చేసినా ..... అది ఆడజన్మకే సాద్యం మగజాతి తీర్చుకోలేని ఋణం అందుకే ఓ మహిళా నీకు అడుగడుగూ వందనం అందుకో నా కవితా కుసుమాల నీరాజనం ప్రేమోన్మాదపు నీలినీడలు అడుగడుగునా వెంటాడుతున్నా... అనుమానపు పెనుభూతం భర్తగమారి వేదిస్తున్నా... ఆశయాల సాదనలో ఆంక్షల మంటలు దహియిస్తున్నా ... అలుపెరుగని నీ పయనం అందరికీ ఆదర్శం అందుకే ఓ మహిళా నీకు అడుగడుగూ వందనం అందుకో నా కవితా కుసుమాల నీరాజనం..... మీ అంతరంగం వర్ణించగ సాటిరాదే కవి హృదయం ... మీ ప్రేమ లోతు తెలుపంగ సరితూగలేదు సముద్రం ... మీ ఓర్పుకీ, సహనానికి భూమి తల్లే నిదర్శనం ... అందుకే ఓ మహిళా నీకు అడుగడుగూ వందనం అందుకో నా కవితా కుసుమాల నీరాజనం ..... ..................అంకితం................... వలువలు జార్చి విలువలు మరిచే వనితలున్న నేటి సమాజంలో ... ఇప్పటికీ సనాతన భారతీయ సాంప్రదాయాలను గౌరవిస్తూ అందరికీ ఆదర్శ ప్రాయంగా వుంటున్న ప్రతి మహిళకీ నా ఈ కవిత అంకితం ఈ కవితని ఆదరించిన,ఆదరించబోతున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు ...................................................Oms

by Om Prakash



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h014um

Posted by Katta